మోకాలు
Appearance
మోకాలు | |
---|---|
వివరములు | |
లాటిన్ | Articulatio genus |
Femoral, obturator, sciatic | |
Identifiers | |
Gray's | p.839 |
MeSH | A01.378.610.450 |
Dorlands /Elsevier | Knee |
TA | A01.1.00.036 |
FMA | 24974 |
Anatomical terminology |
మోకాలు (Knee) తొడకు, ముంగాలుకు మధ్యభాగం. మోకాలు కీలు ముంగాలులోని జంఘికలకు, తొడ ఎముకకు మధ్య ఏర్పడుతుంది.
మోకాలి గాయాలు
[మార్చు]క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్... ఇలా ఏ ఆట ఆడినా మోకాళ్ల కదలికే కీలకం. క్రికెట్ ఆటలో వేగంగా పరుగు తీయాలన్నా... ఫుట్‌బాల్‌లో బంతిని కొట్టాలన్నా మోకాళ్ల పాత్ర చాలా ఉంటుంది. ఆటగాళ్లకు సరైన అవగాహన లేక తరచూ గాయాల బారిన పడుతున్నారు. మేటి క్రీడాకారులు ఉజ్వల భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. తగిలిన గాయాలకు సకాలంలో తగిన చికిత్స చేయించుకోలేక ఆటకు చాలామంది దూరమవుతున్నారు. మోకాళ్ల కదలిక సరిగా లేకుంటే చెస్ తప్ప... ఏ ఆట ఆడలేని పరిస్థితి. మనదేశంలో చాలా మంది వర్ధమాన యువ క్రీడాకారులు మోకాళ్ల గాయాలతో కోలుకోలేక ఆటకు స్వస్తి పలుకుతున్నారు. మోకాళ్ల గాయాలు, వాటి చికిత్సపై వైద్యరంగ నిపుణులు ఈ క్రింది జాగ్రత్తలు సూచించారు.
- తరచూ శ్రమించే భాగాలివే : ఒక ఆటగాడి మోకాలి భాగాల్లో ఎక్కువగా హ్యామ్‌స్ట్రింగ్, క్వార్టర్ చిప్స్, కాప్ మజిల్, ఐటీ బ్యాండ్ శ్రమకు గురవుతుంటాయి. ఎక్కువగా వీటికి గాయాలవుతుంటాయి. తగిన చికిత్స చేసుకుంటే త్వరగా కోలుకోవచ్చు. కండరాల్లో కాల్షియం, నీరు శాతం తగ్గినా మోకాళ్లకు కొంత ఇబ్బంది తలెత్తుంది.
- చికిత్సలో భాగంగా ఆటగాడికి విశ్రాంతి చాలా అవసరం. మోకాలికి ఐసుముక్కలను పట్టించాలి. నేరుగా కాకుండా ఐసుముక్కలను గుడ్డలో వేసి 15 నిముషాల పాటు పెట్టాలి. మరీ ఎక్కువసేపు పెట్టకూడదు.
- మోకాలికి గాయం ఎక్కువైతే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఐసోమేట్రిక్ వ్యాయామం చేయాలి. కండరాలు బలోపేతం కావడానికి తగిన వ్యాయామం చేయాలి.
- క్రయోథెరపీ ద్వారా మోకాలికి చికిత్స చేయాలి. 20 నిముషాల పాటు మోకాలికి ఐసింగ్ చేయాలి. స్ట్రెచింగ్ చేయడం వల్ల మోకాలిలో కదలికల వేగం పెరుగుతుంది. గాయం తగ్గడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది.
- మోకాలి గాయం ప్రబలకుండా ఉండాలంటే ప్రవర్తక సాంకేతిక చలనం చేయాలి. గాయాలు త్వరగా మానాలంటే సంఘటితం చేసే చిట్కాలు పాటించాలి. ఆక్యుపంక్చర్ వైద్యం వల్ల కూడా మోకాలి గాయాలను త్వరగా నయం చేసుకోవచ్చు.