కల్యంపూడి రాధాకృష్ణ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్యంపూడి రాధాకృష్ణారావు
ఏప్రిల్ 2012లో చెన్నైలోని ఐఎస్సై-భారత గణాంకశాస్త్ర సంస్థ వద్ద కల్యంపూడి రాధాకృష్ణారావు
జననం (1920-09-10) 1920 సెప్టెంబరు 10 (వయస్సు: 98  సంవత్సరాలు)/ 1920, సెప్టెంబరు 10
హదగళి, మైసూరు రాజ్యం,
బ్రిటీషు ఇండియా
నివాసంభారతదేశం, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా
పౌరసత్వంఅమెరికా[1]
రంగములుగణితశాస్త్రం మరియు గణాంకశాస్త్రం
విద్యాసంస్థలుభారత గణాంకశాస్త్ర సంస్థ
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
పెన్న్ స్టేట్ విశ్వవిద్యాలయం
స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, బఫెలో
పూర్వ విద్యార్థిఆంధ్ర విశ్వవిద్యాలయం
కలకత్తా విశ్వవిద్యాలయం
కింగ్స్ కళాశాల, కేంబ్రిడ్జి
పరిశోధనా సలహాదారుడు(లు)రోనాల్డ్ ఫిషర్
డాక్టరల్ విద్యార్థులుRadha Laha
V. S. Varadarajan
S. R. Srinivasa Varadhan
ప్రసిద్ధిక్రేమర్–రావు పరిమితి
రావు-బ్లాక్‌వెల్ సిద్ధాంతం
Orthogonal arrays
Score test
ముఖ్యమైన అవార్డులుపద్మవిభూషణ్
National Medal of Science
S. S. Bhatnagar Prize
Guy Medal (Silver 1965, Gold 2011)

సీఆర్‍రావుగా ప్రఖ్యాతి గడించిన కల్యంపూడి రాధాకృష్ణారావు ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు మరియు గణాంక శాస్త్రజ్ఞుడు. ఇతడు అమెరికన్ భారతీయుడు. ప్రస్తుతం ఇతను పెన్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ మరియు యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్. ఇతనికి ఎన్నో గౌరవ పురస్కరాలు, డిగ్రీ పట్టాలు, మరియు గౌరవాలు అందాయి. వాటిలో 2002కు గానూ యూఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ చెప్పుకోదగింది. ది అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ ప్రకారం ఇతను "ఒక చారిత్రక వ్యక్తి[2]. ఇతని పనితనం గణాంకశాస్త్రాన్నే కాక ఎకనమిక్స్, జెనెటిక్స్, జియాలజీ, నేషనల్ ప్లానింగ్, డెమొగ్రఫీ, బయోమెట్రీ మరియు మెడిసిన్ వంటి శాస్త్రాలను ప్రభావితం చేస్తోంది." టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇతడు భారతదేశపు పది మంది నిత్య శాస్త్రజ్ఞులలో ఒకడు[3][4].

ప్రారంభ జీవితం[మార్చు]

రాధాకృష్ణారావు 10 సెప్టెంబర్ 1920 న బళ్ళారి జిల్లాలోని హదగళిలో జన్మించాడు.ఆయన తండ్రి పోలీసు ఇనస్పెక్టరుగా అక్కడ పనిచేసేవారు.ఆ తర్వాత నూజివీడు, నందిగామ గ్రామాల్లో చదివారు.విశాఖపట్నంలో స్కూల్ ఫైనల్ నుండి డిగ్రీ వరకు స్కాలర్‌షిప్ తో విద్యాభ్యాసం చేసారు. ఏ తరగతిలోనూ ఫస్టు ర్యాంకు మిస్ కాలేదు. బి.ఎ (ఆనర్స్) చేసారు.ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో ఎం.ఎస్.సి డిగ్రీని పొందారు. విశాఖపట్నం నుండి కలకత్తా వెళ్ళి ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో చేరారు. 1943లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.[2] ప్రపంచంలో గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ మొట్టమొదట పొందిన కొద్దిమంది వ్యక్తులలో ఆయన ఒకరు.[ఆధారం కోరబడింది]ఆయన విశ్వవిద్యాలయ ఫస్టు ర్యాంకు సాధించారు. సంస్థలోనే లెక్చరర్ గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగిగా పరిశోధనలు ప్రారంభించారు. పరిశోధనలతో భాఅంగానే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు కొనసాగించే అవకాశాన్ని అందుకున్నారు. పరిశోధనాంశములతో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రెస్ వారి ఈయన గ్రంథ రచనను వెలువరించారు. అప్పటికి ఈయన వయస్సు 26 యేండ్లు మాత్రమే.

పరిశోధనలు[మార్చు]

ఇంగ్లండు నుండి తిరిగి వచ్చి మాతృ సంస్థలోనే చేరారు. సంస్థకు అందిన రెండవ పంచవర్ష ప్రణాళీక రూపకల్పనలో బాధ్యత పంచుకున్నారు. దేశవ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని ఈయన సూచించిన అంశానికి నెహ్రూ ఆమోదించారు. ఐదు రెట్లు జీతమిస్తామన్న ఆంధ్రవిశ్వవిద్యాలయ పిలుపును ఈయన అంగీకరించలేదు. ప్రొఫెసర్ గా, గణాంక శాస్త్ర విభాగపు అధిపతిగా బాధ్యతలు నెరవేర్చుటకంటె పరిశోధనలే పరమావధిగా భావించారు. కలకత్తా ఇనిస్టిట్యూట్ లోనే 40 సంవత్సరాలుగా పరిశోధనలు సాగించారు. వేలమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. దేశప్రధాని చేతులమీదుగా అత్యుత్తమ శాస్త్రవేత్తలకు అందించే శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకున్నారు. వేదిక మీదనే ఆ ప్రైజ్ మనీని అవార్డు అందించిన నెహ్రూ ద్వారా దేశ రక్షణనిధికి సమర్పించారు.[5]

పరిశోధనా జిజ్ఞాస చల్లారక పోవడంతో ఆయన అమెరికా వెళ్ళి పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా చేరి అత్యున్నత స్థానాలకు ఎగబాకి పరిశోధక విద్యార్థులలో జ్ఞానసముపార్జనను ఇనుమడింపజేసారు. అమెరికాలో ప్రతి యేటా అత్యుత్తమస్థాయి శాస్త్రవేత్తలకు అందించే "నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్"ను అమెరికా అధ్యక్షులు జార్జి బుష్ చేతులమీదుగా అందుకున్నారు.

రష్యా సైన్స్ అకాడమీ 200 సంవత్సరాల వేడుకలో ప్రపంచవ్యాప్తంగా 200 మంది శాస్త్రవేత్తలకు ఆహ్వానించగా ఈయనకు ఆ అపూర్వ అవకాశం దక్కింది. కార్యక్రమం ప్రారంభంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళి అర్పించే సందర్భంలో స్మృతి చిహ్నం మీద పుష్పగుఛ్ఛాన్ని ఉంచే అరుదైన అవకాశం ఈయనకే ప్రప్రథమంగా దక్కింది.

ప్రపంచవ్యాప్త ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన రాయల్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ (లండన్) కు ఫెలోగా ఎన్నికైన తొలి ఆంధ్రుడు ఆయన. 350 పరిశోధన పత్రాలు రాసి 17 దేశాల నుంచి 29 డాక్టరేట్లు అందుకున్న ఈయన మొత్తం 14 గ్రంథ రచనలు చేసారు. వీటిలో మూడు గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలోనికి అనువాదమయ్యాయి.

అవార్డులు మరియు మెడల్స్[మార్చు]

 • గ్యూ మెడల్ ఇన్ గోల్డ్ (2011), రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ [6]
 • ఇండియన్ సైన్స్ అవార్డు 2010 [7]
 • ఇంటర్నేషనల్ మహాలనోబిస్ ప్రైజ్ (2003), ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ వారిచే[8]
 • శ్రీనివాస రామనుజన్ మెడల్ (2003), ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారిచే
 • నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ ను 2002 జూన్ 12 లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుస్ చే అందుకున్నారు.
 • పద్మవిభూషణ (2001), భారత ప్రభుత్వం వారిచే
 • మహాలనోబిస్ చెటెర్నరీ గోల్డ్ మెడల్ (1993?), ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వారిచే.
 • విల్క్స్ మెమోరియల్ అవార్డు (1989), అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ వారిచే.
 • మేఘనాథ్ సాహా మెడల్ (1969), ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారిచే.
 • Guy Medal in Silver (1965) of the Royal Statistical Society
 • శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు (1963)
 • జె.సి.బోస్ గోల్డ్ మెడల్, బోస్ ఇనిస్టిట్యూట్ వారిచే
 • కలకత్తా విశ్వవిద్యాలయం వారి గోల్డ్ మెడల్
 • 2003 లో కలకత్తా విశ్వవిద్యాలయం వారిచే డాక్టరేట్ ఆఫ్ సైన్స్..[9]

గౌరవాలు[మార్చు]

 • పెన్సిల్వేనియా స్టేట్ విశ్వవిద్యాలయం వారు "సి.ఆర్ అండ్ భార్గవీరావు ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్"ను ప్రారంభించారు.
 • నేషనల్ అవార్డు ఇన్ స్టాటిస్టిక్స్ వారు "మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్(MoSPI)ను ప్రారంభించారు.
 • సి.ఆర్.రావు రోడ్డు: హైదరాబాదులోని "ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,హైదరాబాదు" నుండి సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాదు గుండా అలిండ్ ఫ్యాక్టఈ, లింగంపల్లి వరకు గల రోడ్డుకు ఆయన పేరు పెట్టారు.[10]

మూలాలు[మార్చు]

 1. The Numberdars
 2. 2.0 2.1 "Statisticians in History: Calyampudi R. Rao". American Statistical Association. horizontal tab character in |title= at position 28 (help)
 3. "C.R.Rao in News". C.R.Rao Advanced Institute of Mathematics, Statistics and Computer Science.
 4. "Indian Heart Association". Indian Heart Association Webpage. Retrieved 27 April 2015.
 5. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ ed.). శ్రీవాసవ్య. 2001. p. 114.
 6. "Indian American C.R. Rao receives the RSS Guy Medal Award". Silicon India. 2 August 2011.
 7. "C.R. Rao Receives the India Science Award". Eberly College of Science, Penn State University. 19 October 2010.
 8. "The previous winners of the Award are Professor C.R. Rao (India) in 2003..." http://www.isi-web.org/component/content/article/43-about/about/588-2013-mahalanobis-international-award-in-statistics-announcement
 9. "Recipients of Honorary Degrees". University of Calcutta.
 10. "Road to be named after Prof. C.R. Rao". The Hindu. 10 September 2009. Retrieved 6 May 2012.

వనరులు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

For the Cramér–Rao inequality and the Rao–Blackwell theorem see the relevant entries on

Photograph of Rao with Harald Cramér in 1978