Jump to content

వాతావరణ పీడనం

వికీపీడియా నుండి

వాతావరణ పీడనం భూమి వాతావరణంలోని గాలి పీడనం. ప్రామాణిక వాతావరణ పీడనాన్ని atm అనే ప్రమాణంతో సూచిస్తారు. ఇది 101,325 పాస్కల్ యూనిట్లకు సమానం. ఎత్తు పెరిగీకొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుంది. భూఉపరితలం పైన ఉన్న వాతావరణ వాయువులపై గ్రహం యొక్క గురుత్వాకర్షణ ఆకర్షణ వల్ల వాతావరణ పీడనం ఏర్పడుతుంది. ఇది గ్రహం ద్రవ్యరాశి, ఉపరితల వ్యాసార్థం, వాయువుల పరిమాణం, కూర్పు, వాతావరణంలో ఎలా పరుచుకుని ఉంటుంది అనే విషయాల సమ్మిశ్రమం.[1][2] గ్రహ భ్రమణం, గాలి వేగం, ఉష్ణోగ్రత కారణంగా సాంద్రతలో మార్పులు, కూర్పులో వైవిధ్యాలు వంటి స్థానిక ప్రభావాలను బట్టి కూడా మారుతుంది.[3] సాధారణంగా రేడియోలలో, టెలివిజన్లలో, అంతర్జాలలో లభించే పీడన గణాంకాలను సగటు సముద్ర మట్టం (Mean See Level Pressure - MSLP) వద్ద పేర్కొంటారు.

ఉపరితల పీడనం

[మార్చు]

భూమి మీద ఏదైనా ప్రాంతపు (నేల లేదా సముద్రం) ఉపరితలం మీద కొలిచే పీడనాన్ని ఉపరితల పీడనం అంటారు. ఇది ఆ ప్రాంతంలో పరుచుకున్న గాలి ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది.

బాష్పీభవన స్థానం

[మార్చు]
మరుగుతున్న నీరు

బాష్పీభవన స్థానం లేదా మరుగు ఉష్ణోగ్రత కూడా పీడనం మీద ఆధారపడి ఉంటుంది. స్వచ్ఛమైన నీరు భూమి ప్రామాణిక వాతావరణం పీడనం వద్ద 100 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత వద్ద ఆవిరి అవుతుంది. నీరు ఆవిరి అయినప్పుడు నీటి ఆవిరి పీడనం, బయట వాతావరణ పీడనం సమానంగా ఉంటుంది.[4] అందుకనే ద్రవాల బాష్పీభవన స్థానం తక్కువ పీడనం వద్ద తక్కువగానూ, ఎక్కువ పీడనం ఉన్న చోట ఎక్కువగానూ ఉంటుంది.

మూలాలు

[మార్చు]
  1. "atmospheric pressure (encyclopedic entry)". National Geographic. Archived from the original on 28 February 2018. Retrieved 28 February 2018.
  2. "Q & A: Pressure – Gravity Matters?". Department of Physics. University of Illinois Urbana-Champaign. Archived from the original on 28 February 2018. Retrieved 28 February 2018.
  3. Jacob, Daniel J. (1999). Introduction to Atmospheric Chemistry (in ఇంగ్లీష్). Princeton University Press. ISBN 9780691001852. Archived from the original on 2021-10-01. Retrieved 2020-10-15.
  4. Vapour Pressure, Hyperphysics.phy-astr.gsu.edu, archived from the original on 2017-09-14, retrieved 2012-10-17