జ్యేష్టదేవుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జ్యేష్టదేవుడు
జననం
జ్యేష్టదేవుడు

c.1500 CE
మరణంc.1610 CE
జాతీయతభారతీయుడు
వృత్తిఖగోళ శాస్త్రవేత్త - గణిత శాస్త్రవేత్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
యుక్తిభాస గ్రంథ రచయిత.
గుర్తించదగిన సేవలు
యుక్తిభాస, Drkkarana
బంధువులుపారన్‌గొట్టు కుటుంబం

జ్యేష్టదేవుడు (మలయాళం: ജ്യേഷ്ഠദേവന്‍) (c. 1500 – c. 1610) [1] సంగమగ్రామ మాధవ (c.1350 – c.1425) స్థాపించిన "కేరళ గణిత, ఖగోళ శాస్త్ర పాఠశాల"లో ఖగోళ, గణిత శాస్త్రవేత్త. ఈయన ఉత్తమ గ్రంథం అయిన యుక్తిభాస యొక్క రచయిత. ఈ గ్రంథం నీలకంఠ సోమయాజి (1444-1544) రచించిన "తరణ సంగ్రహం"యొక్క మలయాళంలో ఒక వ్యాఖ్యానం. ఆ సమయంలో సంప్రదాయ భారతీయ గణిత శాస్త్రజ్ఞులుకు ఒక అసాధారణమైన గ్రంథం. గణిత శాస్త్రంలో యుక్తిభాస పై విషయ విశ్లేషణను కొంతమంది పరిశోధకులు "కలన గణితం యొక్క మొదటి పాఠ్యపుస్తకం"గా ప్రోత్సహించారు[2]. జ్యేష్టదేవుడు ఖగోళ శాస్త్ర పరిశీలనా గ్రంథం Drk-karanaను రచించాడు.[3]

జ్యేష్టదేవ యొక్క జీవిత కాలం

[మార్చు]

అనేక పురాతన రాత ప్రతులలో జ్యేష్ట దేవుని గూర్చి అనేక మూలాలు లభిస్తున్నాయి[1]. ఈ రాత ప్రతుల నుండి, అతని జీవితం గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకోవచ్చు.అతను మలయాళ బ్రాహ్మణ శాఖయైన నంబూద్రికి చెండినవాడు. సా.శ. 1500 లో పరంగ్న్‌గొట్టు కుటుంబంలో జన్మించాడు. అతను దామోదరకు శిష్యుడు. అతను నీలకంఠ సోమయాజికి సమకాలికుడు. జ్యేష్టదేవుని శిష్యుడు అచ్యుత పీషరటి. 1592లో అత్యుత పీషరటి పూర్తిచేసిన ఉపరగక్రియకర్మ గ్రంథం చివరి శ్లోకాలలో తన గురువు జ్యేష్ట దేవుడు అని ఉటంకించాడు. జ్యేష్టదేవుడు రాసినదిగా భావించబడుతున్న దృక్కరణ అనే గ్రంథ మూలం ఆధారంగా అతను సా.శ. 1610 వరకు జీవించి ఉన్నట్లు తెలియుచున్నది.

గణిత వంశం

[మార్చు]

సంగమగ్రామ మాధవకు ముందు కేరళలో గణిత సంప్రదాయాల గురించి పెద్దగా తెలియదు. వటసేరి పరమేశ్వడుడు, మాధవుని ప్రత్యక్ష శిష్యుడు. దామోదర పరమేశ్వర కుమారుడు. నీలకంఠ సోమయాజీ, జ్యేష్ఠదేవ దామోదర విద్యార్థులు. జ్యేష్టదేవుని శిష్యుడు అచ్యుత పీషరటి. మెల్పాతుర్ నారాయణ భట్టతిరి అచ్యుత పిషరటికి శిష్యుడు.

రచనలు

[మార్చు]

అతను యుక్తిభాస, దృక్కరణ అనే గ్రంథాలను రచించాడు. అందులో మొదటిది నీలకంఠ సోమయాజి రాసిన తంత్రసంగ్రహం రచనకు హేతువులతో వ్యాఖ్యానం. రెండవది ఖగోళ గణనలపై ఒక గ్రంథం.

భారత ఉపఖండంలో గణిత్ శాస్త్ర అభివృద్ధికి యుక్తి భాస అనే గ్రంథం ఎంతో దోహదపడడానికి మూడు కారణాలున్నాయి.

  • అది స్థానిక మలయాళ భాషలో రాయబడింది. అంతకు ముందు సంస్కృతంలో రచనలు ఉండేవి.
  • పద్యాలలో రాసేదానికి భిన్నంగా ఈ రచన గద్యంలో రాయబడింది. కేరళ పాఠశాల ఇతర ముఖ్యమైన రచనలన్నీ పద్యంలో ఉన్నాయి.
  • మరీ ముఖ్యంగా, యుక్తిభాను ఉద్దేశపూర్వకంగా ఋజువులతో సహా రాయబడింది.

యివి కూడా చూడండి

[మార్చు]

సూచికలు

[మార్చు]
  1. 1.0 1.1 K.V. Sarma (1991). "Yuktibhāṣā of Jyeṣṭhadeva : A book of rationales in Indin mathematics and astronomy - an analytical appraisal" (PDF). Indian Journal of History of Science. 26 (2): 185–207. Archived from the original (PDF) on 2020-06-17. Retrieved 2020-07-11.
  2. Divakaran, P. P. (December 2007). "The First Textbook of Calculus: Yuktibhāṣā". Journal of Indian Philosophy. 35 (5–6). Springer Netherlands: 417–443. doi:10.1007/s10781-007-9029-1. ISSN 0022-1791. Retrieved 28 January 2010.
  3. J J O'Connor; E F Robertson (November 2000). "Jyesthadeva". School of Mathematics and Statistics University of St Andrews, Scotland. Retrieved 28 January 2010.

మరింత సూచనలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]