Jump to content

నాగలి

వికీపీడియా నుండి
గుర్రాల సాయంతో దుక్కి దున్నుతున్న జర్మన్ వ్యవసాయదారుడు

నాగలి అనేది ఒక ముఖ్యమైన వ్యవసాయ పరికరం. వ్యవసాయదారులు దీనిని ఉపయోగించి భూమిని దున్ని పంటలు పండిస్తారు. నాగలినే మడక, హలం ఇలా అనేక పేర్లతో పిలుస్తారు.

నిర్మాణం

[మార్చు]

దీన్ని కేవలం కర్ర తోనే వడ్రంగి చేస్తాడు. బాణం గుర్తులోని ములుకులు రెండు సుమారు నలబై ఐదు డిగ్రీల కోణంలో వుంటాయి. అలా వున్న ఒకదానిని తొంబై డిగ్రీలగా చేసి దాన్ని పైకి పెట్టి, రెండో కోణాన్ని భూమిలో గుచ్చుకున్నట్టు పెట్టాలి. ఈ గుచ్చుకున్న భాగం మొదలు లావుగా వుండి కొసన సన్నగ వుంటుంది. దానికి ఆధారంగా ఒక ఇనుప పట్టాను బిగిస్తారు. దాని 'కారు' లేదా 'కర్రు' అంటారు. ఈ కర్రు వలన కర్రతో వున్న నాగలి కొస అరిగి పోకుండాను విరిగి పోకుండాను వుంటుంది. రెండవ వైపున వున్న కోణం కర్ర కూడా కొంత లావుగా వుండి. రెండో దానికన్న పొట్టిగా వుంటుంది. దానికి అదనంగా ఇంకొక కర్ర అంతకన్నా సన్నగా వున్న కర్రను తొంబై డిగ్రీల కోణంలో రెండడుల పైకి వుంటుంది. దీన్ని 'మేడి' అంటారు.

పురాణాల్లో నాగలి

[మార్చు]

హిందువుల పవిత్ర గ్రంథమైన మహాభారతంలో శ్రీకృష్ణుని అన్న బలరాముడిని హలాయుధుడు అని పేర్కొన్నారు. అంటే నాగలి ఆయుధంగా కలిగిన వాడు అని అర్థం.

గుర్తులు

[మార్చు]

నాగలిని రైతుకు గుర్తుగా భావిస్తారు. తెలుగు దేశం పార్టీ పతాకంలో నాగలి ఉంది.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నాగలి&oldid=4103761" నుండి వెలికితీశారు