కన్యా లగ్నము
కన్యా లగ్నం
[మార్చు]- సూరుడు :- కన్యాలగ్నానికి సూర్యుడు ద్వాదశాధిపతి ఔతాడు. వ్యయాధిపతిగా సూర్యుడు కన్యాలగ్నానికి అకరక గ్రహం ఔతాడు. కన్యాలగ్నస్థ సూయుడి కారణంగా వ్యక్తి ప్రభావశాలిగా ఉంటాడు. అందమైన, లగ్నస్థ సూర్యుడు ప్రకాశవంతమైన శరీరం ఇస్తాడు. వీరికి దగ్గు, జలుబు, హృదయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. లగ్నస్థ సూర్యుడి కారణంగా వీరికి విదేశీయానం ప్రాప్తించే అవకాశం ఉంది. లగ్నస్థ సూర్యుడు సప్తమ స్థానం మీద దృష్టి ప్రసరిస్తాడు కనుక వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. భాగస్వామ్యం వీరికి అనుకూలించదు. వ్యవసాయం వీరికి అనుకూలిస్తుంది. లగ్నస్థ సూర్యుడికి పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న పరిహారం చేయడం మంచిది.
- చంద్రుడు :- కన్యాలగ్నానికి చంద్రుడు ఏకాదసాధిపతిగా అకారక గ్రహంగా అశుభఫలితం ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అందం, కల్పనా శక్తి, ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి దయాగుణం, ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. వీరు జీవితంలో శీఘ్రగతిలో ప్రగతిని సాదిస్తారు. చంద్రుని స్థికారణంగా అస్థిర మనస్తత్వం ఉంటుంది. ల్గ్నం నూడి చంద్రుడు పరిపూర్ణ దృష్టిని సప్తమ స్థానం అయిన మీనం మీద ప్రసరిస్తాడు కనుక గురువు ప్రభావం చేత జీవిత భాగస్వామితో ప్రేమ పూరిత సహకారం లభిస్తుంది. వీరికి అకస్మాత్తుగా లభము కలిగే అవకాశం ఉంది. చంద్రుడికి పాపగ్రహ చేరిక దృష్టి ఉన్న ఎడల శుభ ఫలితము తక్కువగా ఉండును.
- కుజుడు :- కన్యాగగ్నానికి కుజుడు తృతీయ, షష్టమాధిపతి ఔతాడు. కనుక కుజుడు కన్యాలగ్నానికి అకారక గ్రహంగా అశుభఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ కుజుడి కారణంగా
వ్య్కి క్రోధస్వభావం కలిగి ఉగ్రుడై ఉంటాడు. సోదరులతో సఖ్యత ఉంటుంది. తల్లి తండ్రులతో అభిప్రాయభేదాలు ఉంటాయి. లగ్నస్థ కుజుడి కారణంగా తండ్రికి అనారోగ్యం కలుగుతుంది. కుజుడు అష్టమ భావం మీద దృష్టి సారిస్తాడు కనుక శారీరక కష్టములు అనుభవించవలసి ఉంటుంది. లగ్నస్థ కుజుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి. జీవిత భాగస్వామి వంచనకు గురి కావచ్చు.
- బుధుడు :- బుధుడు కన్యా లగ్నానికి లగ్నాధిపతి, దశమాధిపతిగా ప్రముఖ కారక గ్రహముగా ఉంటాడు. లగ్నస్థ బుధుడు స్వస్థానంలో ఉన్నాడు కనుక వ్యక్తి అందం, ఆకర్షణ, ఆరోగ్యం కలిగి ఉంటాడు. కన్యా లగ్నస్థ బుధుడు వ్యక్తికి పరి పూర్ణ ఆత్మవిశ్వాసం, దీర్ఘాయుషు ఇస్తాడు. వీరి ఆత్మ బలం కారణంగా వ్యక్తి వ్యవసాయ, వ్యాపార రంగాలలో అత్యున్నత ప్రగ్తి సాధిస్తాడు. వీరికి సమాజంలో గౌరవం, ఆదరం లభిస్తుంది. లగ్నస్థ బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి నుండి గుణసంపన్నుడైన జీవిత భాగస్వామి లభిస్తాడు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం సుఖమయముగా, ఆనందమయముగా ఉంటుంది. వీరికి భాగస్వామ్యం లాభిస్తుంది.
- గురువు :- కన్యాలగ్నానికి గురువు అకారక గ్రహం. కన్యాలగ్నానికి గురువు చతుర్ధ, సప్తమ స్థానాలకు అధిపతి ఔతాడు. లగ్నస్థ గురువు కారణంగా వ్యక్తికి తండ్రి వలన పేరు ప్రతిష్ఠలు కలుగుతాయి. బంధు మిత్రులతో అభిప్రాయ భేదములు కలుగుతాయి. పుత్రుల నుండి ఆదరణ సహకారం లభిస్తుంది. పిత్రి సంపద వీరికి లభిస్తుంది. గురువు లగ్నం నుండి పంచమ, సప్తమ, నవమ స్థానముల మీద దృష్టిని సారిస్తాడు. కనుక దీర్ఘాయువు, పుత్రసంతతి, ఖ్యాతి కలుగుతుంది. గురువు పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న శుభ ఫలితాలు తగ్గుతాయి.
- శుక్రుడు :- కన్యాలగ్నానికి శుక్రుడు ధానాధిపతిగా, నవమాధిపతిగా కారక గ్రహంగా శుభఫలితాలు ఇస్తాడు. మిత్ర స్థానంలో ఉన్న కన్యా లగ్నస్థ శుక్రుడు వ్యక్తిని ప్రగతి పధంలోకి తీసుకు వెడతాడు. లగ్నస్థ శుక్రుని కారణంగా వ్యక్తి కళాభిరుచి కలిగి ఉంటాడు. వీరికి ధార్మిక భావములు అధికం. వీరికి వ్యవసాయ రంగంలో సాఫల్యం లభిస్తుంది.
ప్రభుత్వం నుండి ప్రభుత్వ రంగం నుండి సహాయసహకారం లభిస్తుంది. లగ్నస్థ శుక్రుడు సప్తమ స్థానమైన మీనం మీద దృష్టి సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి నుండి సహకారం లభిస్తుంది.
- శని :- కన్యాలగ్నానికి శని పంచమాధిపతిగా, షటమాధిపతిగా ఉండి త్రికోణాధిపత్య గ్రహంగా కారకమై శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శని వ్యక్తిని బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రామికుడిగా చేస్తాడు. లగ్నస్థ శని వ్యక్తికి శరీర దారుఢ్యం ఇస్తాడు. వీరి పవారిక జీవితం అశాంతి కరం. సంతానంతో సత్సంబంధాలు ఉం, డక పోవచ్చు. లగ్నస్థ శని తృతీయ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టిని సారిస్తాడు కనుక సోదరులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. జీవిత భాగస్వామి అందం, ఆధ్యాత్మికత కలిగి ఉంటారు.
కాని మొండి తనం, క్రోధ స్వభావం కలిగి ఉంటాడు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.
- రాహువు :- కన్యాలగ్నమున ఉన్న రాహువు వ్యక్తికి పొడవైన, ఆరోగ్య వంతమైన శరీరం ఇస్తాడు. వీరిలో చతురత్వం స్వార్ధం ఉంటుంది. కనుక వారి కార్యం ఎలాగైనా సాధించుకుంటారు. లగ్న నుండి రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాస్వామితో కలహం అశాంతి కలిగి ఉంటారు. వీరికి భాగస్వామ్యం కలసి రాదు. జీవిత భాగస్వామికి కష్టములు ప్రాప్తించే అవకాశం ఉంటుంది.
- కేతువు :- కన్యా లగ్నస్థ కేతువు వ్యక్తిని స్వార్ధ పూరితుడిని చేస్తుంది. గూఢాచారిగా సాఫల్యత సాధిస్తారు. వీరికి వాత రోగం, నడుము నొప్పి కలిగే అవకాశం కలుగుతుంది.
లగ్నస్థ కేతువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామికి రోగపీడను కలిగిస్తుంది. కేతువు శుభ గ్రహ దృష్టి చేరిక కలిగి ఉన్న వైవాహేతర సంబంధాలకు అవకాశం ఉంటుంది.