ఉత్తరాభాద్ర నక్షత్రము
ఉత్తరాభద్రానక్షత్రం గుణగణాలు[మార్చు]
ఉత్తరాభద్ర నక్షత్ర అధిపతి శని, రాశ్యధిపతి గురువు, మానవగణం, జంతువు ఆవు. ఈ నక్షత్ర జాతకులు వినయవిధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు. గొప్పలు చెప్పుకోరు. ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. భూమి వాహనముల మీద అధికారం కలిగి ఉంటారు. కుటుంబ చరిత్ర తండ్రి వలన మేలు జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్ఫూర్తి కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్ఫూర్తి కలిగి ఉంటారు. జీవితం సాఫీగా జరిగి పోతుంది. ముప్పై నుండి నలభై సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఇది నక్షత్ర జాతకులు అందరికీ సామాన్య ఫలితాలు. జాతక చక్రములో గ్రహస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు చేర్పులు ఉంటాయి.
నక్షత్ర వివరాలు[మార్చు]
నక్షత్రములలో ఇది 26వ నక్షత్రం.
నక్షత్రం | అధిపతి | గణము | జాతి | జంతువు | వృక్షము | నాడి | పక్షి | అధిదేవత | రాశి |
---|---|---|---|---|---|---|---|---|---|
ఉత్తరాభద్ర | శని | మానవ | అబ్బాయి | గోవు | వేప | మధ్య | అహిర్బుధ్నుడు | మీనం |
నక్షత్రం/వివరం | ప్రత్యేక వివరం |
---|---|
నక్షత్ర అధిపతి | |
గణము | |
జాతి | |
జంతువు | |
పక్షి | |
వృక్షం | |
రాశి | |
అధిదేవత | |
నాడి |
ఉత్తరాభద్రా నక్షత్ర జాతకుల తారా ఫలాలు[మార్చు]
తార నామం | తారలు | ఫలం |
---|---|---|
జన్మ తార | పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర | శరీరశ్రమ |
సంపత్తార | ఆశ్లేష, జ్యేష్ట, రేవతి | ధన లాభం |
విపత్తార | అశ్విని, మఖ, మూల | కార్యహాని |
సంపత్తార | భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ | క్షేమం |
ప్రత్యక్ తార | కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ | ప్రయత్న భంగం |
సాధన తార | రోహిణి, హస్త, శ్రవణం | కార్య సిద్ధి, శుభం |
నైత్య తార | మృగశిర, చిత్త, ధనిష్ఠ | బంధనం |
మిత్ర తార | ఆరుద్ర, స్వాతి, శతభిష | సుఖం |
అతిమిత్ర తార | పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర | సుఖం, లాభం |
ఉత్తరాభద్రానక్షత్రము నవ్వాంశ[మార్చు]
- 1వ పాదము - సింహరాశి.
- 2వ పాదము - కన్యారాశి.
- 3వ పాదము - తులారాశి.
- 4వ పాదము - వృశ్చికరాశి.
చిత్ర మాలిక[మార్చు]
-
ఉత్తరాబాధ్ర నక్షత్ర వృక్షము
-
ఉత్తరాభద్ర జంతువు ఆవు.
-
ఉత్తరాభద్రా నక్షత్రజాతి స్త్రీ
-
ఉత్తరాబాధ్ర నక్షత్ర పక్షి నెమలి.
-
ఉత్తరాబాధ్ర నక్షత్ర అధిపతి శని.
-
ఉత్తరాబాధ్ర నక్షత్ర అధిదేవత
-
ఉత్తరాబాధ్ర నక్షత్ర గణము మానవగణము.