గజ్జి
సార్కాప్టిస్ స్కేబీ | |
m:en:ICD-10 | {{{m:en:ICD10}}} |
m:en:ICD-9 | {{{m:en:ICD9}}} |
DiseasesDB | 11841 |
m:en:MedlinePlus | 000830 |
m:en:eMedicine | {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} |
MeSH | {{{m:en:MeshID}}} |
గజ్జి (ఆంగ్లం: scabies) ఒక విధమైన పరాన్న జీవి వలన కలిగే అంటు వ్యాధి. ఇది చర్మంలో సొరంగాలు చేసి దాని మూలంగా విపరీతమైన దురద, పుండ్లు, వాపు కలుగుతుంది. ఈ పరాన్న జీవి పేరు "సార్కాప్టిస్ స్కేబీ" (Sarcoptes scabei). స్కేబీస్ అనే పదం లాటిన్ స్కేబెర్ అనగా గోకడం నుండి వచ్చింది.
గజ్జి పరాన్నజీవి
[మార్చు]సార్కాప్టిస్ స్కేబీ కొన్ని జంతువులలో, మనుషులలో గజ్జి వ్యాధిని కలుగజేస్తుంది. ఇవి ఒకవిధమైన పరాన్నజీవి కీటకాలు. ఇవి కంటికి కనిపించనంత సూక్ష్మంగా 0.3-0.4 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటాయి. ఇవి చర్మంలోని పల్చని పైపొర (స్ట్రేటమ్ కార్నియమ్) క్రిందనే ఉండి అక్కడ 2-3 మి.మీ. బొరియల్లాంటివి ఏర్పరచి వాటిలో గుడ్లు పెడుతుంది. చర్మంపై వీటి జీవిత చక్ర కాలం (life cycle) రెండు వారాలు మాత్రమే ఉండవచ్చును. స్కేబీస్‌తో బాధపడే వ్యక్తి శరీరంపై ఒక డజన్ కంటే ఎక్కువ ఈ విధమైన క్రిములు ఉండవు. అరుదుగా ఒక రకమైన నార్వీజియన్ స్కేబీస్ (Norwegian scabies) లో వీటి సంఖ్య లక్షల్లో ఉండవచ్చును. ఇవి ఎయిడ్స్, మధుమేహం మొదలైన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
వ్యాధి లక్షణాలు
[మార్చు]చర్మం లోపలికి తొలుచుకుపోయి ఈ క్రిములు పెట్టే గ్రుడ్ల వలన చాలా తీవ్రమైన ఎలర్జీ సంభవిస్తుంది. కాని వీటి కారణంగా కలిగే తీవ్రమైన దురద కారణంగా చర్మాన్ని గోకడం వలన మరింత బాధ కలుగుతుంది. గోకడం వలన చర్మంపై బాక్టీరియా చేరి గజ్జికి కారణం అవుతుంది. ఈ క్రిములు పందులలో ఎక్కువగా ఉంటాయి.
చికిత్స
[మార్చు]- బెంజైల్ బెంజయేట్ (Benzyl Benzoate) అనే లోషను లేదా క్రీము ముఖము తప్పించి ఒళ్ళంతా రాసుకొని రాత్రంతా అలాగే ఉంచుకొని ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేయాలి.[1]
మందులు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- American Academy of Dermatology pamphlet on Scabies
- Scabies FAQ from the National Pediculosis Association
మూలాలు
[మార్చు]- ↑ "వేప నునెతో గజ్జి నివరణ". Archived from the original on 2017-07-08. Retrieved 2017-05-18.