దురద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Pruritus
Classification and external resources
Itch.jpg
వీపు పై గోకడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి
ICD-10L29
ICD-9698
DiseasesDB25363
MedlinePlus003217
eMedicinederm/946
MeSHD011537

దురద, తీట లేదా నవ (Itching) చర్మంలోని భాగాన్ని గోకాలనిపించడం. ఇది ముఖ్యంగా గజ్జి, తామర వంటి చర్మవ్యాధులలోను, పచ్చకామెర్లు వంటి కొన్ని ఇతర శరీర సంబంధ వ్యాధులలోను వస్తుంది.కొన్ని సార్లు వాతావరణ కాలుష్యం వలన కూడా దురద పుడుతుంది. కలుషిత నీటిలో ఈతలాడినపుడు కూడా దురద పుడుతుంది. దురద మానవులకే కాకుండా కోతి, కుక్క, పశువు లాంటి జంతువులకు, కాకి లాంటి పక్షులకు కూడా పుడుతుంది.

యోనిలో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో ట్రైకోమోనియాసిస్ అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.

కారణాలు[మార్చు]

  • సంక్రమణ (Infection)
  • ఎక్కువ సేపు నీటిలో గడపడం.
  • మందులు
  • ఇతర కారణాలు

దురదపై తెలుగులో గల కొన్ని సామెతలు/పదాలు[మార్చు]

  • కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు
  • నోటి దురద : చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళను, వదరుబోతులను సంబోధిస్తారు.
  • కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద.
Scabies is one cause of itching.
"https://te.wikipedia.org/w/index.php?title=దురద&oldid=2911070" నుండి వెలికితీశారు