Jump to content

సింహ లగ్నము

వికీపీడియా నుండి

సింహ లగ్నం

[మార్చు]
  • సూర్యుడు :- సింహలగ్నంలో సూర్యుడు లగ్నాధిపత్యం వహిస్తూ కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. సింహగ్నంలో సూర్యుడున్న స్వత్షానమున ఉన్న కారణంగా వ్కక్తికి ఆత్మవిశ్వాసం, పరిపూర్ణత కలిగించును. సింహ లగ్నస్థ సూర్యుని కారణంగాగా వ్యక్తి విద్యాంసుడిగా, గుణవంతుడికా ఉంటాడు. వీరి కార్యశూరత ప్రతిభ కారణంగా సన్మానాలను అందుకుంటారు.

వీరు ఏకార్యమైనా మనస్ఫూర్తిగా చేపడతారు. త్వరిత గతి మార్పులకు వీరు వ్యతిరేకులు. పరాక్రమం, ఉదారస్వభావం వీరి సొత్తు. ఇతరులకు సహకరించే గుణం, పరాక్రమం కలిగి ఉంటారు. లగ్నస్థ సూర్యుడు సప్తమ స్థానం అయిన శత్రస్థానం కుంభం మీద దృష్టిని సారిస్తాడు కనుక వైవాహిక జీవితం శాంతి మయం ఔతుంది. మిత్రుల నుండి భాగస్వాముల నుండి సహాయ సహకారం లభించదు.

  • చంద్రుడు :- సింహలగ్నానికి చంద్రుడు వ్యయస్థానాఢిపతిగా అకారక గ్రహమై అశుభఫలితం ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అథిర మనస్థత్వాన్ని, నిలకడ లేని జీవితాన్ని ఇస్తాడు. నిస్వార్ధంగా ఇతరులకు సహకరిస్తారు. స్వభావికంగా వీరు మంచి వారు. వీరికి తల్లి తండ్రుల నుండి సహాయ సహారాలు అందుతాయి. రాజకీయాలలో సఫలత సాధిస్తారు. చంద్రుడు లగ్నస్థంలో ఉండి సప్తమ స్థానం అయిన కుంభం మీద దృష్టి సారిస్తాడు కనుక వైవాహిక జీవితంలో ఒడి దుడుకులు ఉంటాయి. చంద్రుడికి పాపగ్రహ చేరిక, దృష్టి ఉన్న శుభఫలితాలు తగ్గుతాయి.
  • కుజుడు :- సింహలగ్నానికి కుజుడు చతుర్ధాధిపతి, నవమభావాలకు ఆధిపత్యం వహిస్తాడు కనుక కారక గ్రహమై శుభఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ కుజుడు పరి పూర్ణ ఆత్మవిశ్వాసం, సాహసం, నిర్భయత్వం ఇస్తాడు. వీరికి అనేక విధముల ధనాగమనం ఉంటుంది. లగ్నస్థ కుజుడు చతుర్ధ స్థానమైన శుక్రుడు, సప్తమ అష్టమ, స్థానములైన శని,

మీద దృష్టి సారిస్తాడు. కనుక తల్లితో విభేదాలు, జీవితభ్గస్వామితో అభిప్రాయబేధాలు ఉంటాయి. మిత్రుల, భాస్వాముల సహాయసహకారాలు లోపిస్తాయి. శత్రు పీడ ఉంటుంది.

  • సింహ లగ్నస్థ బుధుడు ద్వితీయ, ఏకాదశ స్థానాధిపత్యం వహిస్తాడు కనుక ఈ లగ్ననముకు బుధుడు ధన కారకుడు. లగ్నస్థ బుధుడు అధిక ధనాదాయాన్ని ఇస్తాడు.

వీరికి కళ్;ఆరంగ సంబంధములు ఉంటాయి. వీరికి శత్రుభయం అధికం. బుధుడు పూర్ణ దృష్టిని సప్తమ స్థానం మిత్ర స్థానం అయిన కుంభం మీద దృష్టి సారిస్తాడు కనుక వీరికి జీవిత భాగస్వామి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి. కాని జీవితభాగస్వామి సహాయసహకారాలు వీరికి అందదు. సంతాన సుఖం వీరికి తక్కువ. బుధుడు పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న అశుభ ఫలితాలను ఇస్తాడు. భాగస్వామ్యం వీరికి కలసి రాదు.

  • సింహ లగ్నానికి గురువు పంచమ, అష్టమాధిపధిపత్యం వహిస్తాడు. త్రికోణాధిపత్యం కారణంగా గురువు కారక గ్రహమై శుభఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ గురువు అందమైన, ఆకర్షణీయమైన శరీరాన్ని ఇస్తాడు. బుద్ధి కుశలత, జ్ఞానం, వీరి సొత్తు. ధనం బధ్రపరచు గుణం, దయాస్వభావం కలిగి ఉంటారు. ధనం బధ్రపరచు గుణం కలిగి ఉంటారు. బుద్ధికుశలత, జ్ఞానం వీరిని ఉన్నత పదవులను అధిరోహింప చేస్తుంది. ఉద్యోగవ్యాపారాలు రెండింటిలో వీరికి సాఫల్యత లభిస్తుంది. సంఘములో గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. గురువు సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుండి, పంచమ దృష్టి కారణంగా పుత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మిత్రుల, భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. అదృష్టం వీరిని వెన్నంటి ఉంటుంది.
  • శుక్రుడు :- శుక్రుడు సింహ లగ్నానికి తృతీయ, దశమాధిపతి ఔతాడు. సింహలగ్న సుక్రుడికి కేంద్రాధిపత్య దోషం ఉంటుంది. లగ్నస్స్థ శుక్రుడి కారణంగా అందమైన శరీరం కలిగి ఉంటారు. వీరికి భౌతిక సుఖముల మీద ఆసక్తి అధికం. మెట్టింటి నుండి సమయానుకూల సహాయం లభిస్తుంది. పూర్ణ దృష్టితో శుక్రుడు సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక ధనమును అనవసరంగా అదుపు లేకుండా వ్యయం చేస్తారు. వివాహేతర సంబంధాలకు ధనవ్యయం చేస్తారు. సప్మమ భావంలో ఉన్న శుభగ్రహం శుభుల చేరిక సంబంధాలు కల్గి ఉన్న జీవిత బాగస్వామికి విశ్వాసపాత్రులుగా ఉంటారు.
  • శని :- సింహ లగ్నానికి శని ష్టమ, సప్తమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. సింహ లగ్నస్థ శని అకారక గ్రహంగా అశుభ ఫలితం ఇస్తుంది. సింహ లగ్నస్థ శని వ్యక్తిని సమాజ విరోధ కార్యాలకు ప్రోత్సహిస్తుంది. లగ్నస్థ శని వీరికి అపకీర్తిని, కపట స్వభావాన్ని కలిగిస్తుంది. లగ్నస్థ శని తృతీయ దృష్టి కారణంగా కనిష్ఠ సోదరుల సహకారం అందదు. సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి నుండి కష్టములు ప్రాప్తిస్తాయి. వీరి కపట వృత్తి కారణంగా మిత్రుల నుండి సహకారం అందదు. వీరికి పేరాశ అధికం. లగ్నస్థ శని శుభ గ్రహ చేరిక శుభగ్రహ దృష్టి కలిగి ఉన్న అశుభ ఫలితాలు తగ్గవచ్చు.
  • రాహువు :- సింహ లగ్నస్థ రాహువు అశుభఫలితాలు ఇస్తాడు. లగ్నస్థ రాహువు వీరికి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని క్షీణింపచేస్తుంది. ఆ కారణంగా స్వయం నిర్ణయం చేసుకునే శక్తి లోపిస్తుంది. వీరు సంఘంలో గౌరవ మర్యాదలను కాపాడు కోవడానికి శ్రమించవలసి వస్తుంది. వీరికి మంత్ర తంత్రములు గుప్త విద్యల అందు ఆసక్తి అధికం.

లగ్నస్థ రాహువు వలన వీరికి రాజనీతి అందు ప్రావీణ్యం కలిగి ఉంటారు. రాహువు సప్తమ దృష్టి కారణంగా మిత్రుల నుండి భాస్వాముల నుండి విశేష సహాయ సహకారం లభించదు. వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు.

  • కేతువు :- సాత్రురాశి అయిన సింహరాశిలో ఉన్న కేతువు అశుభ ఫలితాలను ఇస్తాడు. లసింహ లగ్నస్థ కేతువు అనారోగ్యం కలిగిస్తాడు. కేతు దశాకాలంలో వీరికి ఆరోగ్య సమస్యలు తలెత్త గలవు. వీరికి తల్లి తండ్రుల మీద అధికమైన ప్రేమాభిమానాలు ఉండవు. ఎల్ల వేళలా మానసిక చింత వీరిని బాధిస్తుంది. సప్తమ భావం మీద కేతువు దృష్టి

కారణంగా వైవాహిక జీవితంలో ఓడిదుడుకులు ఉంటాయి. జీవిత భాస్వామి అనారోగ్యానికి గురి కాగలరు.

ఇతరవనరులు

[మార్చు]