Jump to content

పరాశరుడు

వికీపీడియా నుండి
పరాశరుడు
పరాశరుడి చిత్రపటం
సమాచారం
కుటుంబంశక్తి మహర్షి (తండ్రి)
అదృశ్యంతి (తల్లి)[1]
పిల్లలువ్యాసుడు (సత్యవతి వల్ల) జైమిని

పరాశరుడు వసిష్టుని మనుమడు,శక్తి మహర్షి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి. జోతిష్యానికి తొలి గురువుగా భావిస్తున్న పరాశరుడు, పరాశరహోర అనే పేరుతో ఒక గ్రంథాన్ని రాశాడు.[2]

జీవిత విషయాలు

[మార్చు]

సప్తర్షులలో ఒకరైన వశిష్టుడికి శక్తి అనే కుమారుడు ఉన్నాడు. పరాశరుడు పుట్టే నాటికే శక్తిని రాక్షసుడు మింగేసాడు. పరాశరుడు పుట్టిన తరువాత తన తండ్రి చావు గురించి తెలుసుకొని వశిష్టుడి సలహాతో పరాశరుడు శివుడికి పూజలు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుని వరంతో పరాశరుడు స్వర్గంలో ఉన్న తండ్రిని చూడగలిగాడు. తన తండ్రి మరణానికి కారణమైన రాక్షసజాతి మొత్తాన్ని సంహరిస్తానని పరాశరుడు పగపట్టి, అందుకోసం యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞం వల్ల వందలాది రాక్షసులు మరణించారు. అయినా శాంతించని పరాశరున్ని శాంతింపచేసేందుకు వశిష్టుడు వచ్చి నచ్చచెప్పడంతో పరాశరుడు శాంతించాడు. ఆ తరువాత యజ్ఞంలోని అగ్నిని హిమాలయాలకు ఉత్తరంగా విడిచిపెట్టి, తీర్థయాత్రలకు బయల్దేరాడు.[3]

పరాశరుడు తీర్థయాత్రలకు వెళ్తూ, యమునా నదిలో పడవ నడుపుతున్న మత్స్యగంధి అనే మత్స్యకార యువతిని చూచి మోహిస్తాడు. ఆమె కన్యత్వము పాడవకుండా అభయమిచ్చి, శరీరపు దుర్వాసన పోయేటట్లు వరం ప్రసాదించి, యమునా నది ప్రాంతాన్ని చీకటిగా చేసి ఆమెతో సంగమించగా, వారికి వేద వ్యాసుడు జన్మించాడు.

రచనలు

[మార్చు]

వేదాల మీద మంచి పట్టు ఉన్న పరాశరుడు స్వయంగా కొన్ని మంత్రాలను కూడా రచించినట్లు తెలుస్తోంది. రుగ్వేదంలో అగ్నిదేవుడు, సోమదేవులకి సంబంధించిన కొన్ని సూక్తులు పరాశరుడు రాసినట్టుగా పేర్కొనబడ్డాయి.

గ్రంథాలు

  1. పరాశర స్మృతిశాస్త్రం
  2. పరాశర హోరశాస్త్రం
  3. కృషి పరాశర (వ్యవసాయం)
  4. వృక్షాయుర్వేద (వృక్షాలు)

మూలాలు

[మార్చు]
  1. "Wife of Sakti Maharsi".
  2. తెలుగు వెలుగు, ఆధ్యాత్మికం (14 July 2020). "జ్యోతిషానికి తొలి గురువు - పరాశరుడు". TeluguOne Devotional (in english). నిర్జర. Retrieved 14 July 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. తెలుగు గ్లోబల్, చిన్నారులు. "పరాశరుడు". www.teluguglobal.in. బమ్మిడి జగదీశ్వరరావు. Retrieved 14 July 2020.


"https://te.wikipedia.org/w/index.php?title=పరాశరుడు&oldid=3176791" నుండి వెలికితీశారు