పంచమి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో అయిదవ తిథి పంచమి. అధి దేవత - సర్పము.

పంచమీ నిర్ణయం[మార్చు]

ధర్మ సింధు[1] ప్రకారం శుక్ల, కృష్ణ పక్షాలు రెండింటిలోనూ సర్వకర్మలకు చతుర్థీయుక్తమైన పంచమిని గ్రహించాలి. నాగ పంచమికి కూడా పరవిద్ధనే గ్రహించాలి. పూర్వదినమందు చవితి ఆరు ఘడియలుంటే, స్వల్పమైన పంచమి ఉన్నప్పటికీ పరదినమే గ్రహించాలి. చతుర్థి అంతకు తక్కువైతే పూర్వదినం గ్రహించాల్సి ఉంటుంది. స్కందోపవాస వ్రతానికి మాత్రం షష్ఠీయుక్తమే కావలసి ఉంటుంది.

పండుగలు[మార్చు]

  1. నాగ పంచమి
  2. మాఘ శుద్ధ పంచమి - వసంత పంచమి లేదా శ్రీ పంచమి
  3. ఋషి పంచమి

మూలాలు[మార్చు]

  1. పంచమీ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 52.
"https://te.wikipedia.org/w/index.php?title=పంచమి&oldid=2949369" నుండి వెలికితీశారు