జన సాంద్రత
Appearance
(జనసాంద్రత నుండి దారిమార్పు చెందింది)
జనసాంద్రత (ఆంగ్లంలో Population density) ఒక, జనాభా కొలమాన విధానం. ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభాను జనసాంద్రతగా పరిగణిస్తారు.[1]
మానవ జనాభా సాంద్రత
[మార్చు]మానవులలో, జనసాంద్రత, ఒక యూనిట్ (ఉదాహరణకు ఒక చదరపు కిలోమీటరు) తీసుకుని, దానిలో నివసించు జనాభాను తీసుకుని, సరాసరి గణిస్తారు. దీనిని, ప్రపంచం, ఖండం, దేశం, రాష్ట్రం, నగరం, ఇతర విభాగాల వారీగా గణిస్తారు.
- ప్రపంచ జనాభా 6.6 బిలియన్ ప్రజలు, భూమి వైశాల్యం 510 మిలియన్ చ. కి., (200 మిలియన్ చదరపు మైళ్ళు).
- ఈ రీతిలో, జనాభా / విస్తీర్ణం (వైశాల్యం); 6.6 బిలియన్లు / 510 చదరపు కి.మీ. = 13 మంది జనాభా ఒక చదరపు కి.మీ.నకు (ఒక చదరపు మైలుకు 33 మంది)
- లేదా భూమిపై గల భూభాగాన్ని లెక్కగట్టితే భూభాగం 150 మిలియన్ కి.మీ.² ఈ లెక్కన ఒక చదరపు కి.మీ.నకు 43 మంది జనాభా (ఒక చదరపు మైలుకు 112 మంది).
- జనాభా పెరుగుదలతో జనసాంద్రతకూడా పెరుగుతుంది.
ఇతర కొలమాన విధానాలు
[మార్చు]- జనాభా సాంద్రత కొలవడానికి, గణిత సాంద్రత విధానము సాధారణమైనది, కానీ కొన్ని ఇతర విధానాల ద్వారా కూడా, ఓ నిర్ణీత ప్రదేశంలో జనసాంద్రత కొలుస్తారు.
- గణిత సాంద్రత: మొత్తం ప్రజలు / ప్రాంత వైశాల్యం కి.మీ² లేదా మై.².
- భూమి మీద జనాభా సాంద్రత: మొత్తం జనాభా / లభ్యమవుతున్న భూమి.
- వ్యవసాయ సాంద్రత: మొత్తం గ్రామీణ జనాభా / మొత్తం వ్యవసాయ భూమి.
- నివాసాల సాంద్రత: పట్టణ ప్రాంతాలలో నివసించు జనాభా / నివాసయోగ్యమైన భూమి.
- పట్టణ సాంద్రత: పట్టణ ప్రాంతంలో నివసించు జనాభా / మొత్తం పట్టణ ప్రాంతం.
- ఉత్తమమైన పర్యావరణ: ప్రాంతీయ సహజవనరుల ఆధారంగా గల జనసాంద్రత.
ఇవీ చూడండి
[మార్చు]- ప్రపంచ జనాభాకు సంబంధించిన కొన్ని జాబితాలు
- దేశాల జాబితా – జనసంఖ్య క్రమంలో
- దేశాల జాబితా – 2005 జనసంఖ్య క్రమంలో
- దేశాల జాబితా – 1907 జనసంఖ్య క్రమంలో
- దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో
- దేశాల జాబితా – జననాల రేటు క్రమంలో
- దేశాల జాబితా – ఆంగ్లభాష మాట్లాడేవారి సంఖ్య క్రమంలో
- దేశాల జాబితా – అక్షరాస్యత క్రమంలో
- దేశాల జాబితా – పేదరికంలో ఉన్న జనసంఖ్య శాతం క్రమంలో
- దేశాల జాబితా – మానవ అభివృద్ధి సూచికలు
మూలాలు
[మార్చు]ఇతర లింకులు
[మార్చు]Look up జన సాంద్రత in Wiktionary, the free dictionary.
- City Ranks combines Google Maps and 2000 Census data to show the population densities of U.S. zip codes on an interactive map.
- Selected Current and Historic City, Ward & Neighborhood Densities
- Population density world-map Archived 2007-06-20 at the Wayback Machine