వృషభ లగ్నము
Appearance
వృషభ లగ్నం
[మార్చు]- సూర్యుడు :- సూర్యుడు వృషభరాశికి చతుర్ధాధిపత్యం వహిస్తాడు. కేంద్రాధిపతి కనుక సూర్యుడు వృషభ లగ్నానికి శుభ కారక గ్రహమై ఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ సూర్యుడు వ్యక్తికి ఆత్మవిశ్వాసం, ప్రకాశవంతమైన ముఖ వర్చస్సు ఇస్తాడు. ఆకర్షణీయమైన వీరి మాటలు ఇతరుల మీద ప్రభావం చూపుతాయి. ప్రభుత్వ సహకారం అందుకుంటారు. వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం వీరికి అనుకూలమే. పంచమాధి పతి లగ్నంలో ఉన్న కారణంగా సంతానంతో సత్సంబంధాలు ఉంటాయి. సంతానం నుండి సహాయ సహకారాలు ఉంటాయి. మనోధైర్యం అధికం. సూర్యుడి పూర్ణదృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానం అయిన వృశ్చిక లగ్నం మీద ఉంటుంది కనుక జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. జీవిత భాగస్వమి కోపస్వభావం కలిగి ఉంటారు. భాగస్వాముల, మిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. భాగస్వాములతో ఉద్రేక పూరిత వాతావరణం ఏర్పడినా విశ్వాస పాత్రులుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు.
- చంద్రుడు :- వృషభ లగ్నానికి చంద్రుడు తృతీయాధి పతి ఔతాడు. కాని చంద్రుడు వృషభంలో ఉచ్ఛస్థితిని పొందుతాడు కనుక చంద్రుడు వృషభ లగ్న జాతకులకు శుభ ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వీరికి అందమైన శరీరాన్ని ఇస్తాడు. జల కారకుడైన శుక్రుడు ఆధిపత్యం వహించే వృషభ లగ్నంలో శీతల స్వభావం ఉన్న చంద్రుడు ఉన్నందున శీతల ప్రకృతి కలిగిన శరీరం కలిగి ఉంటారు. వీరికి జలుబు, దగ్గు, ఆయాస సంబంధిత వ్యాధులు రావచ్చు. మానసిక పరిస్థితి అస్థిరంగా ఉంటుంది. గుణవంతులుగా, దయాస్వభావులుగా ఉంటారు. విలాసవంతమైన జీవితం అంటే మక్కువ చూపుతారు. తల్లితో సత్సంబంధాలు ఉంటాయి. మాతృ వర్గ బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. తల్లి తండ్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. కళలంటే ఆసక్తి ఎక్కువ. కల్పనా శక్తి అధికం. ప్రకృతి సౌందర్యానికి ఆకర్షితులు ఔతారు. జలం, నౌకాప్రయాణం, జలప్రదేశాలు వీరిని ఆకర్షిస్తాయి. వీరికి కళాభిమానం ఎక్కువ. కళారంగ సంబంధ వృత్తులలో వీరు రాణిస్తారు.చంద్రుడి పూర్ణ దృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానమైన వృశ్చికం మీద సారిస్తాడు కనుక వీరికి అందమైన ప్రేమ పూరితమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. వీరికి భాగస్వామ్యం అనుకూలిస్తుంది. భాగస్వాములు స్నేహపూరిత సహకారం అందిస్తారు.
- కుజుడు :- వృషభ లగ్నానికి కుజుడు సప్తమ, ద్వాదశాధిపతి ఔతాడు. కేంద్రాధిపత్యం వహిస్తాడు కనుక కుజుడు వీరికి కారక గ్రహమై శుభఫలితాలు అందిస్తాడు. వృషభ లగ్నంలో లగ్నాధిపతిగా కుజుడు ఉన్న కారణంగా వ్యక్తి ఆకర్షణీయం బలిష్టం అయిన శరీరం ఇస్తాడు. విలాసవంతమైన జీవితం పట్ల ఆకర్షితులౌతారు. కోపస్వభావం కనబరుస్తారు. వ్యవసాయ రంగం మీద మక్కువ చూపుతారు. భూములు కొనుగోలు చేయడం పట్ల ఆసక్తి చూపుతారు. సాహసవంతమైన వృత్తులలో రాణిస్తారు. వ్యాపారంలో రాణించడం కష్టం. రక్షణ వ్యవస్థలో ఉద్యోగం చేయడం పట్ల ఆసక్తి చూపుతారు. లగ్నస్థ కుజుడు చతుర్ధ దృష్టిని మిత్ర స్థానం అయిన సింహం మీద ప్రసరిస్తాడు కనుక తల్లి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. తల్లి కోపస్వభావం కలిగి ఉంటుంది. లగ్నస్థ కుజుని సప్తమ దృష్టిని వృశ్చికం మీద ప్రసరిస్తాడు కనుక కోపస్వభావం కలిగిన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. కాని జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. లగ్నస్థ కుజుని అష్టమ స్థాన దృష్టి మిత్ర్ స్థానమైన ధనస్సు మీద ప్రసరిస్తాడు కనుక ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. భాగస్వాములతో వీరికి అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. భాగస్వామ్యం వీరికి సాధారణంగా ఉంటుంది. మిత్రులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి.
- బుధుడు :- వృషభ లగ్నానికి బుధుడు ధనాధిపత్యం, పంచమాధిపత్యం వహిస్తాడు. త్రికోణాధిపతి లగ్నస్థుడు ఔతాడు కనుక బుధుడు వృషభ లగ్నానికి కారక గ్రహమై శుభ ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ బుధుని కారణంగా వ్యక్తి బుద్ధికుశలత, సాహసం కలిగి ఉంటాడు. వీరికి వ్యాపారం అనుకూలిస్తుంది. ధైర్యం అధికం. స్వంత నిర్ణయాలు మనోబలంతో తీసుకుని విజయం సాధిస్తారు. సాహసవంతమైన వృత్తులను స్వీకరించి నైపుణ్యం చూపించగలరు. శిక్షణకు సంబంధించిన ఉపాధ్యాయ వృత్తిలోరాణిస్తారు. బుధుని పూర్ణ దృష్టి సప్తమ స్థానం మిత్ర స్థానం అయిన వృషభం మీద ఉంటుంది కనుక మీత్రుల నుండి సహాయ సహకారాలు ఉంటాయి. స్నేపూరితమైన అందమైన ప్రేమను చూపించే జీవితభాస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయ సహకాతారు అందుకుంటారు. భాగస్వామ్యం వీరికి అనుకూలం. వీరికి భాగస్వాములు స్నేహపూరిత సహకారం అందిస్తారు.
- గురువు :- వృషభ లగ్నానికి గురువు అష్టమ, ఏకాదశ స్థానములకు ఆధిపత్యం వహిస్తాడు. లగ్నత్ష గురువు ఆకర్షణీయమైన, సౌందర్యం ఇస్తాడు.కనుక వృషభలగ్నానికి అకారక గ్రహమై అశుభ ఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ గురువు వ్యక్తికి జ్ఞానం, సుగుణం ఇస్తాడు. ఆత్మబలం, ఆత్మ విశ్వాసం ఇస్తాడు. వ్యాపార రంగం కంటే ఉద్యోగంలో రాణిస్తారు. ధర్మగుణం, దయాగుణం కలిగి ఉంటారు. ధర్మకార్యాల పట్ల ఆసక్తులై ఉంటారు. గురువు పంచమ దృష్టి కన్యారాశి మీద ప్రసరిస్తాడు కనుక బుద్ధి కుశలత కలిగి సహాయ సహకారాలు అందించి గౌరాభిమానం చూపించే సంతానం కలిగి ఉంటాడు. లగ్నస్థ గురువు సప్తమ స్థానమైన వృశ్చికం మీద ప్రసరిస్తాడు కనుక గురువు మిత్రస్థాన దృష్టి జ్ఞానం కలిగిన గౌరవ అభిమానం చూపించి సహాయసహకారాలు చూపించే జీవిత భాగస్వామి లభిస్తుంది. భాస్వామ్యం వీరికి కలిసి వస్తుంది. భాగస్వాలు వీరికి సంపూర్ణ సహకారం అందిస్తారు. గురువు నవమ స్థాన దృష్టి మకరం మీద ప్రసరిస్తాడు కనుక తండ్రితో సాధారణ సంబంధాలు ఉంటాయి. పిత్రార్జితం స్వల్పంగా సంక్రమిస్తుంది.
- శుక్రుడు :- వృషభ లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి ష్టమాధిపతి ఔతాడు. లగ్నాధిపతిగా శుక్రుడు కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నాధిపతిగా శుక్రుడు అందమైన శరీరం ఇస్తాడు. అరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. జలుబు, దగ్గు, ఆయాసం లాంటి వ్యాధులు ఉంటాయి. మనోబలం అధికం. జనాకర్షణ కలిగిఉంటారు. కళారంలో వీరు ప్రతిభ చూపగలరు. కళాసంబంధిత వృత్తులలో రాణిస్తారు. వలాసవంతమైన జీవితం పట్ల ఆసక్తి చూపుతారు. సుఖజీవితం కొరకు ఎక్కువగాఖర్చు చేస్తారు. సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలను చేపడతారు. ఆర్థిక పరిస్థితిబాదా ఉంటుండీ. ధనార్జన బాగా చేస్తారు. లగ్నస్థ శుక్రుడు పూర్ణ దృష్టిని సప్తమ స్థానం అయిన వృశ్చికం మీద సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి విలాసాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కోపస్వభావం కలిగిన అందమైన ప్రేమించే జీవిత భాగస్వామి లభిస్తుంది. వైవాహిక జీవిత సుఖం సాధారణం. మిత్రులు, భాగస్వాములు ఉద్రేక పూరిత గుణం కలిగి ఉంటారు. భాగస్వామ్యం వీరికి సాదారణ ఫలితాన్ని ఇస్తుంది.
- శని :- వృషభ లగ్నానికి శని నవమ, దశమ స్థానాధిపత్యం వహిస్తాడు. ధర్మకర్మాధిపత్యం చేసే శని మిత్ర స్థానమైన వృషభ లగ్నానికి శుభుడై శుభ ఫలితాలు ఇస్తాడు. శని లగ్నాధిపత్యం వలన సన్నని ఆకర్షణీయమైన శరీరం కలిగి ఉంటాడు. పరిశ్రమించి ఉన్నత కార్య సాధన చేస్తాడు. ఆర్థిక స్థితి సాధారణం. తల్లితో వీరికి సఖ్యత సాధారణం. సోదరులతో సఖ్యత ఉండదు. కఠిన స్వభావం కారణంగా ఇతరుల అసహనానికి గురి ఔతారు. శని తృతీయ దృష్టి కారణంగా సోదరులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. సోదరుల సహాయ సహకారం ఉండదు. లగ్నష శని పూర్ణ దృష్టి సప్తమ స్థానమైన వృశ్చికము మీద ప్రసరిస్థాడు కనుక పరుష వాక్కులు పలికి క్రోధ స్వభావం కలిగి, శ్రమించే గుణం కలిగిన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి సహాయసహకారాలు అందవు. భాగస్వామ్యం వీరికి అనుకూలించదు. భాగస్వాముల సహకారం లభించదు. మిత్రుల సహకారం ఉండదు. లగ్నస్థ శని నవమ స్థాన దృష్టి కారణంగా తండ్రితో సత్సంబంధాలు ఉండవు. తల్లి తండ్రుల ప్రేమాభిమానాలకు, సహాయసహకారాలకు దూరం ఔతారు.
- రాహువు :- వృషభ లగ్నస్థ రాహువు వ్యక్తికి రోగరహిత శరీరాన్ని ఇస్తాడు. కపట స్వభావం ఉంటుంది. రాహువు సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితం బాధిస్తుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సుఖం ఉండదు. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
- వృషభ లగ్నస్థ కేతువు వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఇస్తాడు. స్త్రీ పురుషుల మధ్య మీద ఆకర్షణ ఉంటుంది. వివాహేతర సంబంధాల వలన వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి.