డబ్బు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డబ్బు లేదా ద్రవ్యము మానవ సమాజములో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వస్తువు. దీనిని ఎక్కువగా క్రయ విక్రయములలో ఉపయోగిస్తారు. వివిధ దేశాలలో దీనికి వివిధ ప్రామాణికములు ఉన్నాయి. మన భారతదేశములో దీనికి రూపాయి ప్రామాణికము.

చరిత్ర[మార్చు]

గవ్వలను ధనంగా వాడుతున్న అరబ్ వర్తకులు - 1845 నాటి ప్రింట్

డబ్బుది వేల సంవత్సరాల చరిత్ర. ప్రాచీన కాలములో వస్తుమార్పిడి పద్ధతి ద్వారా క్రయ విక్రయములు జరిపేవారు. తదుపరి కాలములో అనేక వస్తువులు, ఆల్చిప్పలు, గవ్వలు, బార్లీ, పూసలు మొదలైనవి డబ్బుగా చలామణి అయ్యాయి. సహజంగా చాలా తక్కువగా దొరికే విలువైన లోహాలు, బంగారం వెండి లాంటివి డబ్బుగా ఉపయోగించారు.

తదుపరి రాజుల కాలములో టంకశాలలలో ముద్రించిన నాణేల ద్వారా వ్యాపార వాణిజ్యములు నడిచేవి. కాగితమును కనుగొన్న తరువాత మొట్టమొదటిసారిగా చైనా దేశము వారు డబ్బును కాగితములపై ముద్రించే సంప్రదాయమును ప్రారంభించారు.వీటిని కరెన్సీ నోట్లుగా వ్యవహరిస్తారు.

ప్రస్తుతం[మార్చు]

వివిధ దేశాలలో కేంద్రీయ బాంకుల ఆధ్వర్యములో ఈ డబ్బు ముద్రణా కార్యక్రమము జరుగుతుంది. భారత దేశములో భారతీయ రిజర్వ్ బాంక్ ఆధ్వర్యములో డబ్బు ముద్రణ జరుగుతుంది.

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=డబ్బు&oldid=2866654" నుండి వెలికితీశారు