శని గ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శని ♄
Saturn during Equinox.jpg
Pictured in natural color approaching equinox, photographed by Cassini in July 2008. The dot in the bottom left corner is Titan.
కక్ష్యా లక్షణాలు[1]
Epoch J2000.0
అపహేళి: 1,514.50 మిలియన్ కి.మీ. (10.1238 AU)
పరిహేళి: 1,352.55 మిలియన్ కి.మీ. (9.0412 AU)
Semi-major axis: 1,433.53 మిలియన్ కి.మీ. (9.5826 AU)
అసమకేంద్రత (Eccentricity): 0.0565
కక్ష్యా కాలం:
Synodic period: 378.09 రోజులు
సగటు కక్ష్యా వేగం: 9.68 km/s (6.01 mi/s)
Mean anomaly: 317.020°[3]
వాలు:
Longitude of ascending node: 113.665°
Argument of perihelion: 339.392°[3]
దీని ఉపగ్రహాలు: గుర్తించినవి 62; చిన్నపాటి ఉపగ్రహ శకలాలు అనేకం.[1]

శని, సూర్యుడి నుండి ఆరవ గ్రహం. సౌర వ్యవస్థలో అన్ని గ్రహాల కంటే పెద్దదైన గురు గ్రహం తరువాత, శని అతి పెద్ద గ్రహం. ఇది పూర్తిగా వాయువులతో కూడుకుని ఉంటుంది. దీని సగటు వ్యాసార్థం, భూమి వ్యాసార్థానికి ఆరు రెట్లు ఉంటుంది.[5][6] సగటు సాంద్రత భూమి సాంద్రతలో ఎనిమిదవ వంతు ఉంటుంది. కానీ, శని ఘనపరిమాణం చాలా ఎక్కువ కావడాన, దాని ద్రవ్యరాశి భూమికి 95 రెట్లు ఉంటుంది.[7][8][9] ఈ గ్రహానికి ఈ పేరు, హిందూ దేవుడు శని పేరిట వచ్చింది. దీన్ని ఇంగ్లీషులో శాటర్న్ అని అంటారు. ఇది రోమనుల వ్యవసాయ దేవత పేరిట వచ్చింది. శని గ్రహపు సంకేతం (♄), ఈ దేవత చేతిలో ఉండే కొడవలి పేరిట వచ్చింది.

శని గ్రహపు అంతర్భాగంలో ఇనుము, నికెల్, రాళ్ళతో కూడిన గర్భం (కోర్) కలిగి ఉంటుంది. ఈ గర్భాన్ని లోహ హైడ్రోజెన్ పరివేష్ఠించి ఉంటుంది. ఆ పైన ఒక ద్రవ హైడ్రోజెన్ పొర, దాని పైన ద్రవ హీలియమ్ పొర, ఇక ఆపైన వాయువులతో కూడిన బయటి పొర ఉంటాయి. లోహ హైడ్రోజన్ పొర లోని విద్యుత్ప్రవాహం కారణంగా శనికి అయస్కాంత క్షేత్రం ఏర్పడిందని భావిస్తున్నారు. ఇది భూ అయస్కాంత క్షేత్రం కంటే బలహీనంగా ఉంటుంది. కానీ, దాని భారీ పరిమాణం కారణంగా, దాని అయస్కాంత ఘూర్ణము (మ్యాగ్నెటిక్ మూమెంట్) భూమికి 580 రెట్లు ఉంటుంది. శని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ గురు గ్రహపు శక్తిలో పదో వంతు ఉంటుంది.[10]

శనిగ్రహ ఉపరితలంపై బలమైన గాలులు వీస్తూంటాయి. ఈ గాలుల వేగం 1,800 కి.మీ./గం వరకూ ఉంటుంది. ఇది గురుగ్రహంపై గాలుల వేగం కంటే ఎక్కువ. నెప్ట్యూన్ పై గాలుల వేగంతో సమానం.[11]

శనిగ్రహంపై ఒక రోజుకు 10 గంటల, 33 నిముషాల, 38 సెకండ్ల సమయం (+1 ని.52సె. -1ని.19సె) పడుతుందని 2019 జనవరిలో ఖగోళవేత్తలు లెక్కించారు.

ఈ గ్రహపు అత్యంత ప్రముఖమైన విశేషం, దాని చుట్టూ ఉండే వలయాల వ్యవస్థ. ఇది మంచు ముక్కల తోను, రాళ్ళ శిథిలాల తోనూ కూడుకుని ఉంటుంది. శని చుట్టూ 62 సహజ సిద్ధ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి.[12] వీటిలో యాభై మూడింటికి అధికారికంగా పేర్లు పెట్టారు. వలయాల్లో ఉండే వందలాది చిన్నపాటి ఉపగ్రహాలను ఈ సంఖ్యలో లెక్కించలేదు. శని ఉపగ్రహాల్లోకెల్లా అత్యంత పెద్దదైన టైటాన్, సౌర వ్యవస్థలోని అత్యంత పెద్ద ఉపగ్రహాల్లో రెండవది. ఇది బుధ గ్రహం కంటే ద్రవ్యరాశిలో చిన్నదైనప్పటికీ, ఘన పరిమాణంలో పెద్దది. సౌర వ్యవస్థలో, గణనీయమైన స్థాయిలో వాతావరణం ఉన్న ఉపగ్రహం ఇదొక్కటే.[13]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; fact అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; CSeligman అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 3. 3.0 3.1 3.2 3.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; VSOP87 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; meanplane అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 5. Brainerd, Jerome James (24 November 2004). "Characteristics of Saturn". The Astrophysics Spectator. Retrieved 5 July 2010.
 6. "General Information About Saturn". 28 July 2011. Retrieved 17 August 2011.
 7. Brainerd, Jerome James (6 October 2004). "Solar System Planets Compared to Earth". The Astrophysics Spectator. Retrieved 5 July 2010.
 8. Dunbar, Brian (29 November 2007). "NASA – Saturn". NASA. Archived from the original on 29 సెప్టెంబర్ 2011. Retrieved 21 July 2011. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 9. Cain, Fraser (3 July 2008). "Mass of Saturn". Universe Today. Retrieved 17 August 2011.
 10. Russell, C. T.; et al. (1997). "Saturn: Magnetic Field and Magnetosphere". Science. 207 (4429): 407. Bibcode:1980Sci...207..407S. doi:10.1126/science.207.4429.407. Archived from the original on 5 October 2011. Retrieved 29 April 2007.
 11. "The Planets ('Giants')". Science Channel. 8 June 2004.
 12. Piazza, Enrico. "Saturn's Moons". Cassini, Equinox Mission. JPL NASA. Retrieved 22 June 2010.
 13. Munsell, Kirk. "The Story of Saturn". NASA Jet Propulsion Laboratory; California Institute of Technology. Archived from the original on 16 ఆగస్టు 2008. Retrieved 7 July 2007.
"https://te.wikipedia.org/w/index.php?title=శని_గ్రహం&oldid=3484134" నుండి వెలికితీశారు