సార్కాప్టిస్ స్కేబీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సార్కాప్టిస్ స్కేబీ
Sarcoptes scabei 2.jpg
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: ఆర్థ్రోపోడా
ఉప వర్గం: Chelicerata
తరగతి: అరాఖ్నిడా
ఉప తరగతి: Acarina
Superorder: Acariformes
క్రమం: Astigmata
ఉప క్రమం: Psoroptidia
Superfamily: Sarcoptoidea
కుటుంబం: సార్కాప్టిడే
ఉప కుటుంబం: Sarcoptinae
జాతి: సార్కాప్టిస్
ప్రజాతి: ఎస్. స్కేబీ
ద్వినామీకరణం
సార్కాప్టిస్ స్కేబీ
De Geer, 1778

సార్కాప్టిస్ స్కేబీ (లాటిన్ Sarcoptes scabie) కొన్ని జంతువులలో మరియు మనుషులలో గజ్జి (Scabies) అనే అంటువ్యాధిని కలుగజేస్తుంది. ఇవి ఒకవిధమైన పరాన్నజీవి కీటకాలు. చర్మం లోపలికి తొలుచుకుపోయి స్కేబీస్ అనే చర్మ వ్యాధులను కలుగజేస్తుంది. ముఖ్యంగా ఈ క్రిములు పెట్టే గ్రుడ్ల వలన చాలా తీవ్రమైన ఎలర్జీ సంభవిస్తుంది. చర్మంపై వీటి జీవిత చక్ర కాలం (life cycle) రెండు వారాలు మాత్రమే ఉండవచ్చును. స్కేబీస్‌తో బాధపడే వ్యక్తి శరీరంపై ఒక డజన్ కంటే ఎక్కువ ఈ విధమైన క్రిములు ఉండవు. కాని వీటి కారణంగా కలిగే తీవ్రమైన దురద కారణంగా చర్మాన్ని గోకడం వలన మరింత బాధ కలుగుతుంది. గోకడం వలన చర్మంపై బాక్టీరియా చేరి గజ్జికి కారణం అవుతుంది. ఈ క్రిములు పందులలో ఎక్కువగా ఉంటాయి.