నూజివీడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నూజివీడు
—  నగరం  —
నూజివీడు is located in Andhra Pradesh
నూజివీడు
అక్షాంశరేఖాంశాలు: 16°47′17″N 80°50′47″E / 16.7881°N 80.8465°E / 16.7881; 80.8465
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నూజివీడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)[1]
 - మొత్తం 58,590
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్


నూజివీడు
—  మండలం  —
కృష్ణా జిల్లా జిల్లా పటములో నూజివీడు మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో నూజివీడు మండలం యొక్క స్థానము
నూజివీడు is located in Andhra Pradesh
నూజివీడు
ఆంధ్రప్రదేశ్ పటములో నూజివీడు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°47′N 80°51′E / 16.78°N 80.85°E / 16.78; 80.85
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము నూజివీడు
గ్రామాలు 26
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,29,553
 - పురుషులు 65,001
 - స్త్రీలు 64,552
అక్షరాస్యత (2011)
 - మొత్తం 65.50%
 - పురుషులు 71.00%
 - స్త్రీలు 59.84%
పిన్ కోడ్ 521201

నూజివీడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా లోని ఒక ముఖ్య పట్టణము మరియు మండలము. పిన్ కోడ్ నం..521 201. ఎస్‌టిడి కోడ్ నం. = 08656.

నూజివీడు పట్టణ చరిత్ర[మార్చు]

నూజివీడు సెంటర్

నూజివీడు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక మునిసిపాలిటి హోదా కలిగిన పట్టణం. ==నూజివీడు పట్టణo పేరు వెనుక చరిత్ర==పూ ర్వం రాజుల పరిపాలనలో ఈ పట్టణం ఉండేది.నూజివీడు రాజుల కోట నుండి విజయనగర ఆస్థానం వరకు ఒక సొరంగం ఉండేది.అది ప్రస్తుతం కరెంటు ఆఫీసుగా ఉన్న రాజుల కోటకు ఆగ్నేయంగా ఉండేది.ఈ కోట కోడిగుడ్డు సొన మరియు మినుప పిండి సున్నం వేసి నిర్మించారు. తరువాత ఆ కోటలో ఆ.ప్ర సాంఘిక సంక్షేమ పాఠశాల బాయ్స్ ని గోవర్నమెంట్ ఉంచింది

నూజివీడు పట్టణ భౌగోళికం[మార్చు]

నూజివీడు పట్టణo విజయవాడకి 50 కి.మీ దూరములో వున్నది.

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

రవాణా సౌకర్యాలు:[మార్చు]

పట్టణంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

కళాశాలలు[మార్చు]

 1. ఐ.ఐ.ఐ.టి నూజివీడు:- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి అయిన వై.యస్.రాజశేఖర రెడ్డి గారిచే పేద విధ్యార్ధుల కోసం స్థాపింపబడిన ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ సాంకేతిక వైఙ్ఞానిక విశ్వవిద్యాలయం.
 2. దర్మా అప్పారావు కాలేజీ:- ప్రతి యేడూ డీఏఆర్ కాలేజీలో బాస్కెట్ బాల్ పోటీలు , బాయ్స్ ఉన్నత పాఠశాల లో కబడ్డీ పోటీలు చాలా పెద్ద స్థాయిలో జరుగుతాయి.
 3. ఆచార్య నాగార్జునా యునివర్శిటీ ఉన్నత విద్యా కేంద్రము
 4. సారధి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

పాఠశాలలు[మార్చు]

 1. శ్రీ దత్తాత్రేయ యోగ,వ్యాయామ పాఠశాల:- ఈ పాఠశాలకు చెందిన తల్లాప్రగడ సాయిప్రసన్నలక్ష్మి, స్థానిక సిద్ధార్ధ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుచున్నది. ఈమె తన తండ్రి, యోగా గురువు శ్రీ కుమార్ శిక్షణలో పలు ప్రదర్శనలిచ్చినది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని తాటిపాకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగా అసోసియేషన్ నిర్వహించిన యోగా పోటీలలో జూనియర్ విభాగంలో పాల్గొన్న ఈమె, తృతీయస్థానం సంపాదించినది. ఈ విజయం సాధించిన ఆమె, జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికైనది. ఈ పోటీలలోనే ఈ పాఠశాలకు చెందిన శ్రీకుమార్ అను విద్యార్ధి పంచమస్థానంలో నిలిచినాడు. [7]
 2. సెయింట్ ఆన్స్
 3. ఎస్. డీ. యె
 4. నూజివీడు పట్టణంలోని కోటావారిగూడెం ప్రాధమికోన్నత పాఠశాలలో ఎస్.జి.టి. గా పనిచేయుచున్న శ్రీమతి కొత్తూరి సుశీలకుమారి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారానికి ఎంపికైనారు. విద్యారంగంలో సైన్సు ప్రయోగాలు, కళాధార విద్య, కుట్లు, అల్లికలు, పెయింటింగ్, హెర్బేరియం, వేలిముద్రలతో బొమ్మలు, అగ్గిపుల్లలు, ఐస్ క్రీం పుల్లల నమూనాలు, ప్రాజెక్టు పనులు, అత్యుత్తమ బోధనకుగాను, ఈమె జాతీయ పురస్కారానికి ఎంపికైనారు. 2014, సెప్టెంబరు-3వ తేదీనాడు, దేశ ఉన్నతాధికారులతో సమావేశం, 4వ తేదీన ప్రధానమంత్రి ఆహ్వానంతో, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగారితో కలిసి మద్యాహ్న భోజనం, ఐదవ తేదీన ఢిల్లీలోని విఙాన భవనంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా పురస్కార స్వీకరణ, మొగల్ గార్డెన్స్ సందర్శన, మొదలగు కార్యక్రమాలతో గూడిన షెడ్యూలును వీరికి పంపినారు. [3]
 5. ఆంధ్ర ప్రదేశ్ పభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల:-నూజివీడు పట్టణ శివార్లలోని అన్నవరం రహదారిపై నిర్మించిన ఈ పాఠశాల, కళాశాలల నూతన భవనాన్ని, 2015,ఆగస్టు-8వ తేదీనాడు ప్రారంభించినారు. [6]

పట్టణంలోని మౌలిక వసతులు[మార్చు]

వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

నూజివీడు పట్టణ పరిపాలన[మార్చు]

నూజివీడు పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

 1. శ్రీ వెంకటాచల స్వామివారి దేవాలయము:- ఈ ఆలయానికి సుంకొల్లు గ్రామములో 32.32 ఎకరాలలో విస్తరించియున్న ఒక చెరువు ఉన్నది. ఈ చేపల చెరువును, మూడు సంవత్సరాలకొకసారి వేలం వేసి, వచ్చిన ఆదాయాన్ని దేవస్థానానికి అందించెదరు.
 2. శ్రీ ధన్వంతరీస్వామివారి ఆలయం:- నూజివీడు పట్టణ శివారులలో ఉన్న ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-23, శ్రావణ శనివారం నాడు, శనిత్రయోదశి, మాస శివరాత్రి ప్రత్యేకపూజలు వైభవంగా నిర్వహించినారు. వేదపండితుల ఆచార్యత్వంలో గణపతి ఆరాధన, ధన్వంతరీ విశిష్టపూజ, మహాన్యాసం, రుద్ర, పురుష, శ్రీసూక్త విధoగా పంచాయతన అభిషేకం, బిల్వదళ అష్తోత్తర శతనామార్చన, అంబికా సహస్రనామ పుష్ప, కుంకుమపూజలు నిర్వహించినారు. మానవాళికి సర్వ అరిష్టములు తొలగి, సకల కార్య విజయం సిద్ధించవలనని, ఈ పూజలు నిర్వహించినారు. [3]
 3. శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- గ్రామీణ నూజివీడులో ఉన్న ఈ ఆలయంలో, శ్రీరామనవమి సందర్భంగా, స్వామివరి 101వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు, 2015,మార్చ్-26వ తేదీ గురువారం నుండి 30వ తేదీ సోమవారం వరకు నిర్వహించెదరు. 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు హనుమత్పతాకోత్సవం, స్వామివారిని పెండ్లికుమారుని చేయుట,, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, రాత్రికి హనుమద్వాహన అలంకారం చేయుదురు. 27వ తేదీ శుక్రవారం ఉదయం, శ్రీ సీతా జననం, సాయంత్రం కోలాటం, "శ్రీరామ జయరామ" సామూహిక గానం, ఎదురుకోలు ఉత్సవం నిర్వహించెదరు. 28వ తేదీ శనివారం ఉదయం శ్రీరామ జననం, మద్యాహ్నం శ్రీ సీతారామ కళ్యాణం, రాత్రికి గరుడోత్సవం, నాదస్వర కచేరీ నిర్వహించెదరు. 29వ తేదీ ఆదివారం నాడు, శ్రీ సీతారామ పట్టాభిషేకం, రాత్రికి కుబేర పుష్పక వాహనం, నాదస్వర కచేరీ మొదలగు కారక్రమాలు నిర్వహించెదరు. 30వ తేదీ సోమవారం నాడు పూర్ణాహుతి, రాత్రికి డోలోత్సవం మరియు ఏకాంతసేవ చేసెదరు. 31వ తేదీ నాడు నారాయణ సేవాకార్యక్రమం నిర్వహించెదరు. [5]
 4. శ్రీ కోట మహిషాసురమర్ధని అమ్మవారి ఆలయం.
 5. అడవి ఆంజనేయస్వామి ఆలయము.
 6. ఆయ్యప్పస్వామి దేవాలయము.
 7. సరస్వతి దేవాలయము:- ఆంధ్ర ప్రదేశ్‌లో కేవలము రెండు సరస్వతీదేవి ఆలయములు మత్రమే వున్నవి, ఒకటి బాసర అయితే రెండవది నూజివీడు.

చూడవలసిన ప్రదేశలు[మార్చు]

 1. నూజివీడు జమీందారులచే నిర్మించబడిన కుక్కల గేటు మరియు గుర్రం గేటు పట్టణంలో చెప్పుకోదగిన ప్రముఖ కట్టడములు.

ప్రధానమైన పంటలు[మార్చు]

నూజివీడు మామిడి తోటలకు బాగా పేరున్న ప్రదేశము. పలు వందల రకాల మామిడి పళ్ళు ఇక్కడ లభించును. ఇక్కడి మామిడి పళ్ళు దేశ, విదేశాలలోని పలు ప్రాంతములకు ఎగుమతి చేయబడుచున్నవి. ప్రసిద్ధి చెందిన "నూజివీడు చిన్న రసం" పళ్ళకు నూజివీడు పుట్టినిల్లు.

గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

నూజివీడు పట్టణ ప్రముఖులు[మార్చు]

పట్టణ రాజకీయ నాయకులు[మార్చు]

నూజివీడు పట్టణ విశేషాలు[మార్చు]

నూజివీడు వీణ ప్రపంచ ప్రసిద్ధి చెందినది. పట్టణంలోని వెంకటేశ్వర కోవెల ప్రాంతములో వీణల తయరీ దుకాణాలు కలవు.

నూజివీడు శాసనసభ నియోజకవర్గం[మార్చు]

జనాభా[మార్చు]

నూజివీడు మండల జనాభా
జనాభా (2011) - మొత్తం 1,29,553 - పురుషులు 65,001 - స్త్రీలు 64,552
 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అన్నవరం 1,015 4,190 2,136 2,054
2. బత్తులవారిగూడెం 460 1,906 931 975
3. బోరవంచ 541 2,575 1,293 1,282
4. దేవరగుంట 533 2,181 1,104 1,077
5. దిగవల్లి 1,331 5,906 3,033 2,873
6. ఎనమదల 510 2,274 1,128 1,146
7. గొల్లపల్లి 1,082 4,994 2,552 2,442
8. హనుమంతునిగూడెం 352 1,584 813 771
9. జంగంగూడెం 563 2,164 1,092 1,072
10. మర్రిబందం 508 2,102 1,037 1,065
11. మీర్జాపురం 1,161 4,848 2,432 2,416
12. మొఖాస నరసన్నపాలెం 472 1,799 923 876
13. మోర్సపూడి 437 1,644 815 829
14. ముక్కొల్లుపాడు 519 2,239 1,124 1,115
15. నర్సుపేట్ 327 1,480 779 701
16. పల్లెర్లమూడి 1,056 4,244 2,171 2,073
17. పోతురెడ్డిపల్లి 983 4,097 2,035 2,062
18. పొలసనపల్లి 594 2,360 1,192 1,168
19. రామన్నగూడెం 281 1,121 573 548
20. రావిచెర్ల 836 3,416 1,751 1,665
21. సీతారాంపురం 400 1,498 757 741
22. సుంకొల్లు 603 2,689 1,388 1,301
23. తుక్కులూరు 645 2,644 1,334 1,310
24. వేంపాడు 137 471 241 230
25. వెంకటాయపాలెం 401 1,885 970 915

|26.||వెంకటాద్రిపురం

బయటి లింకులు[మార్చు]

వనరులు[మార్చు]

 1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 24 December 2015. 
 2. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2014, ఆగష్టు-17; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014, ఆగష్టు-24; 4వపేజీ. [4] [5] ఈనాడు కృష్ణా; 2015,మార్చ్-25; 10వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-9; 20వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-9; 14వపేజీ."https://te.wikipedia.org/w/index.php?title=నూజివీడు&oldid=1832704" నుండి వెలికితీశారు