ఉదరము
(కడుపు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉదరము లేదా కడుపు (Abdomen) మొండెంలోని క్రిందిభాగం. ఇది ఛాతీకి కటిభాగానికి మధ్యలో ఉంటుంది. దీనిని పొట్ట అని కూడా అంటారు.[1] పొట్ట అంటే గర్భం అని కూడా ఒక అర్థం ఉంది. ఇంకో అర్థంలో పొట్ట రావడం అంటే ఉదరం ఉబ్బి ఒక అనారోగాన్ని సూచించడానికి కూడా వాడతారు. స్థూల కాయం వలన కొవ్వు చేరి పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ, మరికొన్ని ఇతర అవయవాలున్నాయి. కాలేయము ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది. ఉదరవితానము (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది. ఉదర కుహరం (Abdominal cavity) ఉదరంలోని వివిధ అవయావాలను కప్పుతూ సీరస్ పొర ఉంటుంది. దీనిలో కొంత ఉదర ద్రవం (Abdominal fluid) ఉండి పేగులవంటివి రాపిడి లేకుండా వీలు కల్పిస్తాయి.
సకశేరుకాలు
[మార్చు]ఉదరంలోని అవయవాలు
[మార్చు]- జీర్ణ వ్యవస్థ: అన్నకోశము, చిన్న పేగు, పెద్ద పేగు, ఉండుకము
- అనుబంధ అవయవాలు: కాలేయము, పిత్తాశయము, క్లోమము
- మూత్ర వ్యవస్థ: మూత్రపిండాలు, మూత్రనాళాలు
- ఇతర భాగాలు: ప్లీహము