ఉత్తరాషాఢ నక్షత్రము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఉత్తరాషాఢ నక్షత్రము గుణగణాలు[మార్చు]

ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నాసరే పోను పోను బ్రతుకులలో అలాఅలా ఎదుగుకొనుచు పైపైకే పోతారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరిఁకెడి అవకాశాలు వీరికి దక్కుతాయి. వీరు తక్కువఁగా మాట్లాడెదరు, అణకువ కలిఁగి యుండెడి వారు. సొంతవారికి తగినట్లుఁగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసిమెలిసియుండఁదలచుకొనెదరు, క్రొత్త స్నేహములు చేయుట నచ్చుకొనెదరు. కీలక సమయాలలో బాందవ్యానికి విలువ ఇవ్వరు. ఒకా నొకప్పుడు వీరు నేరప్రవృత్తి అయిన నడవడిక కలిగియున్న వారికి అండగా నిలువ వలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం ఔతాయి. ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి, బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి ఔతారు తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు. స్వంతవారిని వీరు ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. నిజం చెప్పేటందుకు సరి అయిన తరుణం వచ్చినా కూడా వీరు పలుమార్లు నిజం చెప్పరు. పై చదువులు వీరికి కలసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిససివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి. తక్కినవారికి వీరు వీలు కలిగిస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులని మంచిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించి పోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. కోవెలలకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, థన సహాయంను చేస్తారు. తెలిసిన వారికి కూడా వీరు అప్పు కూడా ఇవ్వరు. ఆర్ధికపరమైన విషయాలను దాచగలగటంలో వీరు నేర్పరులు.

నక్షత్రములలో ఇది 21వ నక్షత్రము.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు చెట్టు నాడి పిట్ట అధిదేవత రాశి
ఉత్తరాషాఢ రవి మానవ పురుష ముంగిస పనస అంత్య విశ్వేదేవతలు 1, పాదం ధనసు, 2, 3, 4పాదాలు మకరం
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము

ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల నక్షత్రపు ఫలములు[మార్చు]

నక్షత్రపు పేరు నక్షత్రములు ఫలం
పుట్టిన నక్షత్రము కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ ఒంటికి శ్రమ
సంపత్తు నక్షత్రము రోహిణి, హస్త, శ్రవణం డబ్బుల లాభం
ముంపు తెచ్చు నక్షత్రము మృగశిర, చిత్త, ధనిష్ట పనికి చేఁటు
సంపత్తు నక్షత్రములు ఆరుద్ర, స్వాతి, శతభిష బాగు
వేఱైన నక్షత్రములు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర ప్రయత్నము పాడు అగుట
సాధన నక్షత్రములు పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర పని నెఱవేరుట, మంచిది
నైత్య నక్షత్రములు ఆశ్లేష, జ్యేష్ట, రేవతి బంధనం
వీరితో బాగా పడిన నక్షత్రములు అశ్విని, మఖ, మూల హాయి
మిక్కిలి బాగా పడిన నక్షత్రములు భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ హాయి, కలిసి వచ్చును

ఉత్తరాషాఢ నక్షత్రము నవాంశ[మార్చు]

  • 1వ పాదము - ధనస్సు రాశి (ధనుర్రాశి) .
  • 2వ పాదము - మకర రాశి.
  • 3వ పాదము - కుంభ రాశి.
  • 4వ పాదము - మీన రాశి.

బొమ్మల పేర్పు[మార్చు]

తక్కిన ఒనరులు[మార్చు]