కురు వంశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొవ్వూరు గోదావరి గట్టు మీద విశ్వామిత్రుడి విగ్రహం

విశ్వామిత్రుడు మేనక సంభోగం వల్ల జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమములో పెరుగుచుండగా ఒకరోజు ఆ మార్గములో అప్పటి రాజు దుష్యంతుడు వెళ్తుండగా, దుష్యంతుడు శకుంతలని చూసి ఆకర్షితుడై ఆమెని గాంధర్వ వివాహం చేసుకొని ఆమెను రాజ్యానికి వెళ్ళి రాజ్యసంస్కారలతో ఆహ్వానిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో శకుంతల భరతుడిని ప్రసవిస్తుంది. కణ్వ మహర్షి దివ్య దృష్టితో జరిగింది గ్రహించి శకుంతలని దుష్యంతుడి రాజ్యానికి పంపుతాడు. మొదట శకుంతల తన భార్య కాదు భరతుడు తన కుమారుడు కాదు అని అన్న దుష్యంతుడు, ఆకాశవాణి పలుకులతో జరిగిన వృత్తాంతం గుర్తు తెచ్చుకొని భరతుడిని కుమారుడిగా అంగీకరిస్తాడు.

భరతుడి తరువాత వంశం[మార్చు]

భరతుడి కుమారుడు భుమన్యుడు, భుమన్యుడి కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుడి కుమారుడు హస్తి, హస్తి పేరు తోనే ఉన్నదే అప్పటి కురురాజుల రాజధాని, ఇప్పటి ఢిల్లీ నగరమైన హస్తినాపురం. హస్తి కుమారుడు వికంఠనుడు, వికంఠనుడి కుమారుడు అజమేఢుడు. అజమేఢుడికి 124 కుమారులు. వాని కుమారులలో ఒకడైన సంవరణుడికి సూర్యుని కుమార్తె అయిన తపతికి వివాహం జరిగింది. వారి కుమారుడు కురు. కురు పేరు తోనే కురువంశం వృద్ధి చెందింది. కురు కుమారుడు విదూరధుడు. విదూరధుడి కుమారుడు అనశ్వుడు. అనశ్వడి కుమారుడు పరిక్షిత్తు, పరిక్షిత్తు కుమారుడు భీమసేనుడు. భీమసేనుడు కొడుకు ప్రదీపుడు. ప్రదీపుడి కుమారుడు శంతనుడు

శంతనుడి తరువాతి వంశం[మార్చు]

శంతనుడి భార్య గంగ. శంతనుడికి గంగ వలన కలిగిన వాడు భీష్ముడు. శంతనుడికి, సత్యవతికి జన్మించినవారు చిత్రాంగదుడు, విచిత్రవీరుడు. వీరికి దేవరన్యాయం ప్రకారం వ్యాసుని వల్ల జన్మించిన వారు ధృతరాష్ట్ర, పాండు రాజులు జన్మించారు. ధృతరాష్ట్ర కుమారులు కౌరవులు, పాండురాజు కుమారులు పాండవులు . కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు, ఉపపాండవులు అంతమొందగా ఉత్తర గర్భంలో అభిమన్యుడి వలన భ్రూణంగా ఉన్న పరిక్షిత్తుని రక్షించాడు శ్రీకృష్ణుడు. పరిక్షిత్తు కుమారుడు జనమేజయుడు.

కురు వంశ వృక్షం[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=కురు_వంశం&oldid=3482067" నుండి వెలికితీశారు