మాద్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాద్రి
మహాభారతం పాత్ర
సమాచారం
దాంపత్యభాగస్వామిపాండురాజు
పిల్లలునకులుడు, సహదేవుడు

మాద్రి (మాధురి) మహాభారతం పురాణంలో పాండురాజు భార్య. పాండవులలో నకుల సహదేవులకు తల్లి. శాల్య సోదరి, మద్రా రాజ్యానికి చెందిన యువరాణి. మాద్రి అనే పదానికి 'మద్రా రాజ్యానికి యువరాణి' అని అర్ధం. కుంతికి చెల్లెలు లాంటిది.[1]

పురాణ కథ[మార్చు]

పాండురాజును రిషి కిండమ శపించిన తరువాత కుంతి, మాద్రి అతనితో కలిసి అడవికి వెళ్ళారు. దాంపత్య సుఖం పొందితే చనిపోతావని పాండురాజుకు ముని శాపం ఇచ్చాడు. మాద్రి గర్భవతిగా ఉన్నప్పుడు, పాండు ఆమెపై ఆకర్షితుడయ్యాడు. అక్కడ, మూలికను రిషి దుర్వాసుడు కుంతికి ఇచ్చాడు, మాద్రి నకులుడు, సహదేవులకు జన్మనిచ్చింది. మాద్రి అందంతో పాండు ఆకర్షితుడయ్యాడు. తన భర్తను, తోటి భార్యను సజీవంగా ఉంచడంకోసం కుంతి తన వంతు కృషి చేస్తూ పాండురాజును హెచ్చరిస్తూనే ఉంది. పాండు రాజు మాద్రిని తాకకుండా ఉండలేకపోయాడు.

ఒక రోజు, కుంతి మధ్యాహ్నం పిల్లలతో దూరంగా ఉండగా. మాద్రి ఒంటరిగా కూర్చోవడం చూసి పాండు ఆమెను సమీపించాడు. "నా అందమైన భార్య, మధ్యాహ్నం మీరు నన్ను అడవుల్లోకి తీసుకువెళతావా?" అని అడిగాడు. అతని బలహీనత గురించి ఆమెకు తెలుసు కాబట్టి ఆమె అంగీకరించింది. వాళ్ళు అడవుల్లోకి ప్రవేశించగానే, వారు శారీరకంగా దగ్గరవ్వగా పాండురాజు దాంపత్య సుఖం పొందాడు. ముని శాప ఫలితంగా వెంటనే మృతి చెందాడు. కుంతి ముందుకు వచ్చి మాద్రిని ప్రక్కకు లాగి నేను పతి వెంటనే పోతాను, నీవు బిడ్డలను పోషిస్తూ ఉండు అని అన్నది, మాద్రి కుంతిని వెన్నక్కు త్రోసి నేనే పతి వెంట వెళతాను, నీవు మహారాజును స్వయంవరంలో చేపట్టావు, వంశము నిలిపావు, పుణ్యగతి కలిపించావు, అభీష్టం తీర్చావు, నేను కోరిక తీర్చలేకపోయాను. శాప విషయం తెలిసి కూడా ఏమరపాటున చేటు తెచ్చిన పనికిమాలిన దానను, ఇలాంటి నేను పుత్రులను సంరక్షించగలనా? వద్దు నన్ను వెళ్ళనీ, అన్య లోకంలో అయినా పతికి ప్రీతి కలించడానికి ప్రయత్నిస్తాను. అక్కా! నీవే బిడ్డలను రక్షించాలి. అని ధీనంగా వీడుకోలు పలికి మునీశ్వరులకు నమస్కరించి చితి ఎక్కి పతితో పాటు అగ్ని శిఖలలో లీనమై పోయింది. తన పిల్లలను కుంతికి అప్పగించిన మాద్రి పతితో పాటు సతీ సహగమనం చేసింది. పాండు పుత్రులను సంరక్షించే నిమిత్తంగా కుంతి బ్రతికి ఉంది.

మూలాలు[మార్చు]

మహాభారతం - ఆంధ్ర మహాభారతం - వ్యాసుడు - కవిత్రయం

పర్వాలు

ఆది పర్వము  • సభా పర్వము  • వన పర్వము లేక అరణ్య పర్వము  • విరాట పర్వము  • ఉద్యోగ పర్వము  • భీష్మ పర్వము  • ద్రోణ పర్వము  • కర్ణ పర్వము  • శల్య పర్వము  • సౌప్తిక పర్వము  • స్త్రీ పర్వము  • శాంతి పర్వము  • అనుశాసనిక పర్వము  • అశ్వమేధ పర్వము  • ఆశ్రమవాస పర్వము  • మౌసల పర్వము  • మహాప్రస్ధానిక పర్వము  • స్వర్గారోహణ పర్వము  • హరివంశ పర్వము

పాత్రలు
శంతనుడు | గంగ | భీష్ముడు | సత్యవతి | చిత్రాంగదుడు | విచిత్రవీర్యుడు | అంబ | అంబాలిక | విదురుడు | ధృతరాష్ట్రుడు | గాంధారి | శకుని | సుభద్ర | పాండు రాజు | కుంతి | మాద్రి | యుధిష్ఠిరుడు | భీముడు | అర్జునుడు | నకులుడు | సహదేవుడు | దుర్యోధనుడు | దుశ్శాసనుడు | యుయుత్సుడు | దుస్సల | ద్రౌపది | హిడింబి | ఘటోత్కచుడు | ఉత్తర | ఉలూపి | బభృవాహనుడు |అభిమన్యుడు | పరీక్షిత్తు | విరాటరాజు | కీచకుడు | ద్రోణుడు | అశ్వత్థామ | ఏకలవ్యుడు | కృతవర్మ | జరాసంధుడు | సాత్యకి | దుర్వాసుడు | సంజయుడు | జనమేజయుడు | వేదవ్యాసుడు | కర్ణుడు | జయద్రధుడు | శ్రీకృష్ణుడు | బలరాముడు | ద్రుపదుడు | | దృష్టద్యుమ్నుడు | శల్యుడు | శిఖండి | సుధేష్ణ
ఇతర విషయాలు
పాండవులు | కౌరవులు | హస్తినాపురం | ఇంద్రప్రస్థం | రాజ్యాలు | కురుక్షేత్ర యుద్ధం | భగవద్గీత
"https://te.wikipedia.org/w/index.php?title=మాద్రి&oldid=2993299" నుండి వెలికితీశారు