ఆశ్లేష నక్షత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నక్షత్రములలో ఇది తొమ్మిదవది.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
శ్లేష బుధుడు రాక్షస పురుష మార్జాలం నాగకేసరం అంత్య చిన్నపక్షి సర్పము కటకము

ఆశ్లేష నక్షత్ర జాతకుల తారా బలాలు

[మార్చు]
తార నామం తారలు ఫలం
జన్మ తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి శరీరశ్రమ
సంపత్తార అశ్విని, మఖ, మూల ధన లాభం
విపత్తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ కార్యహాని
సంపత్తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ క్షేమం
ప్రత్యక్ తార రోహిణి, హస్త, శ్రవణం ప్రయత్న భంగం
సాధన తార మృగశిర, చిత్త, ధనిష్ఠ కార్య సిద్ధి, శుభం
నైత్య తార ఆరుద్ర, స్వాతి, శతభిష బంధనం
మిత్ర తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర సుఖం
అతిమిత్ర తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర సుఖం, లాభం

ఆశ్లేష నక్షత్రమున పుట్టినవారి యొక్క నైజము, తీఱు-తెన్నులు

[మార్చు]

ఆశ్లేష నక్షత్రము యొక్క గణము రాక్షస గణము, అధిదేవత పాము, నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రజాతకులు వివిధరకాల సౌక్యాలు కోరుకుంటారు. ఏదోఒక లాగ తమ తమ కోరికలను తీర్చుకుంటారు. పట్టుదల, పగయును కలిగి ఉంటారు. రాజకీయాల వైపునకు మొగ్గు వీరిలో ఎక్కువఁగా నుండును. స్త్రీల వలన పెద్దల వలన జీవితములో ఇబ్బమ్దులకు గురి ఔతారు. అడ్డంకుల నడుమ వీరి చదువులు కొనసాగుతాయి, ఏది ఏమి అయిన సరే వీరు ఆయా అడ్డగింపులని దాఁటి పై చదువులను చదువుకొనఁగలుగుతారు. వీరి పట్టుదల వీరిని ఊన్నత స్థితికి తీసికొనిపోతుంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు. కష్ట పడి సుఖజీవితాన్ని అలవరచుకున్నా పొరఁపాటు అయిన ఊహల వలన సమస్యలు ఎదురౌతాయి. సంతానపరమ్గా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నమ్మకము లేని వ్యతులతో సహజీవనము సాగిస్తారు. ఉద్యోగములో నిపుణత సాధిస్తారు. వర్గరాజకీయాలను సమర్ధతతో నడపగలరు. యీనియన్లలో ప్రజా జీవితములో మాంచి పేరు వస్తుంది. ఉన్నతాధికారుల వలన, ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు. లక్ష్యసాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. వయసు గదిచే కొద్దీ సుఖమయ జీవితానికి చేరువ ఔతారు. నమ్మకద్రోహులు స్నేహితులుగా ఉండడము దురదృష్టముగా పరిణమిస్తుంది. స్థిరాస్థులు దక్కించుకోగలుగుతారు. ఆయుర్వేద మందులు, బియ్యము, పాల వ్యాపారము, పెట్రోలు బంకులు, బట్టల (జవుళీ) వ్యాపారము లాభిస్తాయి. అర్హులైన వారికి దానము చేస్తారు. గొడవలు తగువులు తగాదాలకు దారి తీసే సంగతుల జోలికి వీరు పోనేపోరు దూరముగా ఉంటారు. ఒడుఁదుడుకులు ఉండకుండ వీరి బ్రతుకు నిలఁకడఁగా ఉంటుది.

బొమ్మల పేర్పు

[మార్చు]