చిత్త నక్షత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిత్తానక్షత్ర జాతకుల గుణగణాలు[మార్చు]

చిత్తా నక్షత్రముకు అధిపతి కుజుడు, గణము రాక్షస, జంతువు పులి, వృక్షము తాటి చెట్టు, రాశ్యధిపతులు బుధుడు శుక్రుడు, అధిదేవత త్వష్ట. బాల్యములో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దత్తు పోవుట లేక స్వజనులకు దూరముగా పెరుగుటకు అవకాశము ఉంది. ఇతరుల ఆర్థిక సాయముతో జీవితములో ముఖ్య ఘట్టాలు పూర్తి చేసుకుంటారు. తాను అనుభవించిన కష్టాలు జీవితములో మరెవ్వరు అనుభవించకూడదని అహర్నిశలు కష్టపడతారు. అర్ధరహితమైన క్రమశిక్షణ కారణంగా స్వజనులు దారి తప్పుతారు. ఎక్కువగా అభిమానించి ప్రాణప్రదముగా భావించిన వారు జీవితములో దూరము ఔతారు. వాదనా పఠిమ కారణముగా న్యాయస్థానాలలో, ప్రజాబాహుళ్యములో అనుకూల ఫలితాలు సాధించినా కుటుంబములో అందుకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. సహచరులంతా ఒక్కటిగా ఈ నక్షత్ర జాతకులను దూరముగా ఉంచుతారు. పెద్దలు, ఉన్నత స్థానాలలో ఉన్న వారి నుండి ప్రతికూలమైన తీర్పులను ఎదుర్కుంటారు. విపరీతమైన కోపము, పోరుబెట్టడము, జరిగిపోయిన వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడము వలన కావలసిన వారికి అమ్దరికీ దూరము ఔతారు. ప్రయోజనము లేని చర్చలు, కోపతాపాలు జీవితములో చేదు అనుభవాలకు దారి తీస్తాయి. సంతానము ఉన్నత స్థితికి వస్తారు. విదేశీ వ్యవహారాలు ఆలస్యముగా కలసి వస్తాయి. వస్తువలను బాగు చేయడము (రిపేరు వర్క్), సాహసకృత్యాలు, సాంకెతిక పరిజ్ఞానము, అగ్నికి సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. అందరిలో ప్రత్యేకత సాధించాలన్న కోరిక వలన వివాదాస్పదమై అనుకూల ఫలితాలను ఇస్తుంది. జీవితములో అన్నిటికీ సర్దుకు పోయే భార్య లభిస్తుంది. జీవిత మధ్య భాగములో స్థిరాస్థులు కలిసి వస్తాయి. పాడి పంత వ్యవసాయము పట్ల ప్రత్యేక అభిరుచి ఉంటుంది.

చిత్తా నక్షత్ర వివరాలు[మార్చు]

నక్షత్రములలో ఇది 14వ నక్షత్రం.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
చిత్త కుజుడు రాక్షస స్త్రీ పులి తాటి మధ్య గరుడ త్వష్ట్ర 1,2కన్య 3,4 తుల

చిత్తా నక్షత్ర జాతకుల తారా ఫలాలు[మార్చు]

తార నామం తారలు ఫలం
జన్మ తార మృగశిర, చిత్త, ధనిష్ఠ శరీరశ్రమ
సంపత్తార ఆర్ద్ర, స్వాతి, శతభిష ధన లాభం
విపత్తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర కార్యహాని
సంపత్తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర క్షేమం
ప్రత్యక్ తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి ప్రయత్న భంగం
సాధన తార అశ్విని, మఖ, మూల కార్య సిద్ధి, శుభం
నైత్య తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ బంధనం
మిత్ర తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ సుఖం
అతిమిత్ర తార రోహిణి, హస్త, శ్రవణం సుఖం, లాభం

చిత్తానక్షత్రము నవాంశ[మార్చు]

  • 1 వ పాదము - కన్యారాశి.
  • 2 వ పాదము - కన్యారాశి.
  • 3 వ పాదము - తులారాశి.
  • 4 వ పాదము - తులారాశి.

చిత్రమాలిక[మార్చు]

ఇతర వనరులు[మార్చు]