నీలకంఠ సోమయాజి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీలకంఠ సోమయాజి
జననం1444 CE
మరణం1544 CE
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుKelallur Comatiri
వృత్తిAstronomer-mathematician
సుపరిచితుడు/
సుపరిచితురాలు
Authorship of Tantrasamgraha
గుర్తించదగిన సేవలు
Golasara, Candrachayaganita, Aryabhatiya-bhashya, Tantrasamgraha
బిరుదుసోమయాజి
జీవిత భాగస్వామిఆర్య
పిల్లలురామ, దక్షిణామూర్తిRama, Dakshinamurti
తల్లిదండ్రులుజాతవెదన్(తండ్రి)

నీలకంఠ సోమయాజి (Sanskrit: नीलकण्ठ सोमयाजि) (1444–1544) గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఈయన కేరళ పాఠశాల యొక్క గణిత శాస్త్రవేత్త. ఈయన అత్యంత ప్రభావవంతమైన రచనల్లో సమగ్ర ఖగోళ గ్రంథము తరణ సంగ్రహ 1501 లో పూర్తి అయింది. ఈయన "ఆర్యభట్టియా గ్రంథం"కు విస్తృతమైన వ్యాఖ్యానం సమకూర్చాడు. దీనిని "ఆర్యభట్టియ గ్రంథం భాష్యము అని అంటారు. ఈ భాష్యము లో నీలకంఠ సోమయాజి "అనంత శ్రేణి", త్రికోణమితీయ ప్రమేయాలు, బీజగణితం సమస్యలు, గోళాకార జ్యామితి పై చర్చలు జరిపారు. "గ్రహపరీక్షక్రమ" సాధన ఆధారంగా ఖగోళశాస్త్రంలో పరిశీలనలు తయారు చేయడానికి ఒక పుస్తకం.

జీవిత చరిత్ర వివరాలు

[మార్చు]

నీలకంఠ సోమయాజి తన సొంత జీవితం గురించి వివరాలు రికార్డ్ చేయడానికి భారతదేశం యొక్క పరిశోధక సంప్రదాయాల గూర్చి ఆలోచన చేసిన కొందరు రచయితలలో ఒకరు. అందువల్ల అదృష్టవశాత్తూ ఆయన గురించి కొన్ని కచ్చితమైన వివరముల తెలిసినవి.[1][2]

ఆయన రచనలలో "సిద్ధాంతం-నక్షత్రం" పేరుతో ఒకటి, "సిద్ధాంతం-దర్పణం" కూడా తన స్వంత వ్యాఖ్యానంలో ముఖ్యమైనవి. నీలకంఠ సోమయాజి తాను సా.శ. 1444 జూన్ 14 న అనగా కలియుగంలో 1,660,181 వ రోజున జన్మించినట్లు పేర్కొన్నాడు. ఆయన సమకాలీనుల సూచనల ప్రకారం నీలకంఠ సోమయాజి యొక్క మలయాళంలో వ్రాసిన జ్యోతిషశాస్త్రం ముఖ్యమైన రచన. దీనిని బట్టి సోమయాజి వంద సంవత్సరములు జీవించియున్నట్లు తెలియుచున్నది. నీలకంఠ సోమయాజి యొక్క విద్యార్థి అయిన "శంకర వారియర్" తన రచన యైన "తరణసంగ్రహ"లో తన వ్యాఖ్య (తరనసంగ్రహ వ్యాఖ్య") లో తరణ సంగ్రహలో మొదటి చివరి శ్లోకాలలో క్రోనోగ్రామ్స్ ఉన్నట్లు తెలిపాడు. వీటిలో కలియుగంలో (1,680,548), (1,680,553) పూర్తి యొక్క వివరాలు తరణ సంగ్రహలో ఉన్నాయి. దీనిని బట్టి యిది సా.శ. 1500 లో జరిగినట్లు తెలియుచున్నది.

ఆర్యభట్టీయ గ్రంథం భాష్యంలో నీలకంఠ సోమయాజి తాను జాతవేదాస్ యొక్క కుమారుడని పేర్కొన్నాడు, ఆయన సోదరుడు శంకర అని తెలిపాడు. సోమయాజి తాను "గార్గేయ గోత్రం" నకు చెందిన భట్ట అని, ఋగ్వేదంలో అశ్వలాయన సూత్రం యొక్క అనుచరుడని పేర్కొన్నాడు. ఆయన వ్రాసిన "లఘు రామాయణ" ప్రకారం ఆయన కుందగ్రామంలో కెలల్లూర్ కుటుంబానికి చెందిన సభ్యుడని తెలిపారు. అతని భార్య పేరు ఆర్య అనీ, అతను ఇద్దరు కుమారులు రామ, దక్షిణామూర్తి అనీ పేర్కొన్నాడు.

ఈయన "వేదాంత" పై అధ్యయనం చేశాడు, రవి క్రింద ఖగోళశాస్త్రం పై కొన్ని అంశాలలో పరిశోధనలు చేశాడు. అయితే గణిత శాస్త్రవేత్త "పరమేశ్వరుడు" యొక్క కుమారుడు, ఖగోళశాస్త్రం, గణిత గణనలు, ప్రాథమిక సూత్రాలు ప్రవచించినవాడు అయిన "దామోదర" యొక్క అద్వర్యంలో పరిశోధనలు జరిగాయి. మలయాళ కవి "తుంచత్తు రామానుజన్ ఎజ్‌హుథచాన్" ఈయన యొక్క విద్యార్థి అని చెబుతారు. సోమయాజి అనే పేరు వేద సంప్రదాయం ప్రకారం నిర్వహింపబడుతున్న సోమయజ్ఞం నిర్వహించే "నంపురిటి"ని మారుపేరుతో పిలుస్తారు.[3] నీలకంఠ సోమయాజి కూడా వైదిక సాంప్రదాయం ప్రకారం నిర్వహింపబడే సోమయజ్ఞాన్ని నిర్వహించారు. దీనిని నిర్బహింపబడుట వలన తర్వాతి కాలంలో సోమయాజి అయ్యారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి

[మార్చు]

నీలకంఠ సోమయాజి యొక్క రచనలు భారతీయ తత్వశాస్త్రంలో , సంస్కృతి యొక్క అనేక శాఖలలో శక్తివంతమైనవి.ఆయన రచనలలో మీమాంస అధికారం, పింగళ యొక్క చంద్ర సూత్ర నుండి విస్తృతంగా వ్యాఖ్యానాలు, ధర్మ సూత్రాలు, భగవత , విష్ణుపురాణం ముఖ్యమైనవి.ఒక సమకాలీన తమిళ ఖగోళ శాస్త్రవేత్త అయిన "సుందరరాజ" తెలిపిన ప్రకారం భారతీయ తత్వశాస్త్రంలో ఆరు వ్యవస్థలు నిర్వహించే వ్యక్తి నీలకంఠ సోమయాజి అని తెలియుచున్నది..[1]

ఖగోళ శాస్త్రం

[మార్చు]
హార్మోనియా మాక్రోకాస్మికా అనే గ్రంథంలో ఆండ్రియాస్ సెలారియస్ ఊహించి చిత్రించిన కోపర్నికస్ వ్యవస్థ

తాను వ్రాసిన "తరణ సంగ్రహ"లో నీలకంఠ సోమయాజి ఆర్యభట్ట యొక్క "బుధుడు", "శుక్రుడు" యొక్క గ్రహ నమూనాలను తిరిగి పరిశీలించాడు. 17 వ శతాబ్దంలో కెప్లర్ యొక్క గ్రహనియమాలు ప్రతిపాదించక పూర్వమే సోమయాజి గ్రహాల యొక్క కేంద్రము గూర్చి కచ్చితమైన సమీకరణాలను ప్రతిపాదించాడు.[4] ఆర్యభట్టు ప్రతిపాదించిన ఆర్యభట్టీయం యొక్క వ్యాఖ్యానాన్ని "ఆర్యభట్టీయ భాష్యం"లో వ్రాసాడు. యిందులో యీయన సూర్యకేంద్రక సిద్ధాంతం యొక్క గణనలను అభివృద్ధి చేశాడు. ఆయన బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, అంర్యు శని గ్రహాలు సూర్యుని చుట్టూ కక్ష్యలలో తిరుగు తున్నట్లు వ్రాశాడు. 16 వ శతాబ్దంలో "టైకోబాహ్రీ" తెలిపిన "టైకోనిక్ వ్యవస్థ" ప్రకారం యీయన రూపొంచించిన సిద్ధాంతం ఒకేరీతిగా యున్నది.అనేక మంది కేరళీయులు సూర్యకేంద్రక సిద్ధాంతాన్నే ఆమోదించారు.[4][5]

పనులు

[మార్చు]

కింది ఖగోళ, గణిత శాస్త్ర విషయాలలో నీలకంఠ సోమయాజి యొక్క రచనల గూర్చి ఒక సంక్షిప్త వర్ణన ఉంది [1][6]

 1. తరణ సంగ్రహ
 2. గోలసార : ప్రాథమిక ఖగోళ అంశాలను, విధానాలు వివరణ
 3. సిద్ధాంతదర్పణ : 32 శ్లోకాలలో ఖగోళ స్థిరాంకాల గూర్చి వ్రాయబడిన గ్రంథం.
 4. చంద్రఛాయ గణిత : 32 శ్లోకాలతో చంద్రుడు యొక్క నీడల కొలతకు సంబంధించిన పద్ధతులను వివరించే గ్రంథం.
 5. ఆర్య భట్టీయ భాష్య :ఆర్యభట్టియా గ్రంథం న విస్తృతమైన వ్యాఖ్యానం.
 6. సిద్ధాంత దర్పణ వ్యాఖ్య: తాను వ్రాసిన సిద్ధాంత దర్పణ గ్రంథానికి వ్యాఖ్యానం.
 7. చంద్రఛాయాగణిత వ్యాఖ్య: తాను వ్రాసిన చంద్రఛాయాగణిత వ్యాఖ్యానం.
 8. సుందరాజ - ప్రశ్నోత్తర : తమిళనాడు లోని ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త "సుందరరాజ"అడిగిన ప్రశ్నలకు ఆయన వ్రాసిన జవాబులు.
 9. గ్రహనది - గ్రంథం : పరిశీలనల ద్వారా పాత ఖగోళ స్థిరాంకాలు సరిచేసిన ఆవశ్యకతా కారణ వివరణం.
 10. గ్రహపరీక్షాక్రమ : సాధారణ పరిశీలనల ద్వారా ఖగోళ గణనలు వెరిఫై కోసం సూత్రాలు, పద్ధతులను వివరణ.
 11. జ్యోతిర్మీమాంస : ఖగోళ శాస్త్ర విశ్లేషణ

యివి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 1.2 Sarma, K.V (ed.). "Tantrasamgraha with English translation" (PDF) (in Sanskrit and English). Indian National Academy of Science. p. 48. Archived from the original (PDF) on 9 మార్చి 2012. Retrieved 17 January 2010.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
 2. Tantrasamgraha, ed. K.V. Sarma, trans. V. S. Narasimhan in the Indian Journal of History of Science, issue starting Vol. 33, No. 1 of March 1998
 3. P. Vinod Bhattathiripad; K.D. Nambudripad (3 May 2007). "Yaagam (Yajnam)". Namboothiri Websites Trust. Retrieved 4 February 2010.
 4. 4.0 4.1 George G. Joseph (2000). The Crest of the Peacock: Non-European Roots of Mathematics, p. 408. Princeton University Press.
 5. K. Ramasubramanian, M. D. Srinivas, M. S. Sriram (1994). "Modification of the earlier Indian planetary theory by the Kerala astronomers (c. 1500 AD) and the implied heliocentric picture of planetary motion Archived 2010-12-23 at the Wayback Machine", Current Science 66, p. 784-790.
 6. A.K. Bag (1980). "Indian literature on mathematics during 1400 - 1800 AD" (PDF). Indian Journal of History of Science. 15 (1): 79–93. Archived from the original (PDF) on 9 మార్చి 2012. Retrieved 30 January 2010.

ఇతర పఠనాలు

[మార్చు]