వెన్నుపూస
Appearance
(వెన్నుపూసలు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మనుషుల వెన్నెముకలో 33 వెన్నుపూసలు (Vertebrae) శరీరం వెనకభాగంలో మెడనుండి పిరుదుల వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. వెన్నుపూసలను 'కశేరుకాలు' అని కూడా అంటారు.
- గ్రీవ కశేరుకాలు (Cervical vertebra) - 7
- వక్షీయ కశేరుకాలు (Thoracic vertebra) - 12
- కటి కశేరుకాలు (Lumbar vertebra) - 5
- త్రికము (Sacrum) - 5
- అనుత్రికము (Coccyx) - 3-5
వెన్నునొప్పి
[మార్చు]ఎక్కువగా కంప్యూటర్‌పై పనిచేయడం, మితిమీరిన వాహన వినియోగం, వ్యాయామం చేయకపోవడం ,మారిన జీవనశైలి, ఇష్టం వచ్చినట్లు కుర్చీలు, సోఫాల్లో కూర్చొని టీవీలకు అతుక్కుపోవడం, కుర్చీ కదలకుండా విధులు నిర్వహించడం తదితర కారణాల వల్ల ఈ సమస్య తీవ్రమవుతోంది.
- కుర్చీలో కూర్చునేటప్పుడు వెన్నుపూస వెనుక కుర్చీ భాగానికి ఆనించి ఉండాలి.
- మెడ, నడుం వంచి ఎక్కువ సేపు పనిచేయకూడదు.
- కంప్యూటర్ స్క్రీన్ తలకు తగినంత ఎత్తులో ఉండాలి.
- సర్వైకల్ స్పాండిలైటీస్‌తో బాధపడుతున్నవారు సర్వైకల్ కాలర్, లంబార్ స్పాండిలైటీస్ ఉన్నవారు లంబార్ బెల్టు ఉపయోగించాలి.