భరతుడు (కురువంశం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భరతుడు
చక్రవర్తి
Bharat plays with lion cubs.jpg
సింహం పిల్లలతో ఆడుకుంటున్న బాల భరతుడు
జన్మ నామంసర్వదమన
జనన స్థలంకణ్వ మహర్షి ఆశ్రమం.
ముందు వారుదుష్యంతుడు
తర్వాత వారుభూమన్యు
Consortసునంద
Issueభూమన్యు
రాజ మందిరంచంద్రవంశం
రాజ్యంచంద్రవంశం
తండ్రిదుష్యంతుడు
తల్లిశకుంతల

భరతుడు పురాణాల ప్రకారం భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరు. ఆయన శకుంతలా, దుష్యంతుల కుమారుడు. భరతుని పేరుమీదుగానే భారతదేశానికి ఆ పేరువచ్చిందని చెబుతారు.

జననం[మార్చు]

భరతుడి జననానికి సంబంధించిన కథ అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ ఇతివృత్తం వ్యాసుని మహాభారతంలో వ్రాయగా, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలములో మరింత విపులీకరించి కావ్యంగా రచించారు. విశ్వామిత్రుడు మేనక సంభోగం వల్ల జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమములో పెరుగుచుండగా ఒకరోజు ఆ మార్గములో అప్పటి రాజు దుష్యంతుడు వెళ్తుండగా , దుష్యంతుడు శకుంతలని చూసి ఆకర్షితుడై ఆమెని గాంధర్వ వివాహం చేసుకొని ఆమెను రాజ్యానికి వెళ్ళి రాజ్యసంస్కారలతో ఆహ్వానిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో శకుంతల భరతుడిని ప్రసవిస్తుంది. కణ్వ మహర్షి దివ్య దృష్టితో జరిగింది గ్రహించి శకుంతలని దుష్యంతుడి రాజ్యానికి పంపుతాడు. మెదట శకుంతల తన భార్య కాదు భరతుడు తన కుమారుడు కాదు అని అన్న దుష్యంతుడు, ఆకాశవాణి పలుకులతో జరిగిన వృత్తంతం గుర్తు తెచ్చుకొని భరతుడిని కుమారుడిగా అంగీకరిస్తాడు.

భరతుడి తరువాత వంశం[మార్చు]

భరతుడి కుమారుడు భుమన్యుడు, భుమన్యుడి కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుడి కుమారుడు హస్తి , హస్తి పేరు తోనే ఉన్నదే అప్పటి కురురాజుల రాజధాని, ఇప్పటి ఢిల్లీ నగరమైన హస్తినాపురం. హస్తి కుమారుడు వికంఠనుడు, వికంఠనుడి కుమారుడు అజమేఢుడు. అజమేఢుడికి 124 కుమారులు. వాని కుమారులలో ఒకడైన సంవరణుడికి సూర్యుని కుమార్తె అయిన తపతికి వివాహం జరిగింది. వారి కుమారుడు కురు. కురు పేరు తోనే కురువంశం వృద్ధి చెందింది. కురు కుమారుడు విదూరధుడు. విదూరధుడి కుమారుడు అనశ్వుడు. అనశ్వడి కుమారుడు పరిక్షిత్తు , పరిక్షిత్తు కుమారుడు భీమసేనుడు. భీమసేనుడు కొడుకు ప్రదీపుడు. ప్రదీపుడి కుమారుడు శంతనుడు

యివి కూడా చూడండి[మార్చు]

కురు వంశవృక్షం[మార్చు]


మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]