Jump to content

పి.సి.మహలనోబిస్

వికీపీడియా నుండి
(ప్రశాంత చంద్ర మహలనోబిస్ నుండి దారిమార్పు చెందింది)
ప్రశాంత్ చంద్ర మహలనోబిస్.
జననంBengali: প্রশান্ত চন্দ্র মহালানবিস
(1893-06-29)1893 జూన్ 29
కలకత్తా, బెంగాల్, బ్రిటిష్ ఇండియా
మరణం1972 జూన్ 28(1972-06-28) (వయసు 78)
కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయతభారతీయుడు
రంగములుగణాంక శాస్త్రవేత్త
వృత్తిసంస్థలుకేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్
చదువుకున్న సంస్థలుప్రెసిడెన్సీ కళాశాల, కలకత్తా
కింగ్స్ కళాశాల, కేంబ్రిడ్జ్ [1]
పరిశోధనా సలహాదారుడు(లు)డబ్ల్యూ. హెచ్. మెకాలే [2]
డాక్టొరల్ విద్యార్థులుసమరేంద్రనాథ్ రాయ్[2]
ఇతర ప్రసిద్ధ విద్యార్థులురాజ్‌ చంద్రబోస్
సి.ఆర్.రావు
ప్రసిద్ధిమహలనోబిస్ డిస్టెన్స్
ఫెల్డ్‌మాన్-మహలనోబిస్ మోడల్
ముఖ్యమైన పురస్కారాలుపద్మవిభూషణ్ (1968)
ఆఫీస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ (OBE, 1942)
రాయల్ సొసైటీ ఫెలోషిప్ (FRS)[1]
Weldon Memorial Prize
సంతకం

ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ OBE, FNA,[3] FASc,[4] FRS[1] (1893 జూన్ 29 - 1972 జూన్ 28) భారతీయ శాస్త్రవేత్త, అనువర్తిత గణాంకశాస్త్రవేత్త. భారత ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్ లాల్ నెహ్రూ అయితే, భారత ప్రణాళిక పథానికి పి.సి.మహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధిచెందినాడు. అతను గణాంక కొలత అయిన "మహలనోబిస్ డిస్టెన్స్" ద్వారా గుర్తింపబడ్డాడు. అతను భారతదేశ మొదటి ప్లానింగ్ కమీషన్లో సభ్యుడు. అతను ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ ను స్థాపించాడు. [1][5][6][7]

జననం

[మార్చు]

1893లో కోల్‌కతలో జన్మించిన మహలనోబిస్ భౌతిక శాస్త్రంలో శిక్షణ పొంది, అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైరైనాడు. అతనికి గణాంక శాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆ రంగంలో నైపుణ్యం సాధించి చివరికి ఆ రంగంలోనే జగత్ప్రసిద్ధి చెందినాడు. గణాంక శాస్త్ర రంగంలో అతని సేవలకు గుర్తింపుగా లండన్ లోని రాయల్ సొసైటీ పెల్లోగా ఎన్నికయ్యాడు. 1946లో ఐక్యరాజ్యసమితి గణాంక శాస్త్ర కమిషన్ సభ్యుడిగా, 1949లో కేంద్ర మంత్రివర్గపు గణాంక శాస్త్ర గౌరవ సలహా దారుడిగా నియమించబడ్డాడు. 1950లో నేషనల్ శాంపిల్ సర్వే స్థాపనలో మహలనోబిస్ కీలకపాత్ర వహించాడు. 1949 జాతీయాదాయ కమిటీ చైర్మెన్ గా మహలనోబిస్ జాతీయాదాయ గణాంకాలకు ప్రాతిపదిక స్వరూపాన్ని ఇచ్చాడు. 1955 నుండి 1967 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగా తన సేవలందించాడు. రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో అతని కృషి అనిర్వచనీయం. భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆ ప్రణాళిక నమూనా మహలనోబిస్ నమూనా గా ప్రసిద్ధిగాంచింది. భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మహలనోబిస్ 1972 జూన్ 28 న మరణించాడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

1893 జూన్ 29కోల్‌కతలో జన్మించిన మహలనోబిస్ పూర్తి పేరు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్. అతని పూర్వీకుల స్వస్థలం నేటి బంగ్లాదేశ్ ప్రాంతం. జీవనోపాధి కోసం మహలనోబిస్ తాత కోల్‌కత ప్రాంతానికి చేరి స్థిరపడ్డాడు. మహలనోబిస్ బాల్యం, విద్యాభ్యాసం కూడా కోల్‌కత లోనే కొనసాగింది. 1912లో భౌతిక శాస్త్రం (ఆనర్స్) లో పట్టభద్రుడయ్యాడు. తర్వాత కేంబ్రిడ్జి, కింగ్స్ కళాశాలలలో గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం అభ్యసించాడు.

అధ్యాపకుడిగా

[మార్చు]

అభ్యసనం పూర్తి కాగానే మహలనోబిస్ కోల్ కత లోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర అద్యాపకుడిగా ప్రవేశించాడు. 30 సంవత్సరాల పాటు సేవలందించి చివరగా ప్రిన్సిపాల్ గా రిటైరయ్యాడు.

గణాంక శాస్త్రవేత్తగా

[మార్చు]

ప్రెసిడెన్సీ కళాశాల అద్యాపకుడిగా ఉన్నపుడే గణాంక శాస్త్రజ్ఝుడిగా ప్రసిద్ధిచెందినాడు. అతను గణాంక శాస్త్రంలో చేసిన సేవలకు గుర్తింపుగా 1945లో లండన్ లోని రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికయ్యాడు. 1946లో ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్ సభ్యుడిగా నియమించబడ్డాడు.1949లో కేంద్ర మంత్రివర్గపు గణాంక శాస్త్ర గౌరవ సలహాదారుడిగా నియమించబడ్డాడు. దీనితో దేశానికి ఆర్థిక, గణాంక సేవలందించడానికి అతనికి అవకాశం లభించింది. 1950 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్ష ఉపన్యాసంలో జాతీయ ప్రణాళిక విధానంలో గణాంక శాస్త్రం అంతర్భాగం అని పేర్కొన్నాడు.భారతీయ గణాంక సంస్థ (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్) స్థాపనలో ప్రముఖ పాత్ర వహించాడు.స్థూల జాతీయోత్పత్తి, సంబంధిత ఇతర అంశాలను అంచనా వేయడం ఈ సంస్థ బాధ్యత. జాతీయాదాయ కమిటీ చైర్మెన్ గా మహలనోబిస్ జాతీయాదాయ లెక్కలకు ప్రాతిపదిక స్వరూపాన్ని రూపొందించారు.

1933లో భారత గణాంక శాస్త్ర పత్రిక సాంఖ్యప్రచురణను అతను ప్రారంభించాడు. 1940' లలో శాంపిల్ సర్వే మీద అతను సాగించిన పరిశోధనల ఫలితంగా 1950లో నేషనల్ శాంపిల్ సర్వే స్థాపితమైంది.

ప్రణాళికా విధాన కర్తగా

[మార్చు]

సోవియట్ యూనియన్ ప్రణాళిక విధానానికి ప్రభావితుడైన జవహర్ లాల్ నెహ్రూ దేశంలో కూడా ఒక ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టు దశలో పి.సి.మహలనోబిస్ ప్రణాళిక విధాన రంగంలో ప్రవేశించాడు. 1950లో ప్రణాళిక సంఘం స్థాపితమైనప్పటి నుంచి గణాంక శాస్త్ర సలహాదారుడిగా సేవలందించాడు. 1955 నుండి 1967 ప్రణాళిక సంఘం సభ్యుడిగా నియమించబడ్డాడు. ముఖ్యంగా భారీ పరిశ్రమలకు ప్రాముఖ్యం ఇచ్చిన రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో పి.సి.మహలనోబిస్ పాత్ర అనిర్వచనీయం. ఇది మహలనోబిస్ నమూనాగా ప్రసిద్ధి చెందినది. వర్తమాన ఆర్థిక వ్యవస్థకు ఉపయోగకరమైన ప్రమాణాలను మహలనోబిస్ రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టినాడు. ప్రణాళిక ఆలోచనలకు నిర్దిష్ట రూపం కల్పించడంలో మహలనోబిస్ ఎంతో సహకరించాడు.

అవార్డులు

[మార్చు]
  • 1944 : ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వెల్డన్ మెడల్ పురస్కారం
  • 1945 : లండన్ లోని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ సభ్యత్వం
  • 1957 : అంతర్జాతీయ గణాంక సంస్థ గౌరవ అధ్యక్షుడిగా హోదా పొందాడు
  • 1968 : భారత ప్రభుత్వము చే పద్మ విభూషణ్ పురస్కారం పొందినాడు.

జీవిత చరిత్రలు

[మార్చు]
  • 1973 లో సి.ఆర్.రావు రచించిన Prasanta Chandra Mahalanobis, 1893-1972. Biographical Memoirs of Fellows of The Royal Society, 19, 455-492.
  • 1996 లో ఏ.రుద్ర రచించిన Prasanta Chandra Mahalanobis: A Biography. Oxford University

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 Rao, C. R. (1973). "Prasantha Chandra Mahalanobis 1893-1972". Biographical Memoirs of Fellows of the Royal Society. 19: 454. doi:10.1098/rsbm.1973.0017.
  2. 2.0 2.1 పి.సి.మహలనోబిస్ at the Mathematics Genealogy Project
  3. Rao, C.R. (1972). "Prasanta Chandra Mahalanobis : 1893-1972" (PDF). Biographical Memoirs of Fellows of the Indian National Science Academy. 5: 1–24.
  4. "Fellowship - Mahalanobis, Prasanta Chandra". Indian Academy of Sciences. Retrieved 18 February 2018.
  5. Hagger-Johnson, G. (2005). "Mahalanobis, Prasanta Chandra". Encyclopedia of Statistics in Behavioral Science. doi:10.1002/0470013192.bsa360. ISBN 0470860804.
  6. O'Connor, John J.; Robertson, Edmund F., "పి.సి.మహలనోబిస్", MacTutor History of Mathematics archive, University of St Andrews.
  7. Ghosh, J. K.; Majumder, P. P. (2005). "Mahalanobis, Prasanta Chandra". Encyclopedia of Biostatistics. doi:10.1002/0470011815.b2a17090. ISBN 047084907X.

బయటి లంకెలు

[మార్చు]