శంతనుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంతనుడు - గంగ
మత్స్య కన్యచే మోహితుడైన శంతనుడు, రాజా రవివర్మ చిత్రం

శంతనుడు మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన చంద్రవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు, కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ఠ పుత్రుడు.

గంగాదేవి

[మార్చు]

ఒకరోజు శంతనుడు గంగా నదీ పరిసర ప్రాంతాల్లో విహరించుచుండగా ఒక అందమైన కన్యను చూశాడు. ఆమెను వివాహమాడదలచి ఆమెను అనుమతి కోరాడు. అప్పుడు ఆమె తను ఏమి చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండేటట్లయితే వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేదని షరతు పెట్టింది. అందుకు ఒప్పుకున్న శంతనుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఆమె ఒక పుత్రునికి జన్మనిచ్చింది. ఆమె ఆ శిశువును గంగా గర్భంలో వదలి వేసింది. కానీ ఆమె పెట్టిన షరతును అనుసరించి ఏమీ అడగలేదు. కొంత కాలానికి మరో పుత్రుడు జన్మించాడు. ఆమె ఆ శిశువును కూడా అలాగే గంగార్పణం కావించింది. ఇలా ఏడుగురు పుత్రులను గంగలో వదిలి పెట్టింది. ఎనిమిదవ శిశువును కూడా ఆమె అలాగే ముంచివేయడానికి ప్రయత్నించగా కుతూహలం ఆపుకోలేని శంతనుడు ఆమెను ఎందుకలా చేస్తున్నావని ప్రశ్నించాడు. దాంతో ఆమె షరతుకు భంగం కలిగి ఎనిమిదవ శిశువును అలాగే బ్రతకనిచ్చింది. ఆ ఎనిమిదవ శిశువే దేవవ్రతుడైనాడు. తర్వాత భీష్ముడిగా పేరుగాంచాడు.

బ్రహ్మశాపంతో శంతనుడు జన్మించుట

[మార్చు]

తన మునుపటి జన్మలో, ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన మహాభిషుడు అనే శక్తివంతమైన రాజు ఉన్నాడు. మహాభిషుడు అనేక సద్గుణ లక్షణాలను కలిగి ఉన్నాడు. మహాభిషుడు వెయ్యి అశ్వమేథ యగాలు, వంద రాజసూయ యగాలు (చక్రవర్తిగా అర్హత సాధించిన తరువాత) చేసిన తరువాత, ఆయన మరణించిన తరువాత స్వర్గలోకం చేరుకున్నాడు. ఒకసారి ఆయనకు బ్రహ్మ ఆస్థానాన్ని సందర్శించే అవకాశం లభించింది. అక్కడ దేవతలు, ఋషులు అందరూ కూడా ఉన్నారు.[1]ఋషులు, దేవతలు అందరూ బ్రహ్మను ఆరాధిస్తుండగా గంగాదేవి బ్రహ్మసభలో ప్రవేశించింది. ఆమె సభలో ప్రవేశిస్తున్న తరుణంలో ఒక గాలితరంగం వీచి, గంగాదేవి పైటచెరగు ఆమె శరీరం నుండి వైదొలిగింది. అది చూసిన సభికులలో మహాభీషుడు మినహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తలలను వంచుకున్నారు. మహాభీషుడు మాత్రం ఆమెను కామంతో అలా చూస్తూనే ఉండిపోయాడు. ఈ చర్యను చూసిన బ్రహ్మ తన నిగ్రహాన్ని కోల్పోయాడు. ఆగ్రహించి, అతి పవిత్రమైన బ్రహ్మసభలో సభామర్యాద విస్మరించి కాముకంగా ప్రవర్తించినందుకు ఆయనను మనుష్యలోకంలో మానవునిగా జన్మించమని శపించాడు. ఈ చర్యను ఆస్వాదించిన గంగ మానవుడిగా తన కారణంగా శాపగ్రస్థుడైన మహాభిషుని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని భూలోకానికి బయలుదేరింది. మహాభిషుడు తాను భూలోకంలో ప్రతీప కుమారుడిగా జన్మించాలని కోరుకున్నాడు.

కురురాజు ప్రతీపుడు ఒకసారి గంగాతీరంలో ధ్యానం చేస్తున్న సమయంలో గంగా ఒక అందమైన మహిళ రూపాన్ని ధరించి రాజు దగ్గరికి వచ్చి అతని కుడి తొడ మీద కూర్చున్నది. ప్రదీపుడు ఆమెను చూసి ఏమి కావాలని అడిగగానే గంగ ప్రతీపుడితో తనను వివాహం చేసుకొమ్మని కోరింది. ప్రతీపుడు తాను భార్యమినహా ఎవరిపట్ల కామమోతుడు కానని ప్రతిజ్ఞ చేసానని అందువలన ఆమె కోరికను అంగీకరించలేనని, ఆమె తన కుడి తొడ మీద కూర్చుంది కనుక సంప్రదాయాల అనుసరించి ఆమె తనకు కుమార్తె లేదా కోడలు ఔతుందని, ఎడమ తొడ మీద కూర్చుంటేనే భార్య కాగల అవకాశం ఉంటుందని చెప్పి ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. అయినప్పటికీ ఆమె తన కుమారుని చేసుకుని తనకు కోడలు కావచ్చునని చెప్పాడు. అందుకు గంగాదేవి అంగీకరించింది.


ప్రతీపమహారాజుకు ఆయన భార్య సునందకు వారి వృద్ధాప్యంలో ఒక మగ బిడ్డ జన్మించాడు. కుమారుడు జన్మించిన తరువాత తన కోరికలను తపస్సు ద్వారా శాంతింపజేసాడు కనుక అతనికి ప్రతీపుడు శంతనుడు అని పేరు పెట్టాడు. ప్రతీపుడు అప్పుడు శంతనుడిని హస్తినాపుర రాజుగా నియమించి తాను తపస్సు చేయటానికి అడవులలోకి వెళ్ళాడు. శంతనుడి కంటే పెద్దవాడు అయిన బాహ్లికుడు కూడా శంతనుడికి హస్తినాపుర రాజు కావడానికి అనుమతి ఇచ్చాడు.

శంతనుడు తన కుమారుడితో తిరిగి కలుసుకొనుట

[మార్చు]
గంగాదేవి దేవవ్రతుడిని శంతనుడికి అప్పగించుట

భార్య, కొడుకును కోల్పోయిన దు:ఖంతో నిండిన శంతనుడు బ్రహ్మచర్యమును ఆచరించడం మొదలుపెట్టాడు. తన రాజ్యాన్ని బాగా పరిపాలించాడు. కేవలం సద్గుణ ప్రవర్తనను అవలంబించడం ద్వారా శాంతనుడు ఆయుధాలను ఉపయోగించకుండానే ప్రపంచం మొత్తాన్ని సులభంగా జయించగలిగాడు. రాజులందరూ శాంతనుడిని చక్రవర్తిగా ప్రకటించారు. అతని పాలన శాంతియుతంగా కొనసాగింది. శాంతనుడు వేటను వదలి తన పాలన నుండి ప్రజాదరణ పొందాడు.

ఒక రోజు గంగా ఒడ్డున నడుస్తున్నప్పుడు నది జలరహితంగా మారడం శంతనుడు గమనించాడు. ఈ దృగ్విషయం కారణాన్ని వెతుకుతున్నప్పుడు ఆయన తన ఆయుధంతో నది ప్రవాహాన్ని కట్టడి చేసిన ఒక అందమైన యువకుడిని చూశాడు. ఆ యువకుడు ఆయన కుమారుడు అయినప్పటికీ శంతనుడు అతడిని గుర్తించలేదు. ఎందుకంటే అతను జన్మించిన కొద్ది క్షణాలు తరువాత గంగాదేవి తన కుమారుడితో శంతనుడిని విడిచి పోయింది. బాలుడు మాత్రం ఆయన తన తండ్రి అని గుర్తించాడు. అయినప్పటికీ అతను దానిని శంతనుడికి వెల్లడించలేదు. బదులుగా అతను తన భ్రమ శక్తిని ఉపయోగించి తన దృష్టి నుండి అదృశ్యమయ్యాడు. ఇది చూసిన శంతనుడు బాలుడు వాస్తవానికి తన కొడుకు కాదా అని ఆశ్చర్యపోతూ బాలుడిని తనకు చూపించమని గంగాను పిలిచాడు. గంగా ఇలా స్త్రీరూపంలో కనిపించిన తరువాత బాలుడు వాస్తవానికి తన కుమారుడు దేవవ్రతుడు అని, వశిష్టఋషి నుండి పవిత్ర గ్రంథాల పరిజ్ఞానాన్ని, పరశురాముని వద్ద యుద్ధ కళను నేర్చుకున్నాడని గంగాదేవి ఆయనకు వెల్లడించించి కుమారుడిని శంతనుడికి అప్పగించింది. దేవవ్రతుని గురించి నిజం వెల్లడించిన తరువాత ఆమె శంతనుడితో కుమారుడిని హస్తినాపురానికి తీసుకెళ్లమని చెప్పింది. రాజధాని చేరుకున్న తరువాత శంతనుడు దేవవ్రతుడిని సింహాసనం వారసుడిగా ప్రకటించి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు.[ఆధారం చూపాలి] గంగాదేవి వంటి భార్యతో వియోగం చెందిన తరువాత కూడా శంతనుడు దేవవ్రతుడి వంటి కుమారుడిని పొందినందుకు ఆనందించాడు. దేవవ్రతుడి సాయంతో శంతనుడు యమునాతీరంలో ఏడు అశ్వమేథ యాగాలు నిర్వహించాడు.

శంతనుడు - సత్యవతి

[మార్చు]
భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్న దేవవ్రతుడు

నాలుగు సంవత్సరాల తరువాత శంతనుడు యమునా ఒడ్డున ప్రయాణిస్తున్నప్పుడు తెలియని దిశ నుండి ఒక అద్భుతమైన సువాసన వచ్చింది. సువాసన కారణాన్ని వెతుకుతున్నప్పుడు ఆయన సత్యవతిని (యోజనగంధి) చూశాడు. ఆమె నుండి దివ్యమైన సువాసన వాసన వస్తోంది. సత్యవతి తన గ్రామంలోని మత్స్యకారుల రాజు దత్తపుత్రిక. ఆమెను చూడగానే శంతనుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. సత్యవతి తన తండ్రి అనుమతిస్తేనే వివాహం జరుగుతుందని చెప్పింది. శంతనుడు మత్స్యరాజు వద్ద సత్యవతిని ఇమ్మని కోరిన తరువాత, సత్యవతి కుమారుడు హస్తినాపుర సింహాసనానినికి వారసత్వంగా పొందాలనే షరతుతో ఆమె తండ్రి వివాహానికి అంగీకరించాడు.

తన పెద్ద కుమారుడు దేవవ్రత సింహాసనం వారసుడు కావడంతో శంతనుడు రాజుపదవి గురించి తన మాట ఇవ్వలేకపోయాడు. అయినప్పటికీ దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకున్నాడు.తన తండ్రి కోసం సత్యవతి పిల్లలకు అనుకూలంగా సింహాసనం మీద తన హక్కును త్యజిస్తానని మత్స్యరాజుకు మాట ఇచ్చాడు. సందేహాస్పద అధిపతికి భరోసా ఇవ్వడానికి సత్యవతి జన్మించిన భవిష్యత్తు తరాలను కూడా తన సంతానం సవాలు చేయకుండా చూసుకోవటానికి జీవితకాల బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తానని కూడా ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ విన్న వెంటనే మత్స్యరాజు సత్యవతి, శాంతనుల వివాహానికి అంగీకరించాడు. దేవతలు ఆయన చేసిన ప్రమాణం కారణంగా ఆయనకు భీష్ముడు (భీషణ ప్రతిజ్ఞ చేసినవాడు) పేరు పెట్టారు. సత్యవతితో హస్తినాపురానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన తన తండ్రికి చేసిన ప్రతిజ్ఞ గురించి చెప్పాడు. ఈ విషయం గురించి విన్న శంతనుడు భీష్ముని ప్రశంసించి కుమారుడు చేసిన త్యాగానికి ప్రతిగా భీష్ముడికి ఇచ్చామరణం (కోరుకున్న సమయంలో మరణించడం) ఒక వరంగా ఇచ్చాడు. శంతనుడికి, సత్యవతికి చిత్రంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. శాంతనుడు మరణించిన తరువాత విచిత్రవీర్యుడు హస్తినాపుర రాజు అయ్యాడు. ఎందుకంటే శంతనుడు జీవించి ఉన్నప్పుడే చిత్రాంగదుడు అదే పేరు గల గంధర్వుడి చేత చంపబడ్డాడు.[ఆధారం చూపాలి]


మూలాలు

[మార్చు]
  1. Roy, Pratap Chandra; Ganguli, Kisari Mohan (1896). The Mahabharat of Krshna-Dwaipayana Vyasa - Translated from Original Sanskrit (PDF). Calcutta-12: Oriental Publishing Co. p. 230. Archived from the original (PDF) on 27 జూలై 2018. Retrieved 4 August 2018.{{cite book}}: CS1 maint: location (link)
"https://te.wikipedia.org/w/index.php?title=శంతనుడు&oldid=3850102" నుండి వెలికితీశారు