మానవ జీర్ణవ్యవస్థ
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
మానవ జీర్ణవ్యవస్థ | |
---|---|
![]() మానవ జీర్ణవ్యవస్థ | |
వివరములు | |
లాటిన్ | Systema digestorium |
Identifiers | |
TA | A05.0.00.000 |
TH | H3.04 |
FMA | 7152 |
Anatomical terminology |
జీర్ణవ్యవస్థ అనగా ఆహారాన్ని జీర్ణం చేసే శరీర భాగం. ఇది ఆహారాన్ని సాధారణ రసాయన పదార్ధాలుగా విచ్ఛిన్నం చేస్తుంది, తద్వారా రసాయన పదార్థాలలోని కొన్ని పోషకాలు రక్త ప్రవాహంలో కలిసిపోతాయి. రక్త ప్రవాహం నుండి పోషకాలు మొదట కాలేయానికి చేరతాయి. కాలేయం పోషకాలను సర్దుబాటు చేస్తుంది, తద్వారా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. కాలేయం విడుదల చేసే కొన్ని రసాయనాలు ఆహారం జీర్ణక్రియకు కారణమవుతాయి.
మానవుడి జీర్ణ వ్యవస్థలో భాగాలు: నోరు, ఆస్యకుహరం, గ్రసని, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, పురీష నాళం, పాయువు.
మానవ జీర్ణవ్యవస్థలో ఆహార వాహికతో పాటు జీర్ణక్రియ యొక్క అనుబంధ అవయవాలు: లాలాజల గ్రంథులు, క్లోమం, కాలేయం,
జీర్ణవ్యవస్థ వ్యర్థ పదార్థాలను కూడా తొలగిస్తుంది. జీర్ణ వ్యవస్థ నోటి నుండి మొదలై పాయువుతో ముగుస్తుంది (గమనిక: జీర్ణక్రియ చిన్న ప్రేగుల వద్దనే ముగుస్తుంది).
పురుగులు, క్షీరదాలు, పక్షులు, చేపలు, మానవులు వంటి జంతువులు/కీటకాలు అన్నీ జీర్ణ వ్యవస్థను కలిగి ఉంటాయి.
జీర్ణశయాంతర వ్యవస్థను ప్రభావితం చేసే అనేక వ్యాధులు ఉన్నాయి. జీర్ణశయాంతర ప్రేగులను అధ్యయనం చేసే వైద్యులను గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు అంటారు.