Jump to content

వృషభరాశి

వికీపీడియా నుండి

వృషభరాశి

రాశిగుర్తు చిత్రం


గుర్తు

ఎద్దు

రాశి చక్రంలో సంఖ్య

2

నక్షత్రములు

కృతిక 2,3,4పాదములు,
రోహిణి 4పాదములు,
మృగశిర 1,2 పాదములు

అధిపతి

శుక్రుడు

పూజించవలసిన దేవుడు

సూర్యుడు


అదృష్ట విషయాలు

అదృష్ట రంగు : తెలుపు
సరిపడని రంగు : ఎరుపు
అదృష్ట సంఖ్య : 1
వారం : ఆదివారం

వృషభం అనగా ఎద్దు. వృషభం అనునది రాశి చక్రంలో రెండవ రాశి.. కృత్తికా నక్షత్రంలోని మూడు పాదాలు, రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు, మృగశిరా నక్షత్రంలోని రెండు పాదాలు కలిసి వృషభరాశిగా వ్యవహరిస్తారు. వృషభరాశికి అధిపతి శుక్రుడు. ఇది ఆంగ్ల మాసంలో మే మాసం సగము నుండి జూన్ మాసం సగము భాగం వరకు ఉంటుంది. వృషభ రాశి గురించి మరింత సమాచారం కోసం https://dasamiastro.com/taurus-in-telugu/ ఈ లింక్ ని క్లిక్ చేసి చూడగలరు.

ఈ రాశి వ్యక్తుల లక్షణాలు

[మార్చు]

పురుషులు

[మార్చు]
  • వృషభ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు.
  • అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు.
  • వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్నిఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు.
  • తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదేస్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ రాశి పురుషులు సహనమనే గుణం అలంకారం అని చెప్పవచ్చు.
  • ఈ గుణం వల్ల వీరు ఫలితాలకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు.

స్త్రీలు

[మార్చు]
  • వృషభరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే, ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ, దృఢ సంకల్పం గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు.
  • అనుకున్న పనిని సాధించే వరకూ తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యాలంటే వృషభరాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం.
  • అతిజాగ్రత్త, ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభరాశి స్త్రీ తన భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు దక్కాలని భావాలతోనే తెలియజేస్తుంది.
  • అదే సమయంలో తన భాగస్వామిని అంతే ప్రేమాభిమానాలతో ఆరాధిస్తుంది. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్పుటంగా కనిపిస్తాయి.
  • ఈమెకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు.

వృషభరాశి వారి గుణగణాలు

[మార్చు]

వృషభరాశి వారికి మధ్య వయసు నుండి జీవితము యోగవంతముగా ఉటుంది. ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. శ్రమ పడవలసిన వలసిన సమయములో శ్రమ పడని కారణముగా ఇబ్బమ్దులను ఎదుర్కొంటారు. అందరి మాటలను విని తుదకు తాము అనుకున్నదే చేస్తారు. భాగస్వాములు, మిత్రులు ధైర్యవంతులు, ప్రతిభావంతులు ఉండరు. తాత ముత్తాతలు ప్రతిష్ఠ కల వారుగా ఉంటారు. కుటుంబ ప్రతిష్ఠ విరికి అధికముగా ఉంటుంది. విలునామాలు లాభిస్తాయి. వంసపారపర ఆస్తులు అభివృద్ధి ప్రారంభములో కుంటువడుతుంది. వీరికి వంశ పారంపర్యంగా లభించే అస్తులకన్నా ప్రచారము అధికముగా ఉంటుంది. కచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారము లభిస్తుంది. లెక్కల విషయములో ఎవరికీ మినహాయింపులు ఉండవు. కూతురు విషయములో కొంత వెసులుబాటు ఉంటుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది. మీ ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తారు. సన్నిహితులు సహితము విమర్శిస్తారు. మంచి సలహాదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాలలో వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వముగా భావిస్తారు. విలాసవంతమైన జీవితము గడుపుతారు. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధము ఉండదు. వివాహానంతర జీవితము బాగుంటుంది. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచ లేరు. ఒక్క జ్యేష్ట కుమార్తె విషయములో మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితములో ప్రధాన పాత్ర వహిస్తాయి. వీరి స్వంత మనుషులె విరి విషయాలను భయత పెట్టనంత వరకు విరికి ఇబ్బందులు ఎదురు కావు. మాట సహాయము చేసి ఇబ్బందులను విమర్శలను ఎదుర్కొంటారు. వీరికి శని దశ యోగిస్తుంది.

వృషభరాశి వారి వివరాలు

[మార్చు]
  • గుణము:-శుభరాశి,
  • రాశి:-సమ రాశి, స్త్రీ రాశి అంటారు, ఇది స్థిర రాశి,
  • తత్వము:- తత్వం భూతత్వం,
  • శబ్ధము:-శబ్దం అధికం,
  • సమయము:-సమయం రాత్రి,
  • పరిమానము:- పరి మాణం హస్వ,
  • జీవులు:-జీవులు పశువులు,
  • ఉదయము:- ఉదయం పృష్ట,
  • దిక్కు:- దిశలు దక్షిణ, వ
  • వర్ణము:- వర్ణం శ్వేతం,
  • జాతి:- జాతి బ్రాహ్మణ,
  • అధిపతి:- అధిపతి శుక్రుడు,
  • సంతానము:- సంతానం సమ,
  • అంగం;- కాల పురుషుని అంగము ముఖము.

వనరులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వృషభరాశి&oldid=3890549" నుండి వెలికితీశారు