శుక్రుడు
శుక్రుడు తన అసలైన రంగులో | ||||||||||
కక్ష్యా లక్షణాలు | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
Epoch J2000 | ||||||||||
అపహేళి: | 108,942,109 km 0.72823128 AU | |||||||||
పరిహేళి: | 107,476,259 km 0.71843270 AU | |||||||||
Semi-major axis: | 108,208,930 km 0.723332 AU | |||||||||
అసమకేంద్రత (Eccentricity): | 0.0068 | |||||||||
కక్ష్యా వ్యవధి: | 224.70069 day 0.6151970 yr | |||||||||
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: | 583.92 days | |||||||||
సగటు కక్ష్యా వేగం: | 35.02 km/s | |||||||||
వాలు: | 3.39471° 3.86° to Sun's equator | |||||||||
Longitude of ascending node: | 76.67069° | |||||||||
Argument of perihelion: | 54.85229° | |||||||||
దీని ఉపగ్రహాలు: | లేవు | |||||||||
భౌతిక లక్షణాలు | ||||||||||
సగటు వ్యాసార్థం: | 6051.8 ± 1.0 km[1] 0.9499 Earths | |||||||||
ఉపరితల వైశాల్యం: | 4.60×108 km² 0.902 Earths | |||||||||
ఘనపరిమాణం: | 9.38×1011 km³ 0.857 Earths | |||||||||
ద్రవ్యరాశి: | 4.8685×1024 kg 0.815 Earths | |||||||||
సగటు సాంద్రత: | 5.204 g/cm³ | |||||||||
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: | 8.87 m/s2 0.904 g | |||||||||
పలాయన వేగం: | 10.46 km/s | |||||||||
సైడిరియల్ రోజు: | −243.0185 day | |||||||||
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: | 6.52 km/h | |||||||||
అక్షాంశ వాలు: | 177.36° | |||||||||
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: | 18 h 11 min 2 s 272.76°[2] | |||||||||
డిక్లనేషన్: | 67.16° | |||||||||
అల్బిడో: | 0.65 | |||||||||
ఉపరితల ఉష్ణోగ్రత: Kelvin Celsius |
| |||||||||
Apparent magnitude: | up to -4.6[5] | |||||||||
Angular size: | 9.7" — 66.0"[5] | |||||||||
విశేషాలు: | Venusian or (rarely) Cytherean, Venerean | |||||||||
వాతావరణం | ||||||||||
ఉపరితల పీడనం: | 9.3 MPa | |||||||||
సమ్మేళనం: | ~96.5% Carbon dioxide ~3.5% Nitrogen .015% Sulfur dioxide .007% Argon .002% Water vapor .0017% Carbon monoxide .0012% Helium .0007% Neon trace Carbonyl sulfide trace Hydrogen chloride trace Hydrogen fluoride |
శుక్రుడు (ఆంగ్లంలో వీనస్) సౌరమండలము లోని ఒక గ్రహం, సూర్యునికి దగ్గరలో ఉన్న రెండవ గ్రహం. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల గ్రహాల్లోకెల్లా అత్యంత వేడిని కలిగియున్న గ్రహం ఇది. అంతే కాకుండా అష్టగ్రహాల్లోకెల్లా అత్యంత ప్రకాశవంతమైంది కూడా. దీనికి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం 224.7 భూదినములు. రాత్రివేళ చంద్రుడి తరువాత మనకంటికి మెరుస్తూ కనబడే ప్రకృతిసిద్ధమైన వస్తువు. దీనికి ఉదయతార అని సంధ్యాతార అని కూడా వ్యవహరిస్తారు. దీనికి ఉపగ్రహాలు లేవు.
శుక్రుడు, భూమి అనేక విషయాలలో సారూప్యత కలిగిన కారణంగా వీటికి "సోదర గ్రహాలు" అని కూడా అంటారు.
ఇతర సమాచారము
[మార్చు]- నవ గ్రహాలలో అత్యంత ప్రకాశవంత మైన గ్రహం శుక్ర గ్రహం.
- ఇది ఇతర గ్రహాలకు భిన్నంగా తనచుట్టు తాను ఎడమనుండి కుడికి తిరుగు తుంది.
- సూర్యుని నుండి సగటు దూరము: 10,82,08,900 కిలోమీటర్లు.
- గ్రహ మధ్య రేఖ వద్ద వ్యాసం: 12,102 కిలో మీటర్లు.
- భ్రమణ కాలం: 243 రోజుల 14 నిముషాలు.
- పరిభ్రమణ కాలము 225 రోజులు.
- దీనికి ఉప గ్రహాలు లేవు.
- ఇది అత్యధిక వేడిని కలిగి ఉండును.
వేదాలలో శుక్రుడు
[మార్చు]వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి లున్నారు.అందులోనే శుక్ర-మంధిక్- పదములు గ్రహార్ధకములుగా కనిపించును.తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ, శతపధబ్రాహ్మణములందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము.అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది, గ్రహములను తొమ్మిది.సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ-పానపాత్ర.
సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము.గ్రహశబ్దమునకు గ్రహణ' మనియు అర్ధము ఉంది. భానోర్ గ్రహే, సకలగ్రహే అని సూర్యసిద్ధాంతము. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. రాహువు ఆక్రమితును కావున రాహువు గ్రహము.
అన్ని మన్వంతరములందును అందరు దేవతలను సుర్యనక్షత్రములను ఆశ్రయించుకొని యుందురని పురాణములు చెప్పును. చంద్రసూర్యాదులు గ్రహములు. పుణ్యపురుషులకు నక్షత్రములవలెనే దేవతలకీ సూర్యచంద్రాదులు గృహములు.
చంద్రుడు, సూర్యుడు మొదలగు తేజ పిండములనుద్దేశించి యజ్ఞములందు వేరువేరు పాత్రలకు వాడుక ఉంది. కాలక్రముమున ఆపేరులే తేజ్ఃపిండములకు వాడుక ఆయెను.
గ్రహముల పరస్పర సామీప్యముగాని, గ్రహనక్షత్రముల సామీప్యముగాని కలిగినప్పుడు సంగ్రామము కలుగును. క్రాంతివృత్తమున ఉత్తరార్ధమున దేవగణమును, దక్షిణార్ధమున అసురగణమును ఉండునని ప్రసిద్ధము. ఇవియే గ్రహముల సంధానము.
శుక్రుడు
శుక్ల వర్ణము (తెల్లని రంగు)ను బట్టి ఇతడు శుక్రుడు. కావుననే జలమయుడు. తొలిసృష్టిలో పితామహుడు రుద్రుని రోదనము విని నీవు భవుడవగు మని చెప్పెను. ఆరుద్రుని జలమూర్తియగు భృగుకన్యకును, ఊశనకును శుక్రుడు ఉదయించెను. శుక్రుడు శివుని ఆరాధించి ధనపతిత్వము, అమరశరీరమును బడసెను అని పరాశారుడు. ఈకథలో శుక్రుని జలమయత్వము తల్లి చార. అమరశరీరత్వము తండ్రి చార.
ఋగ్వేదము అందలి వేనదేవతయే శుక్రుడని ఆ వేనుడే పడమటివారి Venus.
కృత్తిక మృగశిర పుష్య మఘ ఫల్గుణీద్వయము చిత్త స్వాతి విశాఖ పూర్వభాద్రపదులలో శుక్రుడు వృష్టిని కలిగించును. కృష్ణచతుర్దసి పంచమి అష్టములలో శుక్రోదయము మగునని, శుక్రాస్తమగునేని భూమి జలమయము అగునని సంహితలు చెప్పును.
వాయు, మత్స్య, లింగ భాగవత పురానములలో ఇతడు సోమయుడు.
ఇతనికి కవి అనియు, కావ్యుడనియు పేర్లున్నవి. ఫలజ్యోతిష్యము న ఇతనికి శిల్ప కవిత్వాదులతో సంబంధమున్నది. బృహస్పతి దేవమంత్రి. శుక్రుడు అసురమంత్రి. అందునే బృహస్పతినీతి, శుక్రనీతి అని చెప్పుదురు.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Seidelmann, P. Kenneth; Archinal, B. A.; A’hearn, M. F. (2007). "Report of the IAU/IAGWorking Group on cartographic coordinates and rotational elements: 2006". Celestial Mechanics and Dynamical Astronomy. 90: 155–180. doi:10.1007/s10569-007-9072-y. Retrieved 2007-08-28.
{{cite journal}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Report on the IAU/IAG Working Group on cartographic coordinates and rotational elements of the planets and satellites". International Astronomical Union. 2000. Archived from the original on 2011-08-10. Retrieved 2007-04-12.
- ↑ "Venus: Facts & Figures". NASA. Archived from the original (html) on 2006-09-29. Retrieved 2007-04-12.
- ↑ "Space Topics: Compare the Planets: Mercury, Venus, Earth, The Moon, and Mars". Planetary Society. Archived from the original on 2006-02-18. Retrieved 2008-03-25.
- ↑ 5.0 5.1 Williams, Dr. David R. (April 15, 2005). "Venus Fact Sheet". NASA. Retrieved 2007-10-12.
బయటి లింకులు
[మార్చు]- Venus Profile by NASA's Solar System Exploration
- The Soviet Exploration of Venus, Image catalog
- The Nine Planets: Venus
- NASA page about the Venera missions
- Magellan mission home page
- Pioneer Venus information from NASA
- Detailed information about transits of Venus
- Geody Venus, a search engine for surface features
- Maps of Venus in NASA World Wind Archived 2015-02-06 at the Wayback Machine
- Chasing Venus, Observing the Transits of Venus Smithsonian Institution Libraries
- Venus Crater Database Lunar and Planetary Institute
- Calculate/show the current phase of Venus Archived 2007-09-22 at the Wayback Machine (U.S. Naval Observatory)