పూర్వాషాఢ నక్షత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పూర్వాషాఢ[మార్చు]

పూర్వాషాఢ నక్షత్రముకు అధిపతి శుక్రుడు, అది దేవత గంగ, మనుష్య గణం, జంతువు వానరం, రాశి అధిపతి గురువు. వీరు విలాసమంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. స్త్రీలు జీవితంలో ఉన్నత స్థాయిని చవి చూసి తిరిగి దిగువ స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తులు హరించుకు పోయి కొంత భాగం మాత్రం మిగులుతుంది. చాకచక్యం, కొంటె తనం వీరి స్వంతం. బాల్యజీవితం సుఖవంతము. వివాహ జీవితం సాధారణం. పుట్తిన ప్రామ్తానికి దూరంగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నతస్థాయి సాధిస్తారు. స్నేహితులతో కలసి జీవితంలో విజయాలు సాధిస్తారు. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాలలో ఖ్యాతి రాణింపు లభిస్తుంది. కొంత కాలం తరువాత వీరున్న రంగంలో వీరి స్నెహితులు ఉన్నతి సాధించి వీరిని దూరంగా ఉంచుతారు. వీరి ఓర్పుకు సహనానికి పరీక్షలు ఎదురౌతాయి. ఎక్కువ కాలం ఓర్పు వహించ లేరు. సమాజంలో గౌరవానికి బదులు భయం చోటు చేసుకుంటుంది. ఏ రంగంలోనైనా ఓటమిని అంగీకరించరు. సహోదరుల వలన అపఖ్యాతి లభిస్తుంది. నమ్మిన సేవకాజనం మోసం చేస్తారు. సహోదరీ వర్గం అన్ని విధాలా సహకరిస్తారు. ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి స్వామీజీల పతల సదభిప్రాయం ఉంటుంది. దైవభీతి ఉంటుంది. విదేశీయానం కలుగుతుంది. విదేశీ వ్యాపారము, వ్యవహారము లాభిస్తాయి. సంతానము మీద ఎవ్వరి నీడ పడకుండా కాపాడతారు. వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ జీవితానికి సామాజిక జీవితానికి మధ్య గోడను నిర్మించి జీవించడం మంచికి దారి తీస్తుంది.

నక్షత్రములలో ఇది 20వ నక్షత్రము.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
పూర్వాషాఢ శుక్రుడు మానవ స్త్రీ వానరము నెమ్మి మధ్య గడి పాఠ్యం గంగ ధనసు

పూర్వాషాఢ నక్షత్రజాతకుల తారా ఫలాలు[మార్చు]

తార నామం తారలు ఫలం
జన్మ తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ శరీరశ్రమ
సంపత్తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ ధన లాభం
విపత్తార రోహిణి, హస్త, శ్రవణం కార్యహాని
సంపత్తార మృగశిర, చిత్త, ధనిష్ఠ క్షేమం
ప్రత్యక్ తార ఆర్ద్ర, స్వాతి, శతభిష ప్రయత్న భంగం
సాధన తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర కార్య సిద్ధి, శుభం
నైత్య తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర బంధనం
మిత్ర తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి సుఖం
అతిమిత్ర తార అశ్విని, మఖ, మూల సుఖం, లాభం

పూర్వాషాఢ నక్షత్రము నవాంశ[మార్చు]

  • 1 వ పాదము _ ధనుసురాశి
  • 2 వ పాదము - కన్యారాశి.
  • 3 వ పాదము - తులారాశి.
  • 4 వ పాదము - వృశ్చికరాశి.

చిత్ర మాలిక[మార్చు]

ఇతర వనరులు[మార్చు]