దుశ్శాసనుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుశ్శాసనుడు

దుశ్శాసనుడు గాంధారి ధృతరాష్ట్రుల పుత్రుడు. దుర్యోధనుని నూరుగురు కౌరవ సోదరులలో ఒకరు. దుశ్శాసనుడు ద్రౌపతిని సభలోనికి జుట్టు పట్టుకొని లాగుకొని వచ్చి, నిండు సభలో ద్రౌపతి వస్త్రాపహరణానికి పూనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు అభయ హస్తంతో ద్రౌపతి గౌరవం కాపాడాడు. శ్రీకృష్ణుడి మాయ వల్ల ద్రౌపతి చీరను లాగి, లాగి దుశ్శాసనుడు ఆ సభలో బాగా అలసిపోతాడు.

జననం[మార్చు]

ధృతరాష్ట్ర పత్నియైన గాంధారి గర్భం మామూలు కంటే చాలా కాలం అలాగే ఉంటుంది. ఒకవైపు తన భర్త సోదరుడైన పాండురాజు పత్ని కుంతీ దేవికి అప్పుడే ఇద్దరు సంతానం కలుగుతారు. ఆమె ఈర్ష్యతో తన గర్భాన్ని చేత్తో కొట్టుకుంటుంది. అప్పుడామె గర్భంలోంచి ఇంకా పూర్తిగా ఎదగని మాంసపు ముద్ద బయట పడుతుంది. ఆమెకు భయం వేసి వ్యాసుడి సహాయం కోరుతుంది. వ్యాసుడు అంతకు మునుపే ఆమెకు నూర్గురు సంతానం కలిగేలా వరం ఇచ్చి ఉంటాడు. అందుకోసమని ఆ పిండాన్ని నూరు భాగాలుగా విభజించి నేతి పాత్రలలో భద్రపరుస్తాడు. వాటిని అలాగే మూసివేసి నేలలో ఒక సంవత్సరం పాటు భద్రపరుస్తాడు. ఒక సంవత్సరం తరువాత దుర్యోధనుడు ఒక కుండని చీల్చుకుని బయటకు వస్తాడు. దుశ్శాసనుడు భయటకు వస్తాడు.