Jump to content

మఖ నక్షత్రము

వికీపీడియా నుండి

నక్షత్రములలో ఇది పదవది.

నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి
మఖకేతువురాక్షసస్త్రీమూషికముమర్రిఅంత్యపెద్దపక్షిపితృ దేవతలుసింహం

మఖ నక్షత్ర జాతకుల తారాఫలాలు

[మార్చు]
తార నామంతారలుఫలం
జన్మ తారఅశ్విని, మఖ, మూలశరీరశ్రమ
సంపత్తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢధన లాభం
విపత్తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢకార్యహాని
సంపత్తారరోహిణి, హస్త, శ్రవణంక్షేమం
ప్రత్యక్ తారమృగశిర, చిత్త, ధనిష్ఠప్రయత్న భంగం
సాధన తారఆర్ద్ర, స్వాతి, శతభిషకార్య సిద్ధి, శుభం
నైత్య తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రబంధనం
మిత్ర తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రసుఖం
అతిమిత్ర తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిసుఖం, లాభం

మఖనక్షత్రము నవాంశ

[మార్చు]
  • 1 వ పాదము - సింహరాశి.
  • 2 వ పాదము - వృషభరాశి.
  • 3 వ పాదము - మిధునరాశి.
  • 4 వ పాదము - కర్కాటకరాశి.

మఖ నక్షత్రము గుణగణాలు

[మార్చు]

మఖ కేతుగ్రహ నక్షత్రము కనుక ఈ నక్షత్రజాతకునికి మంత్రోపాసన, వైరాగ్యము, భక్తి సహజముగా అలవడతాయి. ఆధ్యాత్మిక చింతనలు అధికము. కేతువు ఆధిపత్యము, రాక్షస గణముల చేరిక కారణముగా పట్టుదల, ప్రతీకారము వంటివి అధికము. ప్రతి విషయములో జాగ్రత్త వహించడం వలన ఈ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్ణయం తీసుకోలేరు. పొదుపు చేసే గుణము ఉంటుంది. జీవితంలో అభద్రతా భావము అధికము. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడము వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణము అధికము. ఎవరికీ తల వంచని మనస్తత్వం వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారిగా రాణిస్తారు కాని కింది ఉద్యోగుల నిరసనకు గురియవుతారు. ఇతరులకు ఎప్పుడూ మంచి నూరి పోస్తుంటారు. ఈ కారణంగా హేళనకు గురి అవుతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు కాని ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతము భద్రము చేస్తారు. వాటిని ఎవరిని ముట్టనివ్వరు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా ఉంటాయి. నిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. ఉదయము నుండి రాత్రి వరకు శ్రమిస్తారు.నిద్ర లేమిని సహించరు. సహన గుణము తక్కువ. తన వారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోరు. అన్యాయార్జితము స్వీకరించరు. జరిగిన వాటిని మరవక తలచి తలచి బాధపదతారు. లోటు లేని జీవితము జరిగిపోతున్నా ఉన్న దానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగము, గృహయోగము, ఆర్థిక యోగము, విదేశీ యాన యోగము కలసి వస్తాయి.

చిత్ర మాలిక

[మార్చు]