Jump to content

పామాయిల్

వికీపీడియా నుండి

పామాయిల్
African Oil Palm (Elaeis guineensis)
Scientific classification
Kingdom:
Family:
Subfamily:
Tribe:
Genus:
Elaeis

Species

Elaeis guineensis
Elaeis oleifera

పామాయిల్ ఒక రకమైన నూనె. వంటలకు వాడే నూనె.

  • ఆంధ్ర రాష్టంలో ఆయిల్‌ పాం (పామాయిల్) తోటల సాగు విస్తీర్ణం పెంచాలన్న ఉద్దేశాన్ని, ప్రైవేటు కంపెనీల నిర్వాకం, ఉద్యాన శాఖ నిర్లక్ష్యం తీవ్రంగా దెబ్బతీశాయి. గత ఆర్థిక సంవత్సరం (2010-11) సాగు లక్ష్యంలో కనీసం సగమైనా నెరవేరకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాఛారం. గత ఏడాది అదనంగా 37,065 ఎకరాల/హెక్టార్ల మేర సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరికి 18,167 ఎకరాల్లో/హెక్టార్లలో మాత్రమే, రైతులు కొత్తగా సాగుచేశారు. ఈ పంట సాగు చేసే రైతులకు కేంద్రమే పూర్తిగా నిధులు ఇస్తోంది. ఆయిల్‌పాం తోటల సాగు బాగా పెరిగితే వంట నూనెల దిగుమతి వ్యయం, తగ్గుతుందన్న యోచనతో, కేంద్రం ఈ సాగును ప్రోత్సహిస్తోంది. ఇంత ప్రోత్సాహమున్నా కనీసం 50 శాతం లక్ష్యాన్నయినా సాధించక పోవడం ఉద్యాన శాఖ వైఫల్యమేనన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
  • దేశంలోకెల్లా, ఆంధ్రప్రదేశ్ లోనే ఆయిల్‌పాం తోటల సాగు అత్యధికంగా ఉంది (రాజమండ్రి నుంచి ఏలూరు రైలులో వెళుతున్నప్పుడు, ఈ తోటలు మనకు కనువిందు చేస్తాయి). ఇప్పటికే 2.50 లక్షల ఎకరాల్లో/ హెక్టార్లలో పంట సాగులో ఉంది. గత ఏడాది, తొలుత 86 వేల ఎకరాల అదనపు సాగు లక్ష్యాన్ని నిర్దేశింఛినా, తరువాత దానిని 37 వేల ఎకరాలకు /హెక్టార్లకు తగ్గించారు. చివరికి 18,167 ఎకరాలను /హెక్టార్లను దాటలేక పోయారు. గత ఏడాది సాగు పెరగకపోవడానికి ప్రైవేటు కంపెనీల నిర్వాకమే కారణమని ఉద్యాన శాఖ చెబుతోంది. నాలుగు కంపెనీలు తొలుత 6 జిల్లాల్లో కొత్తగా ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తామని రెండేళ్ళ క్రితం ముందుకొచ్ఛాయి. చెరకు పంట తరహాలో ఆయిల్‌ పాంను సైతం ఒక్కో మండలాన్ని ఒక్కో కంపెనీకి ప్రభుత్వం కేటాయిస్తోంది. అక్కడి రైతులతో పంట సాగును ప్రోత్సహించి దాని కొనుగోలుకు సదరు కంపెనీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి. కానీ, ఇప్పటి వరకూ తమకు కేటాయించిన ప్రాంతాలకు సంబంధించి ఆ 4 కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ప్రభుత్వం ఈ కంపెనీల కోసం ఏడాది పాటు ఎదురుచూసి వారం క్రితం ఉత్తర్వులను సవరించింది. రెండు కంపెనీల ఒప్పందాలను రద్ధు చేసింది. అటు కంపెనీల నిర్వాకం, ఇటు ఉద్యాన శాఖ నిర్లక్ష్యం కారణంగా మధ్యలో రైతులు పంట వేయలేక నష్ట పోయారు. వారికి ప్రోత్సాహకాలు అందించేవారు లేక పంటను వేయలేక పోయారని అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి . వాస్తవానికి ఈ కంపెనీల సామర్ధ్యంపై ముందుగా సరైన పరిశీలన చేయకుండానే వాటికి ఆయా జిల్లాల్లో మండలాలను కేటాయించారన్న ఆరోపణలున్నాయి. ఆయిల్‌పాం సాగు, పామాయిల్ ఉత్పత్తిపై సరైన పరిజ్ఞానం, అవగాహన లేనివాటికి పంట సాగును ప్రోత్సహించాలని నిర్దేశించి ఉద్యాన శాఖ మిన్నకుండిపోవడం కూడా లక్ష్యం చేరకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత ఏడాది లక్ష్యమే నెరవేరకపోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2011-12) రాష్ట్రంలో లక్ష హెక్టార్లలో /ఎకరాల్లో అదనంగా సాగు ఛేయాలని కేంద్రం రాష్ట్రానికి లక్ష్యం నిర్దేశించింది.

వైద్య పరంగా ఉపయోగాలు

[మార్చు]
పామాయిల్ పొలం, పీర రామచంద్రపురం

మీడియం చైన్‌ ట్రైగ్లిజరైడ్స్ దీనిలో ఉంటాయి కావున జీర్ణము చేసుకోవడం చాలా తేకిక . తల్లి పాలతో సమానము . శాకాహారము అయినందున కొలెస్టిరాల్ ఉండదు . oleic acid (omega-9)39%, linolic acid (omega-6) 10% ఉంటాయి కావున ఆరోగ్యానికి మంచిది . ఈ ఎసెన్‌సియల్ ఫ్యాటీ యాసిడ్స్ రక్తం లోని కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి. దీనిలో యాంటి ఆక్షిడెంట్స్ (Tocotrienols) ఉన్నందున వ్యాధుల బారిన పడకుండా కాపాడును . పామ్‌ ఆయిల్ లో బీటాకెరోటీన్స్ పుష్క్లముగా లభించును .

Fatty acid content of palm oil

[మార్చు]

Type of fatty acid pct Palmitic saturated C16------ 44.3% Stearic saturated C18--------- 4.6% Myristic saturated C14-------- 1.0% Oleic monounsaturated C18- 38.7% Linoleic polyunsaturated C18 10.5% Other/Unknown------------- 0.9%

సంవత్సరం సాగులో ఉన్న పంట (హెక్టార్లలో) పెంచిన పంట లక్ష్యం (హెక్టార్లలో) లక్ష్యం చేరటానికి వేసిన పంట (హెక్టార్లలో)
2010-11 2,50,000 37,065 18,167
2011-12 2,68,167 1,00,000 ---
  • నోట్: హెక్టార్లా / ఎకరాలా అన్నది సందేహంగా వుంది.
  • ఆయిల్ పాం అభివృద్ధికి ఈ సంవత్సరం బడ్జెట్టులో ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు కేటాయింఛటం శుభసూచకం. కేంద్ర ప్రభుత్వం సాగు విస్తీర్ణంపైనే కాకుండా, పరిశోధన, అభివృద్ధికి కూడా పెద్ద పీట వెయ్యాలని రైతులు కోరుతున్నారు. 1990 లలో కేంద్ర ప్రభుత్వం, దేశంలోని వంట నూనెల కొరతను తీర్చటానికి, ఒక పైలట్ ప్రాజక్టు కింద, ఆయిల్ పాం సాగును అభివృద్ధి చేయాలని అనుకొంది. ఆయిల్ పాం సాగుచేసే రైతులకు ఇచ్చే సబ్సిడీ వలన, చిన్న రైతులు ఉత్సాహంతో, ఆయిల్‌పాం సాగును చేపట్టారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వం ఏలూరులో 'జాతీయ ఆయిల్ పాం పరిశోధన అభివృద్ధి మండలి'ని (డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ - చిరునామా క్రింద ఉంది), నెలకొల్పినా, రైతులకు ఏమీ ప్రయోజనం లేకపోతోంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు, ఆయిల్‌పాం పొలాలలో ఎదురు అవుతున్న సమస్యలకు పరిష్కారాలు దొరకటంలేదు. పరిశోధన ఫలితాలు, రైతులకు చేరటంలేదు. ధరలలో వచ్చే హెచ్చు తగ్గులను చిన్న రైతులు తట్టుకోలేరు. ప్రభుత్వం ఈ సమస్యకి పరిష్కారం చూడాలి.
  • 5 ఎకరాలనుంచి 15 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ (తుంపర సేద్యము) సబ్సిడీని పెంచేలా, సబ్సిడీ మార్గదర్శక సుత్రాలను సవరించాలి. ఆయిల్‌పాం డ్రిప్, స్ప్రింక్లర్ సేద్యం కావాలి. ఆయిల్ పాం సేద్యానికి 15 ఎకరాలకి సబ్సిడీ ఇచ్చినా, 50,000 రూపాయల పరిమితి విధించారు. కానీ, ఈ పరిమితి 5 ఎకరాలు సాగుచేసే వారికి మాత్రమే పనికి వస్తుంది. 2011-12 సంవత్సరపు బడ్జెట్టులో 300 కోట్ల రూపాయలకు పెంఛారు కాబట్టి, ఈ 50,000 రూపాయల పరిమితిని పెంచితే, ఆయిల్ పాం సాగు మరింతా పెరుగుతుంది. సాగు విస్తీర్ణం పెరిగితే, వంటనూనెల దిగుమతి తగ్గి, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. దేశంమొత్తం మీద, ఆయిల్‌పాం సాగుకు అనుకూలమైన 10 లక్షల హెక్టార్ల భూమిని గుర్తించారు. కానీ, ప్రస్తుతం ఒక లక్ష హెక్టార్లలో మాత్రమే సాగు అవుతుంది (ఆంధ్ర ప్రదేశ్ లో 2,68.167 ఎకరాలలో ఆయిల్‌పాం సాగు అవుతుంది).ఒక హెక్టారుకి 3.5 నుంచి 4.5 టన్నుల పామ్ ఆయిల్ దిగుబడి వస్తుంది. ఆంధ్ర్హ ప్రదేశ లోని కోస్తా జిల్లాలలో, 2 లక్షల హెక్టార్లలో, ఆయిల్ పాం సాగు అవుతుంది. 42,000 హెక్టార్ల సాగుతో పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థానంలో ఉంది.
  • ధరలు - ఆదాయం: ఆయిల్ పాం గెలల (ఎఫ్.ఎఫ్.బి) ధరల హెచ్చు తగ్గులతో, ఆయిల్ పాం రైతులు, తల్లడిల్లుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముడి పాం ఆయిల్ ధరలను బట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధరలను నిర్ణయిస్తుంది. ఆయిల్ పాం తోటలలో, అంతర పంటలు వేయటానికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకి పరిష్కారం కనుక్కుంటే, రైతుల ఆదాయం పెరిగి, ఆయిల్‌పాం సాగు నిలదొక్కుకుంటుంది. ఈ సమస్యను, పరిశోధన మండలి, తొందరగా పరిష్కరించాలి. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో, పామాయిల్ తోటలు అంతర పంటలుగా (కొబ్బరి తోటలలో, చెరుకు తోటలలో) సాగు చేస్తున్నారు.

చిరునామా

[మార్చు]
  • డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్,
  • (ఇంతకు ముందు పేరు : నేషనల్ రీసెర్ఛ్ సెంటర్ ఫర్ ఆయిల్ పామ్)
  • (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్)
  • పెదవేగి - పిన్:534450,
  • పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ (ఐ.సి.ఏ.ఆర్ ప్రాజక్ట్)

కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పామాయిల్&oldid=4286621" నుండి వెలికితీశారు