బలరాముడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలరాముడు
తన హలముతో గంగను హస్తినాపురము వైపు లాగుతున్నబలరాముడు

బలరాముడు, బలదేవుడు లేదా బలభద్రుడు, వీరు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము.

వీరి ఆయుధము హలము, నాగలి.

వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడుగా ఉన్నవారు. వీరి భార్య రేవతి.

ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చారు, మరొకసారి హస్తినాపురాన్నే [నేటి ఢిల్లీని] తన హలాయుధంతో యమునలో కలప ఉద్యుక్తులయినారు.

వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసారు. అప్పుడు దర్శించిన ప్రదేశాలలో తిరుమల కూడా ఉంది.

ఇతర పేర్లు[మార్చు]

  1. బలభద్రుడు
  2. ప్రలంభఘ్నుడు
  3. బలదేవుడు
  4. అచ్యుతాగ్రజుడు
  5. రేవతీరమణుడు
  6. కామపాలుడు
  7. హలాయుధుడు
  8. నీలాంబరుడు
  9. రోహిణేయుడు
  10. తాలాంకుడు (తాటి చెట్టు గుర్తు కలవాడు)
  11. సంకర్షణుడు (ఒక గర్భము నుండి మరియొక గర్భమునకు లాగబడిన వాడు)
  12. సీరపాణి
  13. కాళినేఛేదనుడు (కాళిందిని భంగ పరచినవాడు)

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బలరాముడు&oldid=4010857" నుండి వెలికితీశారు