ఆరుద్ర నక్షత్రం

ఆరుద్ర హిందూ ఖగోళ శాస్త్రంలో ఆరవ నక్షత్రం. ఇది పరమశివుని జన్మ నక్షత్రం. ఇది ఓరియన్ నక్షత్రరాశిలోని బెటెల్‌జూస్ నక్షత్రానికి అనుగుణంగా ఉంటుంది.[1][2] ఇది 6°-40'-0" నుండి 20°-00' వరకు విస్తరించి, జెమిని నక్షత్రరాశిని కలుపుకుని ఉంటుంది.[3]
జ్యోతిష్యంలో
[మార్చు]ఆరుద్ర నక్షత్రం చంద్రుని ఉత్తర నోడ్ అయిన రాహువు పాలనలో ఉంటుంది. ఇది ఈ నక్షత్ర ప్రభావానికి తీవ్రతనూ, పరివర్తన లక్షణాలనూ ఇస్తుంది. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రుద్రుడు, విధ్వంసక, పునరుత్పత్తి శక్తులకు ప్రసిద్ధి చెందాడు.[4] ఈ నక్షత్రం తామసిక స్వభావం కలది. ఇది సృష్టి లోని చీకటి కోణాలను సూచిస్తుంది.
ప్రతీకలు లక్షణాలు
[మార్చు]ఆరుద్ర నక్షత్రంపు చిహ్నం కన్నీటి చుక్క, ఇది భావోద్వేగపు లోతునూ సున్నితత్వాన్నీ సూచిస్తుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు తరచుగా తీవ్రమైన భావోద్వేగాలకు, లోతైన పరివర్తనలను అనుభవించే సామర్థ్యానికీ గుర్తింపు పొందుతారు. వారికి లోతైన కరుణ, సానుభూతి, అవగాహనను ఉంటుంది. అయితే వారు, మానసిక స్థితి మార్పులకు, భావోద్వేగ గందరగోళానికీ గురయ్యే అవకాశం ఉంది. [5]
| నక్షత్రం | అధిపతి | గణము | జాతి | జంతువు | వృక్షము | నాడి | పక్షి | అధిదేవత | రాశి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| ఆరుద్ర | రాహువు | మానవ | స్త్రీ | శునకము | రేల | ఆదినాడి | పింగళ | రుద్రుడు | మిధునము |
అరుద్ర నక్షత్ర జాతకుల తారా ఫలాలు
[మార్చు]| తార నామం | తారలు | ఫలం |
|---|---|---|
| జన్మ తార | ఆర్ద్ర, స్వాతి, శతభిష | శరీరశ్రమ |
| సంపత్తార | పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర | ధన |
| విపత్తార | పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర | కార్యహాని |
| సంపత్తార | ఆశ్లేష, జ్యేష్ట, రేవతి | క్షేమం |
| ప్రత్యక్ తార | అశ్విని, మఖ, మూల | ప్రయత్న భంగం |
| సాధన తార | భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ | కార్య సిద్ధి, శుభం |
| నైత్య తార | కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ | బంధనం |
| మిత్ర తార | రోహిణి, హస్త, శ్రవణం | సుఖం |
| అతిమిత్ర తార | మృగశిర, చిత్త, ధనిష్ఠ | సుఖం, లాభం |
ఆరుద్ర నక్షత్రము నవాంశ
[మార్చు]- 1 వ పాదము -మిధునరాశి.
- 2 వ పాదము - మిధునరాశి.
- 3 వ పాదము - మిధునరాశి.
- 4 వ పాదము - మిధునరాశి.
ఆరుద్ర నక్షత్రమునందు పుట్టిన వారి నైజము,తీఱు-తెన్నులు
[మార్చు]ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేఱ్పరితనమును, మించిన జ్ఞాపక శక్తియు కలిఁగియుండెదరు, గొప్ప గమ్మత్తుఁగా మాట్లాడఁగలరు. వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బులకు చెందునట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనెడి కోరిక, మొండి పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు దారి తీయ వచ్చును. తొందఱపాటుతో ముందు-వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంతనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొన లేరు. లౌక్యము తెలివితేఁటలు కనబఱఁచుతారు. తల్లిఁదండ్రులు, తోడఁబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిఁగియుంటారు. రాత్రి పూఁట నిర్ణయాలు తీసుకుంటారు. మొదట తనలోతాను అందఱిలో తక్కువ అని పదేపదే అనుకొనవలసి వచ్చిన కూడను ఆ తరువాత అధిక్యతా భావములోకి మారి పోతారు. నిండు నూఱేండ్లు బ్రతికెదరు సంపూర్ణ ఆయుర్ధాయము కలిగి ఉంటారు. ఆడవారిపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనఁగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మఱల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.
బొమ్మల పేర్పు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Ardra (आर्द्रा)". All Skies Encyclopaedia. IAU Working Group on Star Names. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 December 2025.
- ↑ "Indian Names (All Terms)". All Skies Encyclopaedia. IAU Working Group on Star Names. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 December 2025.
- ↑ "Ardra Nakshatra". Astrosapient. 28 May 2023. ఒరిజినల్ నుండి July 1, 2023 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ "Ardra Nakshatra". Thenakshatras.
- ↑ "Ardra Nakshatra". Futurescopeastrology.