Jump to content

ద్రవ్యరాశి

వికీపీడియా నుండి
ద్రవ్యరాశి
2 కి.గ్రా. (4.4 పౌ.) ద్రవ్యరాశి గల తూనిక రాయి
Common symbols
m
SI ప్రమాణంకి.గ్రా
Extensive?yes
Conserved?yes

ద్రవ్యరాశి అనేది ఒక వస్తువు యొక్క సహజ ధర్మము, భౌతిక రాశి. పరమాణువు, కణ భౌతికశాస్త్రం కనుగొనే దాకా దీనిని ఒక వస్తువులో పదార్థం ఎంత పరిమాణం ఉందో చెప్పడానికి కొలమానంగా వాడే సాంప్రదాయ భౌతిక శాస్త్ర భావన. సైద్ధాంతికంగా ఒకే పదార్థం కలిగిన వేర్వేరు పరమాణువులు, వేర్వేరు ప్రాథమిక కణాల ద్రవ్యరాశులు మాత్రం వేరేగా ఉంటాయని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. ఆధునిక భౌతిక శాస్త్రంలో ద్రవ్యరాశికి పలు నిర్వచనాలు ఉన్నాయి. ఇవి ఊహించడానికి విభిన్నమైనవే అయినా, భౌతికంగా మాత్రం ఒకటే. ద్రవ్యరాశిని ఒక వస్తువు జడత్వపు కొలమానంగా భావిస్తారు. అంటే నికర బలం ప్రయోగించినపుడు అది వేగంలో మార్పును (త్వరణము) అడ్డుకోవడానికి చూపించే నిరోధం.[1] ఒక వస్తువు ద్రవ్యరాశి ఇతర వస్తువులకు దీనికి మధ్య గురుత్వాకర్షణ ఎంత బలంగా ఉందో నిర్ధారిస్తుంది.

సాధారణ వాడుకలో ఒక వస్తువు ద్రవ్యరాశినే దాని బరువుగా పేర్కొంటుంటారు. కానీ "బరువు" లేదా "భారము" అనేది ఒక వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలానికి సమానము. కాబట్టి భౌతిక శాస్త్ర పరంగా బరువు లేదా భారం అనేది ద్రవ్యరాశికి భిన్నమైనది. శుద్ధ గతిక శాస్త్రంలో ద్రవ్యరాశి విలువలు కీలక పాత్ర పోషిస్తాయి. ద్రవ్యరాశిని గ్రాములు లేదా పౌండులలో కొలుస్తారు. వస్తు ధర్మాలను భౌతిక శాస్త్ర పరంగా వివరించటానికి ద్రవ్యరాశి ఒక ప్రాథమిక కొలతగా వినియోగించబడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. Bray, Nancy (28 April 2015). "Science". NASA. Archived from the original on 30 May 2023. Retrieved 20 March 2023. Mass can be understood as a measurement of inertia, the resistance of an object to be set in motion or stopped from motion.