వెంట్రుక
మానవ శరీరంలో చర్మం మీద మొలిచిన వెంట్రుకలను రోమాలు అంటారు. తల మీద మొలిచిన వెంట్రుకలను జుట్టు , శిరోజాలు, అంటారు. వెంట్రుకను సంస్కృతంలో కేశం అంటారు.
వెండ్రుకలు - ప్రదేశాలు[మార్చు]
- శరీరం మీద వెండ్రుకలు
- తల వెండ్రుకలు - శిరోజాలు
- కనుబొమ్మలు
- ఛాతీ మీద వెండ్రుకలు
- కడుపు మీద వెండ్రుకలు
- మూతి మీద వెండ్రుకలు - మీసం
- చుబుకం మీద వెండ్రుకలు - గడ్డం
- చంకలో వెండ్రుకలు
- జననేంద్రియాలు మీద వెండ్రుకలు - జఘన జుట్టు
తెల్లజుట్టు[మార్చు]
వెండ్రుకలు దేహంపై ఉండేే చర్మంలో ఒక భాగం. చర్మం ఛాయ శరీరంలో ఉండే ఐదు పిగ్మెంట్ల (రంగుతో కూడిన పదార్థాలు)పై ఆధారపడి ఉంటుంది. ఈ పిగ్మెంట్లలో మెలానిన్ ముఖ్యమైంది. ఇది దేహంలో ఉండే మెలనోసైటిస్ అనే కణాల నుండి ఉత్పన్నమవుతుంది. ఈ మెలానిన్ చర్మం కింది భాగంలో, వెంట్రుకలలో, కళ్ళలో ఉంటుంది. మెలానిన్ తక్కువ పాళ్లలో ఉంటే శరీరం తెల్లగాను, ఎక్కువగా ఉంటే నల్లగాను ఉంటారు. కళ్లు, వెంట్రుకల రంగు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా వృద్ధాప్యంలో శరీర ప్రక్రియలన్నీ నెమ్మదిస్తాయి. మెలనోసైటిస్ కణాలు తక్కువ శాతంలో మెలానిన్‌ను ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల వృద్ధులకు తల నెరుస్తుంది. నిజానికి ప్రతి వెంట్రుక పారదర్శకంగా ఉండే ఒక సన్నని గొట్టం లాంటిది. ఆ గొట్టం నిండా మెలానిన్ ఉన్నంత కాలం ఆ వెంట్రుక నల్లగా ఉంటుంది. దానికి తగినంత మెలానిన్ అందకపోతే వెంట్రుక నల్లని రంగు క్రమేపీ మారి గొట్టం మొత్తం ఖాళీ అయిపోగానే తెల్లగా కనిపిస్తుంది. ఒకోసారి మెలనోసైటిస్ కణాలు మెలానిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోవడంతో యుక్తవయసులోనే కొందరి తల వెండ్రుకలు తెల్లబడతాయి. దీన్నే బాలనెరుపు అంటారు.
తెల్లజుట్టు నివారణ పద్దతులు[మార్చు]
- పెద్ద ఉసిరికాయను ముక్కలు చేసి, బాగా ఎండబెట్టి, పొడిని చేసి, కొబ్బరి నూనె తో ఆ మిశ్రమాన్ని పదిరోజులు ఉంచి, చివర బాగా వడగట్టుకొని రోజూ తలకు రాసుకుంటే తెల్లజుట్టు రాదు.
- భోజనంలో కరివేపాకు వాడితే తెల్లజుట్టు రాదు.
- తోటకూర ఆకులను బాగా రుబ్బి, ముద్దగా చేసుకుని, ఆ ముద్దను తలకు రాసుకుని రెండు గంటల తర్వాత స్నానం చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
- చెడు అలవాట్లలో స్మోకింగ్ చాలా ప్రమాదకరమైంది . ఇది ఆరోగ్యాన్ని పాడు చేయడం మాత్రమే కాదు, అందాన్ని కూడా పాడుచేస్తుంది. ముఖ్యంగా జుట్టును తెల్లగా మార్చడంలో టుబాకో పనిచేస్తుంది.[1]
- అతిగా ఒత్తిడికి గురికావడం వలన జుట్టు తెల్లగా అవుతుంది . యోగ, మెడిటేషన్ చేయడం వలన, మన మెదడును ఫ్రీ గ ఉంచడం వలన ఈ ఒత్తిడి తగ్గుతుంది.
- సూర్యుడినుండి వచ్చే హానీకరమైన UV rays వలన బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు, premature grey hair (తెల్ల వెంట్రుక ) కు కారణం అవుతుంది. అందువలన మన తలని స్కార్ఫ్ తో కానీ టోపీ కానీ ధరించిసంరక్షించుకోవాలి.
- ఆక్సిడేటివ్ స్ట్రెస్, తెల్ల జుట్టు తగ్గించడం కొరకు యాంటీఆక్సిడాంట్ ఎక్కువుగా లభించే ఆహారపదార్దాలు ఎక్కువగా తినాలి.[1]
కనుబొమ్మలు వెండ్రుకలు[మార్చు]
కనుబొమ్మలు వెండ్రుకలు దుమ్ము, ధూళి, చెమట నుండి కళ్ళు రక్షించడానికి సహాయం చేస్తాయి.కనుబొమ్మలు దుమ్ము , చెమట, వర్షం నుండి కళ్ళుకు ఆధునిక రక్షణ ఇస్తాయి . కోపం , ఆశ్చర్యత, ఉత్సాహం వంటి భావోద్వేగాలు ప్రదర్శించి అశాబ్దిక సమాచార కీలక పాత్రను పొషిస్తాయి.వెంట్రుక కనురెప్ప అంచులు వద్ద పెరుగుతుంది. వెంట్రుకలు మానవులు మాదిరే ఒంటెలుకు , గుర్రాలుకు , ఉష్ట్రపక్షి మొదలైన వాటికి రక్షణగా ఉంటాయి.
జుట్టుకు పోషణ[మార్చు]
- జుట్టు ఆరోగ్యంగా లేదంటే ఒత్తిడి, వాతావరణం, హార్మోన్లలో మార్పుల గురించే ఆలోచిస్తాం. కానీ ఆహారపరంగా నిర్లక్ష్యం చేస్తే కొన్ని పోషకాలు కూడా అలాంటి సమస్యల్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు జుట్టుకు ఎదురయ్యే సమస్యల్ని గమనించుకుని కొన్నిరకాల పోషకాలు అందేలా చూసుకోవాలి.
- కురులు చిట్లిపోయి, ఎదుగుదల తక్కువగా ఉంటే మాంసకృత్తులు లోపించినట్లేనని అర్థం. ఎందుకంటే జుట్టు కణాలు పరిణతి చెందాక వాటిల్లో కెరొటిన్ అనే ప్రొటీన్ నిండుతుంది. దీనివల్లే జుట్టు ఎదుగుదల బాగుంటుంది. అందుకే ప్రొటీన్లు ఎక్కువుండే లోఫ్యాట్ చీజ్, బీన్స్, గుడ్లు, పాలు, పెరుగు, సోయాపాలు, నట్స్, గింజలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
- తల దువ్వుకునేప్పుడు జుట్టు రాలడం సహజం. అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటే జింక్ లోపం ఉండొచ్చని సందేహించాలి. జింక్ జుట్టు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఈ లోపం ఉన్నప్పుడు ముందు జుట్టు పలుచగా మారి తరువాత రాలడం మొదలవుతుంది. నువ్వులూ, గుమ్మడి గింజలూ, పుచ్చకాయ గింజలూ, డార్క్ చాక్లెట్, పల్లీలు లాంటి వాటిల్లో జింక్ పుష్కలంగా లభిస్తుంది.
- తలంతా దురద పుట్టి, పొట్టుగా రాలుతుంది కొన్నిసార్లు. తలలో సహజ నూనెలు తగ్గి పొడిబారినప్పుడే ఇలాంటి సమస్య ఎదురవుతుంది దాన్ని తగ్గించుకోవాలంటే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పోషకాలను నట్స్, సాల్మన్ తరహా చేపలు, అవిసె గింజలు, గుడ్ల నుంచి పొందవచ్చు.
- జుట్టు నల్లగా నిగనిగలాడుతూ కనిపించేందుకు తలలో ఉండే మెలనిన్ కారణం. దీని ఉత్పాదకత తగినంత ఉండాలంటే 'బి' విటమిన్ల లోపం ఎదురవకుండా చూసుకోవాలి. ఆకుకూరలూ, తృణధాన్యాలూ, గుడ్లూ, మాంసాహారం ఎక్కువగా తింటే 'బి' విటమిన్లు బాగా అందుతాయి. 'సిలికా' అనే ఖనిజ లవణం జుట్టుకు తేమను అందించి, వెంట్రుకల్ని దృఢంగా ఉంచుతుంది. యాపిల్స్, కమలా ఫలాలు, ఎండుద్రాక్ష, ఉల్లిపాయలు, క్యారెట్లు, ఓట్స్, శుద్ధిచేయని గింజలు, పప్పులు, నట్స్, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలన్నీ సిలికాను అందిస్తాయి.[2]
- వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి.
- తలస్నానానికి కుంకుడుకాయి, శీకాయి వాడాలి.
- శుభ్రమైన కొబ్బరి నూనె వెంట్రుకల కుదుళ్ళకు అంటుకునేలా రాసుకోవాలి.
- రోజూ 15 గ్లాసుల మంచినీరు తాగాలి.
- ఆకుకూరలు, గుడ్లు, సోయాబీన్స్, చేపలు, పాలు వంటి పూషకాహారాన్ని తీసుకోవాలి.
- ఎక్కువగా హెయిర్ ప్రొడక్ట్స్ వాడకపోవడం మంచిది. కొన్ని రకాల షాంపు, కండీషనర్ లో ఉండే కెమికల్స్ జుట్టుకి హానీ చేస్తాయి
- జుట్టు మృదువుగా అవడం కోసం వాడే హీట్ స్టైలింగ్ పరికరాలను తక్కువగా వాడాలి. [3]
ఆయుర్వేదంతో జుట్టు పరిమాణం పెంచడం ఎలా?[మార్చు]
మసాజ్ చేయండి - గోరువెచ్చని హెయిర్ ఆయిల్ తీసుకోని మీ చేతివేళ్ల తో 15 నిమిషాలు నెత్తి మీద మసాజ్ చేయండి. ఇది జుట్టు పెరుగుదలను ఉపయోగపడుతుంది, జుట్టు పరిమాణాన్ని పెంచుతుంది.
ఆమ్లా హెయిర్ మాస్క్ - 1/3 కప్పు ఆమ్లా పౌడర్ తీసుకొని అందులో పెరుగు లేదా నీళ్లని కలపండి. బాగా కలిపిన తర్వాత ఈ పేస్ట్ని మాస్క్ లాగా జుట్టు పై పూయండి. ఇలా ౩౦ నిమిషాల పాటు ఉంచాలి. ఆ తరువాత మీరు గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయండి.
జుట్టు పరిమాణం పెంచడం కోసం ఆయుర్వేద మూలికలు[మార్చు]
1. భ్రింగరాజ్
2. మెంతులు
3. ఆమ్లా
4. త్రిఫల
5. బ్రహ్మి
భ్రింగరాజ్ - భ్రింగరాజ్ పొడిని వేడి నూనె తొ కలిపి జుట్టు పై రాయండి. ఒక ౩౦ నిమిషాల పాటు దీనిని ఉంచండి. ఆ తరువాత మంచి హెర్బల్ షాంపూ తీసుకొని మీ జుట్టును శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు యొక్క పరిమాణము పెరగడానికి అవకాశం ఉంది.
ఆమ్లా - కొబ్బరి నూనెను వేడి చేసి, రెండు చెంచాల పొడి ఆమ్లా జోడించవచ్చు. నూనె గోధుమ రంగులోకి వచ్చే వరకు వేడి చేయండి . ఈ మిశ్రమం చల్లబడిన తరువాత జుట్టు కి రాయండి.
త్రిఫల చూర్ణం - దీన్ని మీ ఆహరం లో చేర్చవచ్చు లేదా కొబ్బరి నూనె మిశ్రమాన్ని త్రిఫల పౌడర్‌తో కలిపి జుట్టుపైన పూయవచ్చు. [4]
జుట్టునుంచి దుర్వాసన[మార్చు]
జుట్టునుంచి దుర్వాసన అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. చెమట ఎక్కవగా పట్టడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటి వివిధ కారణాల వలన ఈ సమస్య ఎదురవుతుంది. అదే సమయంలో, ఆహార అలవాట్లు ను సరిగ్గా పాటించకపోవడం, హార్మోన్ల అసమతుల్యతలు అలాగే పర్యావరణ కారకాలు వంటివి కూడా జుట్టునుంచి దుర్వాసన సమస్యను కలిగిస్తాయి. [5]
స్మెల్లీ హెయిర్ నుండి వాసన[మార్చు]
ప్రజలు తరచుగా జుట్టునుంచి సంభవిస్తున్న వాసనను పుల్లని పాలు,సాక్స్, కొన్నిసార్లు దుర్వాసనతో కూడిన డైపర్‌లతో పోలుస్తారు. తీవ్రమైన దుర్వాసనను ప్రజలు సులభంగా గమనించవచ్చు.
జుట్టునుంచి దుర్వాసనను ఆపడం[మార్చు]
A. వాసనగల జుట్టు కోసం షాంపూ[మార్చు]
మీకు జుట్టునుంచి దుర్వాసన ఉన్నప్పుడు, కింది మూలికా పదార్ధాలతో ఆయుర్వేద షాంపూలను ఎంచుకోండి. ఈ మూలికలు సూక్ష్మజీవుల పెరుగుదలతో పోరాడటమే కాకుండా మీ నెత్తికి సుగంధ సారాన్ని జోడించడమే కాకుండా మీ ఎత్తైన దోషాలను సమతుల్యతలోకి తీసుకురావడానికి దోహదం చేస్తాయి.
- కలబంద - మీ జుట్టుకు సున్నితమైన కండిషనింగ్ అందించేటప్పుడు చుండ్రు, చర్మం సోరియాసిస్, దుర్వాసన నెత్తిమీద కారణమయ్యే ఇతర సమస్యలకు చికిత్స చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.
- వేప - బలమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో మీ నెత్తిపై సూక్ష్మజీవుల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా, వేప మీ విరిగిన జుట్టును మరమ్మతు చేస్తుంది, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను పెంచుతుంది.
- అమ్లా - అమ్లా ఆయుర్వేదం మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది. ఇది సూక్ష్మజీవుల సంక్రమణలను నివారించడం ద్వారా మీ నెత్తిని ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుతుంది. అలాగే, ఇది మీ జుట్టు మూలాలకు పోషణను అందిస్తుంది.
- మందార - ఇది మీ నెత్తిపై సెబమ్ స్రావాన్ని నియంత్రించే బలమైన రక్తస్రావ నివారిణి లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే, ఇది మీ నెత్తికి చైతన్యం నింపుతుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
B. ఇంటి నుండే జుట్టునుంచి దుర్వాసనకు నివారణ[మార్చు]
- నిమ్మరసం - కొబ్బరి నూనె లేదా బాదం నూనె వంటి ఏదైనా నూనెను ఒక కప్పులో 2 స్పూన్ల నిమ్మరసం కలపండి. మీరు ఒక కప్పు నీటిలో ఈ రసాన్ని కూడా జోడించవచ్చు. ఈ రసంతో మీ నెత్తిని పూర్తిగా మసాజ్ చేసి, 15 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు, సాధారణ నీటిని ఉపయోగించి సరిగ్గా కడగాలి. వారానికి రెండుసార్లు ఈ ప్రక్రియను పునరావృతం చేయండి. [6]
- టొమాటో జ్యూస్ - పై తొక్క తీసి టొమాటో గుజ్జును రుబ్బుకోవాలి. దీన్ని మీ నెత్తిమీద పూయండి, సున్నితమైన మసాజ్ చేయండి. మీ చర్మం, జుట్టు కడగడానికి ముందు సుమారు 20-30 నిమిషాలు అలాగే ఉంచండి.
ఇవి కూడా చూడండి[మార్చు]
![]() |
Look up hair in Wiktionary, the free dictionary. |
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 Sindhu (2017-05-23). "జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఇలా చేయండి చాలు..!". https://telugu.boldsky.com. Retrieved 2022-02-28.
{{cite web}}
: External link in
(help)|website=
- ↑ https://te.vikaspedia.in/health/c1ac3fc1fc4dc15c3ec32c41/c1cc41c1fc4dc1fc41c15c41-c2ac4bc37c23c15c41-c2ac4bc37c15c3ec32c41
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-06-25. Retrieved 2020-04-17.
- ↑ https://vedix.com/blogs/articles/how-to-increase-hair-volume
- ↑ https://telugu.boldsky.com/beauty/hair-care/2018/home-remedies-for-smelly-hair/articlecontent-pf108390-019310.html
- ↑ https://vedix.com/blogs/articles/smelly-hair-scalp
యితర లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Hair. |
- Discussion about shaving and cultures
- Answers to several questions related to hair from curious kids Archived 2013-05-30 at the Wayback Machine
- How to measure the diameter of your own hair using a laser pointer
- Instant insight outlining the chemistry of hair from the Royal Society of Chemistry
- Wiktionary "hairsbreadth"