వర్గం:రాశులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాశులు ఎన్ని?

[మార్చు]

మనం భూమి మీదనుంచి చూసినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమి చుట్టూ దాదాపు వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఈ ఊహాజనిత కక్ష్య వెంబడి పన్నెండు నక్షత్రాల గుంపులను గుర్తించారు. ఈ నక్షత్రాల గుంపులు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన ఆకారంలో కనిపిస్తాయి. ఆ ఆకారాలను బట్టి వాటికి

  1. మేషం,
  2. వృషభం,
  3. మిథునం,
  4. కర్కాటకం,
  5. సింహం,
  6. కన్య,
  7. తుల,
  8. వృశ్చికం,
  9. ధనుస్సు,
  10. మకరం,
  11. కుంభం,
  12. మీనం అని పేర్లు పెట్టారు.

సూర్యుడు ఈ రాశి చక్రాన్ని చుట్టి రావడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది. (నిజానికి ఇది భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం.) అంటే సూర్యుడు ఒక సంవత్సరకాలంలో పన్నెండు రాశుల్ని దాటి మొదటికి వస్తాడన్నమాట. అంటే ఒక్కో నక్షత్ర రాశిలోనూ దాదాపు ఒక్కో నెల ఉంటాడు. ఇది సౌర మానం.

నక్షత్రాలు

[మార్చు]

ఇక చంద్రుడు నెల రోజుల్లోపే (ఇంకా చెప్పాలంటే 27-28 రోజుల్లోనే) రాశి చక్రాన్ని చుట్టి వస్తాడు. ఈ 27 రోజుల స్వల్ప కాలంలో చంద్రుడు ఎప్పుడు ఏ రాశిలో ఉన్నదీ గుర్తించేదెలా? అనేదొక సమస్య. ఈ సమస్యను తీర్చడానికన్నట్లు రాశి చక్రం చుట్టూ తిరిగేటప్పుడు చంద్రుడు ఒక్కో రోజు ఒక్కో నక్షత్రానికి దగ్గరగా వస్తాడు. ఇలాంటి నక్షత్రాలను ఇరవై ఏడింటిని గుర్తించారు. అవి:

  1. అశ్విని
  2. భరణి
  3. కృత్తిక
  4. రోహిణి
  5. మృగశిర
  6. ఆర్ద్ర
  7. పునర్వసు
  8. పుష్యమి
  9. ఆశ్లేష
  10. మఘ
  11. పుబ్బ(పూర్వ ఫల్గుణి)
  12. ఉత్తర(ఉత్తర ఫల్గుణి)
  13. హస్త
  14. చిత్త
  15. స్వాతి
  16. విశాఖ
  17. అనురాధ
  18. జ్యేష్ఠ
  19. మూల
  20. పూర్వాషాఢ
  21. ఉత్తరాషాఢ
  22. శ్రవణం
  23. ధనిష్ఠ
  24. శతభిషం
  25. పూర్వాభాద్ర
  26. ఉత్తరాభాద్ర
  27. రేవతి

చంద్రుడు రాశి చక్రం వెంబడి గల ఈ 27 నక్షత్రాలను ఒక్కసారి చుట్టి వచ్చాడంటే 12 రాశుల రాశి చక్రాన్ని చుట్టి వచ్చినట్లే. ఈ 27 నక్షత్రాల పరిధి 12 రాశులలో పరుచుకుని ఉంటుందన్నమాట. ఒక్కో నక్షత్ర పరిధిని నాలుగు భాగాలు (పాదాలు)గా విభజిస్తే మొత్తం 108 పాదాలవుతాయి. ఈ 108 నక్షత్ర పాదాలు 12 రాశులలో ఉన్నాయని గుర్తుంచుకుంటే ఒక్కో రాశిలో 108/12 = 9 నక్షత్ర పాదాలున్నట్లు సుళువుగా ఊహించవచ్చు. ఆ విభజన ఇలా ఉంటుంది (మొత్తం అంటే '4 పాదాలు' అని అర్థం చేసుకోవాలి):

12 రాశులు

[మార్చు]

మేషం

[మార్చు]

అశ్విని నక్షత్రం మొత్తం, భరణి మొత్తం, కృత్తిక 1వ పాదం ఈ రాశి కిందకు వస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రాశి విరాట్ పురషుని శిరస్సుగా భావించబడుతుంది. అటవీ ప్రాంతాలను సూచిస్తుంది. అలాగే గతిశీల ధోరణి, సంస్థాగత (ఎంటర్ ప్రెన్యూర్) ధోరణి, ధైర్యం, స్పురణ, అసహనం, నాయకత్వం, అహంకారం, పెత్తనం, పొడిబారిన తీరు, సన్నం, పొడువు వంటి లక్షణాలను సూచిస్తుంది. ఈ రాశికి అధిపతి కుజుడు.

వృషభం

[మార్చు]

కృత్తిక 2వ, 3వ, 4వ పాదాలు, రోహిణి మొత్తం, మృగశిర 1వ, 2వ పాదాలు ఈ రాశి కిందకు వస్తాయి. జ్యోతిషం ప్రకారం దీనికి అధిపతి శుక్రుడు. ఈ రాశి ముఖాన్ని సూచిస్తుంది. మైదానాలు, అందం, స్థిరత్వం, నిదానం, విశ్వసనీయం, విలాసం, భోజనం, దట్టమైన జుట్టు, బలిష్ఠం వంటి అంశాలను ఈ రాశి విశదీకరిస్తుంది.

మిథునం

[మార్చు]

మిథన రాశిలోకి మృగశిర 3వ , 4వ పాదాలు, ఆర్ద్ర మొత్తం, పునర్వసు 1వ, 2వ ,3వ పాదాలు వస్తాయి. ఛాతిని, తోటలను సూచిస్తుంది. దీనికి అధిపతి బుధుడు. వాక్కుకు సంబంధించిన విషయాలు, జర్నలిజం, విద్యాశాలలు, తీగలు, కుతూహలం, పాండిత్యం, సరదాతీరు మొదలైనవి మిథున రాశిని బట్టి గ్రహించవచ్చు.

కర్కాటకం

[మార్చు]

పునర్వసు4వ పాదం, పుష్యమి మొత్తం, ఆశ్లేష మొత్తం ఈ రాశి కోవకు వస్తాయి. దీనికి రాజు చంద్రుడు. జలాశయాలు, నదులు, హృదయం, వంట, ఆహారం, సొగసు, ఆకర్షణ, భావోద్రేకం, ఉద్వేగం, సున్నితత్వం, మానసిక సంబంధ విషయాలను కర్కాటక రాశి సూచిస్తుంది.

కన్య

[మార్చు]

ఈ రాశిలో ఉత్తర(ఉత్తర ఫల్గుణి) 2వ,3వ,4వ పాదాలు, హస్త మొత్తం, చిత్త 1వ,2వ పాదాలు ఉంటాయి. దీనికి అధిపతి బుధుడు. తుంటి భాగం, పచ్చిక ప్రదేశాలు, పుస్తకాలు, పొలాలు, మేథస్సు, చురుకుదనం, భయం, ఉపన్యాసం, లోపాయకారితనం, శారీరకదౌర్బల్యం, విచక్షణ వంటి విషయాలను కన్యరాశి సూచిస్తోంది.

చిత్త 3వ,4వ పాదాలు, స్వాతి మొత్తం, విశాఖ 1వ, 2వ, 3వ పాదాలు తులరాశిలోకి వస్తాయి. శరీరంలోని గజ్జ భాగం, విహారవనాలు, వ్యాపారం, బజారు, సంత, బ్యాంకులు, హోటళ్లు, వినోదం, సౌందర్యసాధనాలు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, సమతుల్యత, తెలివి, వాక్చతురత ఈ రాశి సూచించే అంశాలు. దీనికి శుక్రుడు అధిపతి.

వృశ్చికం

[మార్చు]

విశాఖ 4వ పాదం, అనురాధ మొత్తం, జ్యేష్ఠ మొత్తం ఈ రాశికి చెందుతాయి. దీనికి అధిపతి కుజగ్రహం. జననాంగాలు, గుహలు, గనులు, రంధ్రాలు, గ్యారేజిలు, రహస్యకార్యక్రమాలు, వ్యూహరచన, ద్రష్టత్వం, స్నేహ శత్రుత్వాలు, తిక్కదనం, అమర్యాద వంటి వాటిని ఈ రాశి సూచిస్తుంది.

ధనుస్సు

[మార్చు]

ధనూరాశి కిందకు మూల మొత్తం, పూర్వాషాఢ మొత్తం, ఉత్తరాషాఢ 1వ పాదం వస్తాయి. దీనికి అధిపతి గురుగ్రహం. తొడలు, రాజరిక సంబంధ విషయాలు, న్యాయసంబంధి అంశాలు, ప్రభుత్వం కార్యలయాలు, విమానాలు, నిక్కచ్చిదనం, నిజాయితీ, జూదం మొదలైనవి ధనూరాశి లక్షణాలు అని జ్యోతిషశాస్త్రం ప్రవచనం.

మకరం

[మార్చు]

ఉత్తరాషాఢ 2వ,3వ,4వ పాదాలు, శ్రవణం మొత్తం, ధనిష్ఠ 1వ,2వ పాదాలు మకరరాశి నక్షత్రాలు. దీనికి రాజు శనిగ్రహం. మోకాళ్లు, చి్త్తడి నేలలు, పొదలు, హాస్యం, ఓర్పు, పరిపూర్ణత, జాగ్రత్త, కార్యసాధన, ఏర్పాట్లు, దయ్యాలు వగైరాలను ఈ రాశి సూచిస్తుంది.

కుంభం

[మార్చు]

ఈ రాశిలోకి ధనిష్ఠ 3వ,4వ పాదాలు, శతభిషం మొత్తం, పూర్వాభాద్ర 1వ, 2వ, 3వ పాదాలు వస్తాయి. దీనికి కూడా అధిపతి శని గ్రహమే. మడమలు, పర్వతజలాలు, దానధర్మాలు, తత్వం, కృషి, స్థితప్రజ్ఞత వంటి లక్షణాలను కుంభ రాశి సూచిస్తోంది.

మీనం

[మార్చు]

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర మొత్తం, రేవతి మొత్తం మీనరాశికి చెందుతాయి. దీనికి రాజు గురుగ్రహం. పాదాలు, సముద్రాలు, జైళ్లు, ఆసుపత్రులు, మఠాలు,బద్ధకం, సంకుచితత్వం, భావావేశం, నిర్ణయలేమి, మాటకారితనం, స్ఫురణ మొదలైన అంశాలను మీన రాశి సూచిస్తుంది.

ఇది చాంద్ర మానం.

వర్గం "రాశులు" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 14 పేజీలలో కింది 14 పేజీలున్నాయి.