ధనసు లగ్నము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధనుర్లగ్నం[మార్చు]

ధనుర్లగ్న జాతకులు మానవత కలిగి ఉంటారు. నిరాడంబరత, దయాగుఇణం కలిగి ఉంటారు. ఈశ్వరభక్తి కలిగిన భాగ్యవంతులుగా ఉంటారు. ధనుర్లగ్నానికి కుజుడు శుభగ్రహంగా ఉంటాడు.

  • సూర్యుడు :- ధనుర్లగ్నానికి సూర్యుడు భాగ్యాధి పతిగా శుభ ఫలితాన్ని ఇస్తాడు.ధనుర్లగ్నంలో ఉన్న సూర్యుడు వ్యక్తికి అందం, ఆరోగ్యం, ఆత్మ విశ్వాసం, ఆత్మబలం, జ్ఞానం ఇస్తాడు. ఆకర్షణీయమైన మాటలతో ఎదుటి వారిని ప్రభావితులను చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు రెండూ వీరికి అనుకూల ఫలితాన్ని ఇచ్చినా ఉద్యోగంలో అధిక సఫలత సాధిస్తారు. లేఖనం, పఠనం మూలంగా జనప్రియులౌతారు. చిత్రకళ, శిల్ప కళ అందు అభిరుచి కలిగి ఉంటారు. లగ్నస్థ సూర్యుడు పూర్ణ దృష్టితో బుధుడి స్థానమైన మిధునం మీద దృష్టి సారిస్తాడు కనుక ధనం, ప్రఖ్యాతి, మిత్రుల నుండి సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. భాగ్యాధి పతి సూర్యుడు లగ్నస్థుడవటం కారణంగా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు లాభిస్తాయి. జీవితభాగస్వామి నుండి, సంతానం నుండి సుఖం లభిస్తుంది.
  • చంద్రుడు :- ధనుర్లగ్నస్థ చంద్రుడు అష్టమాధిపతి అయినా అనూకల ఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో ఉన్న చంద్రుని వలన మనసు అస్థిరంగా ఉంటుంది. లగ్నస్థ చంద్రుడి కారణంగా అరోగ్య సమస్యలను ఎదుర్కొంటాడు. ప్రాణాలు, జలక్షేత్రములు, ప్రకృతి దృశ్యముల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. అనుసంధానం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు.

కళారంగం, లేఖనం పట్ల అభిరుచి కలిగి ఉంటారు. కళారంగంలో వీరికి సఫలత లభిస్తుంది. ధనుర్లగ్నస్థ చంద్రుడి దృష్టి మిత్ర రాశి అయిన మిధునం మీద పడుతున్న కారణంగా జీవితభాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. సంతాన సుఖం ఆలస్యంగా కలుగుతుంది.

  • కుజుడు :- ధనుర్లగ్నానికి పంచమాధిపతిగా, వ్యయాధిపతిగా ఉండి శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో కుజుడున్న కారణంగా చక్కగా పరిశ్రమించి ధనార్జన చేస్తాడు. ధునుస్సు రాశిలో ఉన్న కుజుడు చదువు కొనసాగించుటలో అవరోధాన్ని కలిగిస్తాడు. లగ్నస్థ కుజుడు చతుర్ధ, సప్తమ, అష్టమ స్థానాల మీద దృష్టి సారించడం వలన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురౌతాయి. చిన్న చిన్న వివాదములు తలెత్తుతాయి.
  • ధనుర్లగ్నానికి బుధుడు సప్తమ, దశమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. రెండు కేంద్రములకు ఆధిపత్యం వహించి బుధుడు ధనుర్లగ్నానికి అకారక గ్రహం ఔతాడు. అయినా లగ్నస్థ బుధుడు వ్యక్తికి రోగములు లేని అందమైన శరీరాన్ని ఇస్తాడు. తల్లి తండ్రుల నుండి స్నేహ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగం నుండి లాభం, గౌరవం కలుగుతాయి. లగ్నం నుండి బుధుడు స్వస్థానమైన మిధున రాశి మీద దృష్టిని సారిస్తాడు కనుక సహాయ సహకారాలు అందించే అందమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. మిత్రుల నుండి భాగస్వాముల నుండి సహాయ సహకారలు కలుగుతుంది వ్యాపారం అనుకూలిస్తుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది.
  • గురువు :- ధనుర్లగ్నంలో లగ్నాధిపతిగా, చతుర్ధ స్థానాధిపతిగా గురువు శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ గురువు అందమైన ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇస్తాడు. పేరు, ప్రతిష్ఠ, సమాజంలో గౌరవం, బుద్ధి, జ్ఞానం కలిగి ఉంటారు. భూమి, భవనం, వాహన సౌఖ్యం పొందగలరు. లగ్నస్థ గురువు పంచమ రాశి మిత్ర రాశి అయిన మేషరాశి మీద, సప్తమ రాశి సమరాశి అయిన మిధునం మీద, నవమ భావం మిత్రరాశి అయిన సింహం మీద దృష్టి సారిస్తాడు కనుక సాహసము, దయాహృదయం కలిగి ఉంటాడు. జీవితభాగస్వామి నుండి సహాయ సహకారం ఉంటాయి. సంతానం నుండి సుఖం కలుగుతుంది. జీవితం ఐశ్వర్యం, సుఖంతో కూడిన పరి పూర్ణ జీవితం అనుభవిస్తాడు. వ్యాపార ఉద్యోగాలు ఫలలతనిస్తాయి. శత్రుభయం ఉన్నా వీరికి వారి నుండి ఆపద కలుగదు.
  • శ్శుక్రుడు :- ధనుర్లగ్నానికి ఆరవ, పదకొండవ స్థానాధిపతి అయిన శుక్రుడు అకారక గ్రహంగా అశుభాన్ని ఇస్తాడు. లగ్నంలో ఉన్న శుక్రుడు అందమైన శరీరాన్ని ప్రసాదించినా శుక్రుడు రోగస్థానాధిపతి కనుక లగ్నంలో ఉండి ఆరోగ్య సమస్యలను ఇస్తాడు. ధనుర్లగ్నానికి ఏకాదశాధిపతి అయిన శుక్రుడు లాభమును కూడా ప్రసాదిస్తాడు.

శుక్రుడి ప్రభావం వలన ప్రభుత్వోద్యోగావకాశాలు ఎక్కువ. సంగీతం, కళల అందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. లగ్నస్థ శుక్రుడు మిత్ర రాశియిన సప్తమ రాశి మీద సంపూర్ణ దృష్టిని ప్రసరిస్తాడు కనుక జీవిత భాగస్వామి అందంగా ఉండి సహాయసకారాలు అందిస్తారు. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది.

  • శని :- ధనుర్లగ్నానికి శని ద్వితీయ, తృతీయ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు కనుక వ్యక్తి సన్నంగా ఉంటాడు. శని ప్రభావం వీరికి నేత్ర రోగం ఇస్తుంది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేక ఇతరుల మీద ఆధారపడతారు. ఇతరుల సహకారం అధికంగా ఆశిస్తారు. ధనాన్ని భద్రపరిచే గుణం వీరికి అధికంగా ఉంటుది. షేర్లు, పందాలు, లాటరీలు వీరికి లాభిస్తాయి. లగ్నస్థ శని లగ్నం నుడీ తృతీయ రాశి అయిన కుంభం, సప్తమ రాశి మిత్ర రాశి అయిన మిదునం, దశమరాశి అయిన కన్య మీద శుభదృష్టిని ప్రసరిస్తాడు కనుక సోదరుల నుండి మిత్రుల నుండి భాగస్వాముల నుండి సహాయ సహకారాలు లభించవు. వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురౌతాయి.
  • రాహువు :- ధనుర్లగ్నస్థ రాహువు వలన పొడవైన ఆరోగ్యవంతమైన శరీరం లభిస్తుంది. అన్ని పనులను చేపట్టు నైపుణ్యం కలిగి ఉంటారు. స్వహితము వీరి సిద్ధాంతం. రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానమైన రాహువును చూస్తున్నాడు కనుక వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి సహాయసహకారాలు లభించడం కష్టం.
  • ధనుర్లగ్నస్థ కేతువు కారణంగా వ్యక్తికి ఆరోగ్య సమస్యలు తలెత్తగలవు. నడుము నొప్పి మొదలైన శరీర భాగాలు బాధింపుకు గురి ఔతాయి. ఆత్మ విశ్వాసం లేని కారణంగా మహత్వపూరిత నిర్ణయాలు సాధ్యం కాదు.

బయటి లింకులు[మార్చు]