కామవరపుకోట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కామవరపుకోట
—  మండలం  —
పశ్చిమ గోదావరి జిల్లా పటములో కామవరపుకోట మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో కామవరపుకోట మండలం యొక్క స్థానము
కామవరపుకోట is located in ఆంధ్ర ప్రదేశ్
కామవరపుకోట
ఆంధ్రప్రదేశ్ పటములో కామవరపుకోట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము కామవరపుకోట
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 53,592
 - పురుషులు 27,107
 - స్త్రీలు 26,485
అక్షరాస్యత (2001)
 - మొత్తం 64.92%
 - పురుషులు 69.59%
 - స్త్రీలు 60.12%
పిన్ కోడ్ 534449
కామవరపుకోట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం కామవరపుకోట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 15,194
 - పురుషుల సంఖ్య 7,690
 - స్త్రీల సంఖ్య 7,504
 - గృహాల సంఖ్య 3,723
పిన్ కోడ్ 534 449
ఎస్.టి.డి కోడ్

కామవరపుకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక [[గ్రామము.[1]]] (చిన్న పట్టణము), మండలము. పిన్ కోడ్: 534 449.

చరిత్ర[మార్చు]

కామవరపుకోటకు దగ్గరలో గుంటుపల్లె, జీలకర్రగూడెం చారిత్రిక బౌద్ధ శిధిలాలున్నాయి. వూరిలో పురాతనమైన కట్టడాలు, కోట ఆవరణ ఉన్నాయి. కోట ఆవరణలో శ్రీభద్రకాళీసమేత వీరభద్రస్వామి ఆలయం ఉంది. డాక్టర్ పున్నమరాజు వెంకట రమణారావు ఇక్కడి మొట్టమొదటి క్వాలిఫైడ్ వైద్యుడు. ఆయన చుట్టుపక్కల పలు గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. ఆయన పేరుమీద ఇప్పటికీ ఆయన కుమారులు స్థానిక కళాశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్పులు అందజేస్తున్నారు.

వ్యవసాయం, నీటి వనరులు[మార్చు]

ఇది మెరక ప్రాంతం. చుట్టూరా ఉన్న ప్రదేశం చిన్న చిన్న కొండలతోను, చిట్టడవులతోను ఉంటుంది. కొంత వ్యవసాయం వివిధ చెరువుల క్రింద సాగుతున్నది. అడవులను నరికివేసి వాణిజ్య పంటలు పండిస్తున్నారు. మామిడి, జీడిమామిడి, పామాయిల్, పుగాకు, అరటి, కొబ్బరి, వరి వంటివి ముఖ్యమైన పంటలు.

సదుపాయాలు[మార్చు]

రవాణా

ఏలూరు నుండి బస్సు సౌకర్యం ఉంది. టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిధ్ది పొందిన ద్వారకా తిరుమలకి 9కి.మి దూరములో ఉంది.

విద్యాసంస్థలు

శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ఉన్నత పాఠశాల ప్రైవేటు విద్యా సంస్థలు: స్వస్తిక్ ట్యూషన్ సెంటర్, సెయింట్ మెరిస్ స్కూలు, అభ్యుదయ డిగ్రీ కాలేజి, ఆదిత్య స్కూల్, రోహిణి స్కూల్, స్నేహ స్కూల్

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 15194.[1] ఇందులో పురుషుల సంఖ్య 7690, మహిళల సంఖ్య 7504, గ్రామంలో నివాసగృహాలు 3723 ఉన్నాయి.

మండల గణాంకాలు[మార్చు]

మండల కేంద్రము కామవరపుకోట
గ్రామాలు 13
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2001) - మొత్తం 53,592- పురుషులు 27,107 - స్త్రీలు 26,485
అక్షరాస్యత (2001) - మొత్తం 64.92%- పురుషులు 69.59% - స్త్రీలు 60.12%

మండలంలో గ్రామాలు[మార్చు]

బొమ్మలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు