Jump to content

విశాఖ నక్షత్రము

వికీపీడియా నుండి

విశాఖనక్షత్రము గుణగణాలు

[మార్చు]

విశాఖ గురుగ్రహ నక్షత్రము, రాక్షస గణము, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని, జంతువు పులి, రాశ్యాధిపతి గురుడు. బాల్యము సుఖముగా జరుగుతుంది. తల్లి తండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితము మొదలవుతుంది. వీరికి మొండితనము ఎక్కువ. అనుకున్నది సాధిస్తారు. వీరికి కోపం కూడా ఎక్కువ, అన్యాయాన్ని సహించరు. వీరికి కృతజ్ఞత ఎక్కువ, సహాయము చేసిన వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తారు. వీరిని అయినవారే మోసం చేస్తారు. అప్పటినుండీ వీరు జీవితంలో ఎవరినైనా నమ్మాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ప్రేమలో వైఫల్యము ఉంటుంది. భార్య లేక భర్త సహాయము లేకున్ననూ వీరికి భగవంతుని యెడల ఉన్న విపరీతమైన భక్తి వలన జీవితంలో రాణించగలరు. ఎవరు తమతో ఉన్నా, లేకపోయినా వీరికున్న సహజమైన వైరాగ్య చింతన మరియు స్థితప్రజ్ఞత వలన ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలరు. వైద్య, వ్యాపార, సాంకేతిక, ఎగుమతి-దిగుమతి, ఖనిజాలు, కళ, కవిత్వము, చిత్ర రంగాలలో పైకి వస్తారు. ఏదైనా ఒక రంగంలోకి దిగే ముందు తీవ్రమైన కృషి మరియు లోతైన పరిశోధన తప్పని సరిగా చేయవలెను. ఆ పరిశ్రమ మరియు పరిశోధన వీరిని మరింత ముందుకు వెళ్లడానికి దోహదం చేస్తుంది. రాజకీయ ప్రవేశము చెస్తే ఉన్నత పదవులు వస్తాయి. వీరు మంచి సలహాదారులగుట వలన, వీరి వలన, వీరి ప్రాంతానికి, వీరి ధర్మానికి, వీరి మతానికి మరియు వీరి దేశానికి కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. వంశాపారంపర్య ఆస్తులు సంక్రమిస్తాయి. స్వంతగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. ఏదైనా ధర్మంగానే ఆర్జిస్తారు. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది.. అన్యభాషలు నేర్చుకుంటారు. ఒక రంగం ఆధారముగా, ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగములో కూడా విజయము సాధించి ప్రాముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధము ఉండదు. వీరు తమకున్న నిష్కల్మషమైన మనస్సు మరియు నిజాయితీతో, ధైర్యంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదిరించి, నమ్ముకున్న వారికోసం నిలిచి, జీవితంలో గెలిచి చూపిస్తారు. నాయకత్వ లక్షణాలతో రాజకీయ రంగంలో అద్భుతంగా రాణించగలరు. తన మన తేడా లేకుండా న్యాయంగా వ్యవహరించే మనస్తత్వము ఉంటుంది. నరనరాల్లో దేశభక్తి ఉంటుంది. జీవితములో కనీస అవసరాలను తీర్చుకుంటే చాలు అనుకుంటారు. అత్యాశ అస్సలు ఉండదు. కుటుంబసభ్యుల మీద తప్ప ఇతరుల మీద ఆధారపడరు. భయము అస్సలు ఉండదు, పొదుపు అంటే తెలియదు, దాన ధర్మాలలో ముందు ఉంటారు. మన అనుకునే వాళ్ల గురించి వీరికి జాగ్రత్త ఎక్కువ, వీరి విజ్ఞానము మరియు అనుభవము జీవితములో సమపాళ్లలో ఉంటాయి. నలభై సంవత్సరాల అనంతరము జీవితము సుఖవంతముగా సాగుతుంది కనుక వృద్ధాప్యము ఆనందంగా, ప్రశాంతంగా భగవంతుని సేవలో ఎన్నెన్నో తీర్థయాత్రలు చేస్తూ, నలుగురికీ చేతనైనంత సహాయం చేస్తూ, మూగప్రాణులకు ఆహారం అందిస్తూ, దేశ సేవలో ముందు ఉంటూ, అందరిలా కాక ఒక నాయకుడిగా, నలుగురు మెచ్చే ఓ మంచి మనిషిలా పేరు తెచ్చుకుని ప్రశాంతం గా జీవనం సాగిస్తారు.

నక్షత్రములలో ఇది 16వ నక్షత్రం.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
విశాఖ గురువు రాక్షస స్త్రీ పులి నాగకేసరి అంత్య గరుడుడు ఇంద్రుడు, అగ్ని 1,2,3 పాదములు తుల,

4 వ పాదము వృశ్చికము

విశాఖ నక్షత్ర జాతకుల తారా ఫలాలు

[మార్చు]
తార నామం తారలు ఫలం
జన్మ తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర శరీరశ్రమ
సంపత్తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర ధన లాభం
విపత్తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి కార్యహాని
సంపత్తార అశ్విని, మఖ, మూల క్షేమం
ప్రత్యక్ తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ ప్రయత్న భంగం
సాధన తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ కార్య సిద్ధి, శుభం
నైత్య తార రోహిణి, హస్త, శ్రవణం బంధనం
మిత్ర తార మృగశిర, చిత్త, ధనిష్ఠ సుఖం
అతిమిత్ర తార ఆరుద్ర, స్వాతి, శతభిష సుఖం, లాభం

విశాఖనక్షత్రము నవాంశ

[మార్చు]
  • 1 వ పాదము - మేషరాశి.
  • 2 వ పాదము - వృషభకరాశి.
  • 3 వ పాదము - మిధునరాశి
  • 4 వ పాదము - thula rasi.

చిత్రమాలిక

[మార్చు]

విశాఖ నక్షత్రము ప్రాశస్త్యము

[మార్చు]