Jump to content

పునర్వసు నక్షత్రము

వికీపీడియా నుండి

నక్షత్రములలో ఇది ఏడవ నక్షత్రం. శ్రీరామచంద్రుడు పుట్టిన నక్షత్రం.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
పునర్వసు గురువు దేవవ పురుష పులి వెదురు ఆది హంస అధితి కటకం

పునర్వసు నక్షత్ర జాతకుల తారా ఫలాలు

[మార్చు]
తార నామం తారలు ఫలం
జన్మ తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర శరీరశ్రమ
సంపత్తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర ధన లాభం
విపత్తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి కార్యహాని
సంపత్తార అశ్విని, మఖ, మూల క్షేమం
ప్రత్యక్ తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ ప్రయత్న భంగం
సాధన తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ కార్య సిద్ధి, శుభం
నైత్య తార రోహిణి, హస్త, శ్రవణం బంధనం
మిత్ర తార మృగశిర, చిత్త, ధనిష్ఠ సుఖం
పరమమిత్ర తార ఆరుద్ర, స్వాతి, శతభిష సుఖం, లాభం

పునర్వసు నక్షత్రము నవాంశ

[మార్చు]
  • 1 2 3 వ పాదము - మిధునరాశి.
  • 4 వ పాదము - కర్కాటక రాశి.

పునర్వసు నక్షత్రము గుణాగణాలు

[మార్చు]

ఇది గురు గ్రహ నక్షత్రము, దేవగణ నక్షత్రము, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు, అధిదేవత అధితి, పురుషజాతి. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు. అవసర సమయంలో ఇతరులను ఆదుకునే గుణము ఉంటుంది. సువర్ణము మీద ఆసక్తి ఉంటుంది. ధనుర్విద్య, తుపాకితో కాల్చడము వంటి అలసత కలిగించె విద్యల అందు ఆసక్తి అధికము. అభిప్రాయాలు, మతలు స్పష్టముగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పదిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు. స్వంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపడతారు. వివాహజీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాథమిక దశలోనే సర్ధుబాటు చెసుకోవడము వలన ప్రయోజనము ఉంటుంది. చెప్పినదె పదే పదే చెప్పడము, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాసము ఉంది. ఇవి ఈ నక్షత్రజాతకులకు సాధారాణ ఫలితాలు. సువర్ణము, ఆయుర్వేదము, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపదతారు. సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలము ఇబ్బంది పెడుతుంది.సమస్యలను పరిష్కరిమ్చగలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వము కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంటుంది. బాల్యము సుఖవంతముగా జరిగినా తరువాత సమస్యల వలయములో చిక్కుకుంటారు. నలభై నుండి ఏభై సంవత్సరాల తరువాత సమస్యల నుండి బయటపడి సుఖజీవితము కొనసాగించే అవకాశము ఉంది. ఇంకా తెలుసుకోవాలంటే https://dasamiastro.com/punarvasu-nakshatra-in-telugu/