Jump to content

జ్యేష్ట నక్షత్రం

వికీపీడియా నుండి
(జ్యేష్ట నక్షత్రము నుండి దారిమార్పు చెందింది)

జ్యేష్టానక్షత్రం గుణగణాలు

[మార్చు]

జ్యేష్టా నక్షత్రమునకు అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రము, అధిదేవత ఇంద్రుడు, జంతువు జింక. ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యాలు కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలు తెలుసుకోవడనికి ప్రయత్నిస్తారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడనికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాన్ని తమ హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సహించ లేరు. ఆత్మన్యూన్యతా భావం కలిగి ఉంటారు. ఎదుటి వారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికే చేసారని భావిస్తారు. మిత్రభేదం కలిగించి, తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు. నమ్మిన స్నేహితులు కూడా వీరిని అలాగే మోసం చేస్తారు. వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు. విశేషమైన దైవభక్తి ఉంటుంది. తమవరకు వచ్చే వరకు వీరికి సమస్యలు కూడా సౌందర్యంగానే కనిపిస్తాయి. భాషలకు భాష్యం వ్రాయగలిగిన పాండిత్యం కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం వీరికి సుఖాన్ని కలిగిఉస్తుంది. సంతానం నష్టంము కావచ్చు. అయినా సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి లోపం ఉండదు. అన్నమాట, ఇచ్చిన వాగ్ధానం నిలబెట్టుకోలేరు. సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నేహం ఉండదు. సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మిద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫిగా సాగుతుంది. బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించ గలరు. తగిన వయసులో సంపాదన మొదలౌతుంది. సంపాదించిన ధనాన్ని భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రంలో గ్రపరిస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు ఉంటాయి.

నక్షత్రములలో ఇది 18వ నక్షత్రము.

నక్షత్రం అధిపతి గణం జాతి జంతువు వృక్షం నాడి పక్షి అధిదేవత రాశి
జ్యేష్ట బుధుడు రాక్షస స్త్రీ లేడి విష్టి ఆది ఇంద్రుడు వృశ్చికము

జ్యేష్టా నక్షత్ర జాతకుల తారా ఫలాలు

[మార్చు]
తార నామం తారలు ఫలం
జన్మ తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి శరీరశ్రమ
సంపత్తార అశ్విని, మఖ, మూల ధన లాభం
విపత్తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ కార్యహాని
సంపత్తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ క్షేమం
ప్రత్యక్ తార రోహిణి, హస్త, శ్రవణం ప్రయత్న భంగం
సాధన తార మృగశిర, చిత్త, ధనిష్ఠ కార్య సిద్ధి, శుభం
నైత్య తార ఆరుద్ర, స్వాతి, శతభిష బంధనం
మిత్ర తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర సుఖం
అతిమిత్ర తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర సుఖం, లాభం

జ్యేష్టానక్షత్రం నవాంశ

[మార్చు]
  • 1 వ పాదము - ధనసరాశి.
  • 2 వ పాదము - మకరరాశి.
  • 3 వ పాదము - kumbham.
  • 4 వ పాదము - మీనరాశి.

చిత్రమాలిక

[మార్చు]

ఇతర వనరులు

[మార్చు]