ఒత్తిడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తప్ప అన్నింటిలో దూసుకుపోతున్నారు. ఈ బిజీ బిజీ లైఫ్ లో ఒత్తిళ్ళతో సత మతమవుతున్నారు. ఈ ఒత్తిడే మనిషిపాలిట శాపంగా మారుతోంది. తాజా సర్వేలు దాదాపు 70 శాతం ఆరోగ్య సమస్యలు కేవలం ఒత్తిడి వల్లే వస్తున్నాయని తేల్చాయి. ఒత్తిడి మన శరీరం పైన అంతటా ప్రభావం చూపిస్తుంది. శరీరం లోని ప్రతి భాగం దీని ప్రభావం వల్ల అనేక సమస్యలకు లోనవుతుంది. ఒత్తిడి వల్ల కోపం, బాధ లాంటి నెగటివ్ ఎమోషన్స్ పెరిగి యాంగ్జయిటీ, డిప్రెషన్‌లకు దారితీస్తాయి. శారీరకంగా కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. అసిడిటీ, అల్సర్ల లాంటి సాధారణ సమస్యల నుంచి గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులను మోసుకొస్తుంది మానసిక ఒత్తిడి. అంతేకాదు.. మానసిక ఒత్తిడి పెరిగితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. తద్వారా అనేక రకాల ఇన్‌ఫెక్షన్లకు గురవుతారు. అందుకే మనం ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి కనిపిస్తాయి. అందుకే వీటిని సైకోసొమాటిక్ సమస్యలు అంటారు.

ఒత్తిడి వలయం

[మార్చు]

ఒత్తిడికి కారణమయ్యే పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఆ విషయాన్ని ముందుగా మెదడు గ్రహించగానే శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. శరీర భాగాలకు మరింత ఆక్సిజన్ అందజేయడానికి హృదయ స్పందనలు పెరుగుతాయి. తద్వారా బీపీ పెరుగుతుంది. శ్వాస వేగం హెచ్చుతుంది. వీటి ప్రభావం జీవక్షికియల మీద పడుతుంది. ముఖ్యంగా జీర్ణక్షికియ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. తద్వారా జీర్ణకోశం ఎక్కువ ఆహారాన్ని జీర్ణం చేయడానికి రెడీ అవుతుంది. కానీ అంత ఆహారం అందుబాటులో ఉండదు కాబట్టి అసిడిటీ పెరుగుతుంది. అసిడిటీ వల్ల ఉత్పత్తయిన టాక్సిన్స్‌ని తీసేయడానికి విసర్జన వ్యవస్థపై ఎక్కువ పని పడుతుంది. దానివల్ల అది ఒత్తిడికి లోనవుతుంది. దీని ఫలితంగా అంతవూస్సావీ వ్యవస్థ అస్తవ్యస్తమై హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. ఇది భావోద్వేగాలు అదుపు తప్పడానికి కారణమవుతుంది. అలా మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది. అందుకే ఒకసారి ఒత్తిడంటూ మొదలయ్యిందంటే దాన్ని తగ్గించుకునే వరకు ఇలా సమస్య మీద సమస్య వస్తూనే ఉంటుంది.

ఒత్తిడి లక్షణాలు

[మార్చు]
  • కోపం, అసహనం, పగ యొక్క సాధారణ భావన, లోతుగా-పాతుకుపోయిన అభద్రత
  • నిరాశతో, అపనమ్మకంతో, ప్రతి ఒక్కదాని గురించి భయపడడం.
  • నిద్రపోవడంలో ఇబ్బంది
  • శక్తి లేకపోవడం
  • ఆకలి, బరువులో మార్పులు
  • దీర్ఘకాలిక, తీవ్రమైన నొప్పి
  • జుట్టు రాలడం

ఒత్తిడి వలన కలిగే దుష్ప్రభావాలు

[మార్చు]
  • ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘకాలిక గుండెజబ్బులు ఎక్కువగా వస్తుంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కోసారి ఒత్తిడి గుండెపోటుకు సైతం దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
  • ఒత్తిడి మానసికమైన అంశంగా కనిపించినా... దీర్ఘకాలం కొనసాగితే అది... స్థూలకాయం, గుండెజబ్బులు, అలై్జమర్స్‌ వ్యాధులు, డయాబెటిస్, డిప్రెషన్, జీర్ణకోశ సమస్యలు, ఆస్తమా వంటి శారీరకమైన సమస్యలకూ దారితీస్తుంది.

మరి ఎలా అదుపు చేయాలి

[మార్చు]

ఒత్తిడిని కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే ముందుగా పాజిటివ్ దృక్పథాన్ని అలవరచుకోవాలి. సమస్యని భూతద్దంలో చూడకూడదు. అన్ని కోణాల నుంచీ సమస్యని విశ్లేషిస్తే ఎలా పరిష్కరించుకోవాలో అర్థం అవుతుంది. దాన్ని బట్టి సమస్య నుంచి తద్వారా ఒత్తిడి నుంచి బయటపడటం సులువవుతుంది. ఎంత పెద్ద సమస్యనైనా విడి విడి భాగాలుగా చేసి చూస్తే పరిష్కారం సులభమవుతుందంటారు సైకాలజిస్టులు. యోగా, మెడి ఇందుకు సహకరిస్తాయి. ప్రాణాయామం మంచి ఫలితాన్నిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లు పెంచుకోవడం అవసరం. మానసికోల్లాసాన్ని కలిగించే అభిరుచులకు పదును పెట్టడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. సృజనాత్మకత ఉన్న ఏ పని అయినా ఒత్తిడి నుంచి బయటపడేయడానికి సహకరిస్తుంది.

ఒత్తిడి తగ్గించే పాజిటివ్ వలయం

[మార్చు]

మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుకోవడం (సంగీతం లాంటి హాబీలు, ధ్యానం లాంటి వాటి వల్ల) ఒక పాజిటివ్ దృష్టికోణాన్ని ఏర్పరుస్తుంది. ఇది అడ్రినలిన్ మోతాదును సాధారణ స్థాయికి తెస్తుంది. దాంతో గుండె స్పందనలు, బీపీ, శ్వాస అన్నీ సాధారణ స్థితికి వచ్చేస్తాయి. తద్వారా జీవక్షికియలు కూడా సరిదిద్దబడతాయి. అసిడిటీ పోతుంది. హార్మోన్లు సమతులం అవుతాయి. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఫలితంగా మనసుపై ఒత్తిడి లేకుండా ప్రశాంతత చేకూరుతుంది. దాంతో ఇతరత్రా శారీరక సమస్యలు కూడా తగ్గిపోతాయి.

ఇలా చేసి చుడండి...

[మార్చు]

- పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. - సమయానికి తినడం, నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. - ఓ ప్రముఖ మనోవిశ్లేషకులు చెప్పినట్టు ఏ సమస్య అయినా శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఇప్పటి బాధ రేపు ఉండదు. - ఎక్కువ కాలం ఉండే మన జీవితాన్ని కష్టమయం చేసుకోవడం ఎందుకు... - ఇలాంటి లాజిక్‌లు సమస్యను స్వీకరించడానికి, ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. - ప్రతిరోజూ ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం అవసరం.

జీవితంలో ఎంత డబ్బు ఉన్న ఆరోగ్యంగా లేకపోతే అది వృధానే. ఇప్పుడు మనకు డబ్బు సంపాదించడం ఎంత అవసరమో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకంటే ప్రధానం. ఒత్తిడి వల్ల నాలుగు పదులు దాటగానే సకల ఆరోగ్య సమస్యలు ఆహ్వానం పలుకుతాయి. ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే మీ ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించాల్సిందే...లేదంటే భవిష్యత్ లో మీకోసం రోగాలు సమయం కేటాయిస్తాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=ఒత్తిడి&oldid=3877404" నుండి వెలికితీశారు