గుంటుపల్లి (కామవరపుకోట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుంటుపల్లి
గ్రామం
కొండపైనున్న గుంటుపల్లి బౌద్ధ గుహాలయాలకు స్వాగత తోరణం
కొండపైనున్న గుంటుపల్లి బౌద్ధ గుహాలయాలకు స్వాగత తోరణం
దేశంభారత దేశము
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి
మండలంకామవరపుకోట
జనాభా
(2011)
 • మొత్తం4,113
భాషలు
 • అధికార భాషలుతెలుగు
ప్రామాణిక కాలమానముUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్ సంఖ్య
534449

గుంటుపల్లె లేదా గుంటుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామం.[1]. పురాతనమైన బౌద్ధరామ స్థానంగా ఈ గ్రామం. చారిత్రకంగా ప్రసిద్ధి చెందినది. జీలకర్రగూడెం గుంటుపల్లి గ్రామాలు ఒకే పంచాయితీ పరిధిలో ఉన్నాయి.ఈ బౌద్ద గుహలు గుంటుపల్లి గుహలుగా ప్రసిద్ధికెక్కినా అవి నిజానికి జీలకర్రగూడెం ఊర్ని ఆనుకొనే ఉన్నాయి. గుంటుపల్లి నుండి దాదాపు మూడు కీలో మీటర్లు వెళితే కాని జీలకర్రగూడెం రాదు జీలకర్ర గూడెం మీదుగానే కొండ పైకి మార్గం ఉంది. ఆంధ్ర దేశంలో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు. ఇటువంటి క్షేత్రాలలో బహుశా భట్టిప్రోలు అన్నింటికంటే ప్రాచీనమైనది. గుంటుపల్లి కూడా సుమారు అదే కాలానికి చెందినది. అంటే క్రీ.పూ.3వ శతాబ్దికే ఇవి ముఖ్యమైన బౌద్ధక్షేత్రాలు.[3] గుంటుపల్లిని ఇటీవలి వరకు బౌద్ధ క్షేత్రంగానే భావించారు. కానీ ఇటీవల లభ్యమైన మహామేఘవాహన సిరిసదా శాసనము, ఖారవేలుని శాసనాల వలన ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని నిరూపితమౌతున్నది.[4] ఈ గ్రామంలో ప్రాథమిక విద్యా సౌకర్యాలున్నాయి. ఉన్నత విద్య సౌకర్యాలు కామవరపు కోటలోను, సాంకేతిక విద్యా సౌకర్యాలు జంగా రెడ్డి గూ డెంలోను, వృత్తి విద్య, వైద్య విద్య సౌకర్యాలు ఏలూరులోను ఉన్నాయి.

గ్రామం స్వరూపం[మార్చు]

గుంటుపల్లి, జీలకర్రగూడెం పంచాయితీ ఆఫీసు
వ్యవసాయం

ఎర్రమట్టి కలిగిన కొండల అంచున ఉన్న ఈ గ్రామాలలో వ్యవసాయం ప్రధానంగా మెరక తోటల పెంపకం - టేకు, కొబ్బరి, పామాయిల్, మామిడి, సపోటా, జీడిమామిడి అధికంగా జరుగుతున్నది. చెరువు క్రింద వరి వ్యవసాయం సాగుతుంది.

జనాభా

గుంటుపల్లి, జీలకర్ర గూడెం, ఇతర శివారు గ్రామాలతో కలిపి జనాభా వివరాలు (2001 జనగణన ప్రకారం) ఇలా ఉన్నాయి.[2]

 • మొత్తం ఇళ్ళు: 1146
 • మొత్తం జనాభా: 4136 ( పురుషుల సంఖ్య: 2136, స్త్రీల సంఖ్య: 2000)
 • 6 సంవత్సరాలలోపు పిల్లలు: 506 (మగ 249, ఆడ 257)
 • షెడ్యూల్ కులాల వారు: 1256 (మగ 677, ఆడ 579)
 • షెడ్యూల్డ్ తెగలవారు: 19 (మగ 9, ఆడ 10)
విద్య

గ్రామ విద్యార్థుల కొరకు జీలకర్ర గూడెంలో ఒక ఉన్నత పాఠశాల ఉంది.

వైద్యం
రవాణా

జిల్లా కేంద్రమైన ఏలూరు నుండి గుంటుపల్లికి బస్సు సౌకర్యం ఉంది. సుమారు 30 కిలోమీటర్ల దూరం. కాని బస్సుపైన జీలకర్ర గూడెం అనే బోర్డు ఉంటుంది. ఏలూరు నుండి జీలకర్రగూడెం వెళ్ళే బస్సులు గోపన్నపాలెం, పెదవేగి, కూచింపూడి మీదుగా జీలకర్రగూడెం వెళతాయి. మరోమార్గంలో ఏలూరు నుండి గోపన్నపాలెం, ముండూరు, తడికలపూడిల మీదుగా కామవరపుకోట వెళ్ళవచ్చును. అక్కడినుండి జీలకర్రగూడేనికి సుమారు 5 కిలోమీటర్లు దూరం. ఏలూరు పాత బస్సు స్టాండులోనూ, సోమవరప్పాడు దగ్గరా "గుంటుపల్లి బౌద్ధారామాలను దర్శించండి" అనే చిన్న బోర్డులు పెట్టారు. స్కూలు, కాలేజీ విద్యార్థులు ఇక్కడికి పిక్నిక్‌లకోసం రావడం జరుగుతుంది. గ్రామంలో ప్రత్యేకించి యాత్రికులకు వసతి సౌకర్యాలు లేవు. రోడ్డు ప్రక్కన ఉండే చిన్న చిన్న హోటళ్ళలో టిఫిను, భోజనం లభిస్తాయి. కొండపైకి వెళ్ళే దారి మొదట్లో పురావస్తుశాఖవారి ఆఫీసులో ఒక ఉద్యోగి టిక్కెట్లు ఇస్తాడు. ఒకో టిక్కెట్టు 5సరి చూడాలి రూపాయలు. కొండపైని నీళ్ళు లభించవు గనుక అక్కడ చిన్న కుండలో మంచినీరు ఉంచారు.

చారిత్రిక ప్రాధాన్యత[మార్చు]

పెద్ద బౌద్ధ విహారం గదుల సముదాయం
చిన్న బౌద్ధ విహారం గదులు
ఆంధ్రదేశంలో బౌద్ధక్షేత్రాలలో గుంటుపల్లి (కామవరపుకోట) ఒక ప్రముఖ క్షేత్రం
వివిధ కట్టడాలను వివరించే బోర్డు - పురావస్తు పరిశోధనా సంస్థ వారిది

ఆంధ్ర దేశంలో బుద్ధుని కాలంనుండి బౌద్ధమతం జనప్రియమైన జీవనవిధానంగా విలసిల్లింది. ఆంధ్ర దేశంలో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు. ఇటువంటి క్షేత్రాలలో బహుశా భట్టిప్రోలు అన్నింటికంటే ప్రాచీనమైనది. గుంటుపల్లి కూడా సుమారు అదే కాలానికి చెందినది. అంటే క్రీ.పూ.3వ శతాబ్దికే ఇవి ముఖ్యమైన బౌద్ధక్షేత్రాలు.[3] గుంటుపల్లిని ఇటీవలి వరకు బౌద్ధ క్షేత్రంగానే భావించారు. కానీ ఇటీవల లభ్యమైన మహామేఘవాహన సిరిసదా శాసనము, ఖారవేలుని శాసనాల వలన ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని నిరూపితమౌతున్నది.[4] గుంటుపల్లి వూరి కొండలపైన కనుగొన్న బౌద్ధారామాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైనవి. ఇవి చారిత్రికమైన, పరిరక్షింపబడ వలసిన పురాతన అవశేషాలుగా భారత పురావస్తు శాఖ నిర్ణయించింది.[5] కొండమీద చైత్యగృహము, ఆరామ మంటపాలు, స్తూపాలు ఉన్నాయి. వీటిలో ఒక స్తూపంలో ధాతుకరండం దొరికింది. ఈ తీర్థం భక్తులను విశేషంగా ఆకర్షించేదనడానికి ఇక్కడ కనుపించే పెక్కు ఉద్దేశిక స్తూపాలే నిదర్శనం.కొండలపైన అంచులో తొలిచిన గుహాలయం, బౌద్ధారామాలు, పైన ఉన్న ప్రార్థనా స్తూపాలు, రాతి స్తూపం వంటి కట్టడాలు క్రీ.పూ. 300 నుండి క్రీ.శ.300 మధ్యకాలంలో విస్తరిల్లినవని భావిస్తున్నారు. అలంకరణలకు ప్రాముఖ్యం లేకుండా కట్టిన కట్టడాలు, బుద్ధుని ప్రతిమ వంటివి లేకపోవడం - వంటి అంశాలవలన ఇవి బౌద్ధమతం ఆరంభకాలం (హీనయాన బౌద్ధం) నాటి ఆరామాలని విశ్లేషిస్తున్నారు. (బౌద్ధం ఆరంభకాలంలో శిల్పాలంకరణకు ఆదరణ ఉండేది కాదు. దృశ్య కళలు ఇంద్రియ వాంఛలను ప్రకోపింపచేస్తాయని బుద్ధుడు వాటిని నిషేధించాడు. సుందర కావ్య నిర్మాణాన్ని కూడా నిరసించారు. వాటి ప్రయోజనం ధర్మానురక్తిని కల్గించడానికే పరిమితమవ్వాలి కాని రసానుభూతి కాదు - మౌలిక బౌద్ధంలో క్రమశిక్షన అంత కఠినంగా ఉండేది.[3]) జీలకర్రగూడెం, కంఠమనేనివారి గూడెం గ్రామాలలో కూడా మరికొన్ని బౌద్ధారామాలు కనుగొన్నారు.

బౌద్దారామ వివరాలు[మార్చు]

గుహాలయం

క్రీ.పూ. 3-2వ శతాబ్దానికి చెందిన ఈ చైత్యం అతి ప్రాచీనమైనది. గుండ్రంగా ఉన్న ఈ గుహ లోపల స్తూపము (ప్రస్తుతం ధర్మ లింగేశ్వర శివలింగంగా భావిస్తున్నది), చుట్టూరా ప్రదక్షిణా మార్గం ఉన్నాయి. ఈ గుహ పైభాగంలో వాసాలు, ద్వారానికి కమానులు (చెక్క మందిరాలకు వలే) చెక్కబడి ఉన్నాయి. ఈ గుహాలయానికి బీహారులోని సుధామ, లోమస్‌ఋషి గుహాలయాలతో పోలికలున్నాయి.బాగా మందంగా, లావుగా స్తంభం వలె ఉండే స్థాణువునే ధర్మలింగేశ్వర స్వామి అను లింగంగా పూజిస్తున్నారు. అయితే పేరులో ధర్మ శబ్దంసాధారణంగా బౌద్ధమునే సూచిస్తుంది.అమరావతి (ధాన్యకటకం), భట్టిప్రోలు మొదలయిన బౌద్ధక్షేత్రాల్లో లభించిన ధవళ స్తంభం వంటి స్తంభంపై ఇక్కడ లభించిన శాసనం బట్టి చుస్తే ఇది జైనక్షేత్రమని పలువురి పరిశోధకుల అభిప్రాయము. ఆస్తంభం పై ఇలా వ్రాసి ఉన్నది" మహారాజస, కళింగాధిప, మహిషకాధిపస, మహామేఖవాహనస, సిరిసనదస, లేఖకస చులగోమస మణ్డపోదానమ్- ఒరిస్సా హాధిగుంఫా (హస్తిగుహ) శాసనంలో కళింగరాజు ఖారవేలుని సైన్యాలు పశ్చిమంగా కృష్ణానదివైపు వెళ్ళి ఆవమూషికులతో (తెలుగునాటివారే) పోరినట్లు ఇందు అభిప్రాయము. లిపిని బట్టి ఇది క్రీ.పూ.2వ శతాబ్దకాలమునది తెలియుచున్నది.ఇక్కడ ఉన్న స్తూపాలలో ఒకదానికి ఇటికి ఆవకవేదిక ఉన్నదట. దానిపైకి వెళ్ళెందుకు ఉన్న రాతిమట్లపై శిథిలాక్షరాలు సునద అనే ఆమె సుయజ్ఞనాధుని ఆనతన ఆ మెట్లు కట్టించెనని ఉంది.అలగ్జాండర్ రియా అనే పురావస్తు అధికారి ప్రప్రధంగా ఈ స్తూపాలను గుర్తించారు.చైతన్యాలయంతో పాటు పెద్ద శిలాస్తూపం కూడా ఆయన పరిశోధనే. ఈ పెద్ద శిలా స్తూపం (ధర్మలింగేశ్వర) చుట్టూ ప్రదక్షిణమార్గం ఉంది.ఇది 8 అడుగుల ఎత్తులో కలదీ స్తూపము. ప్రదక్షిణ చేసినట్లుగా చుట్టు రాతిమెట్లు ఉండటం ఇక్కడ విశేషము.సాధారణంగా బౌద్ధక్షేత్రాల్లో ఆరాధనీయం స్తూపం. కాని ఇక్కడ ఆస్థానంలో ఎత్తయిన ఇటికలవేదిక (సింహాసనం) ఉండిన సూచనల్లో ఆరాధ్యమూర్తిని వేదికపైన వుంచేవారనిపిస్తుంది. ఈవేదిక ముందు భాగాన మూడు గుళ్ళలో పూజనీయులైన ఆచార్యుల రూపాలో, సాంకేతిక రూపాలో ఉండెవేమో అని అనుకొనవచ్చును! ఈ ఇటిక చైత్యం అమరావతి జగ్గయ్యపేట మొ.క్షేత్రాలలోని చైత్యాలయాలను పోలిఉన్నందున ఈ ఇటికిల చైత్యాలయాలు క్రీ.శ.2వ శతాబ్ది కాలనికి నిర్మింపబడి ఉండవచ్చును. సాతవాహనుల ఆచార్యుడు నాగార్జుని నాటిది. ఈగుహాలయం ముఖద్వారం పురాతన బౌద్ధరామాల వలెనే గుర్రపులాడా (అర్ధచంద్రాకారం) కలిగి ఉంది.బీహారులోని బారాబర్ లోమశఋషి గుహాలయ ముఖద్వారం పోలికలోనే ఈముఖద్వారం నిర్మించబడింది.అయితే ఒకటే బేధం ఇక్కడ ముఖద్వారం ముందు ఉంటే అక్క వెనక ఉంది.అక్కడ అలంకార శిల్పం ఉన్నది ఇక్కడ లేదు.మహారాష్ట్రలోని భాజ గుహాలయ ముఖద్వారం కూడా ఇక్కడ ముఖద్వారం వలెనే ఉండును. క్రీ.పూ. 250 తర్వాతనే అశోకుడు గుహాలయ నిర్మాణకార్యక్రమాలు చేపట్టినాడు.పోలికలను బట్టి గుంటుపల్లి బారాబర్ గుంఫలు రెండును అశోకుని కాలమునటివనే చెప్పవచ్చును.అశోకుడు బౌద్ధం అవలింబించిక పూర్వమే (క్రీ.పూ.250) ఆంధ్రంలో బౌద్ధం ఉంది.అతిపురాతనమైన స్తూపాలు ఎత్తు తక్కువగా ఉండి ఎక్కువ స్థూలంగా ఉండే వంటారు. ఆలెక్కను పోల్చి చూస్తే ఇక్కడి స్తూపాలు బహుపురాతనమైనవని మరికొందరి పరిశోధకుల అభిప్రాయము. మన ఇక్షాకుల అనంతరం వేంగి నేలినది సాలంకాయనులు. వారి రాజధాని విజయవేంగీపురం. నేటి ఏలూరు తాలూకా వేగిదిబ్బలు. వారు బౌద్ధులుకారు. సూర్యోపాసకులు. కాని బౌద్ధవిరోధులు కారణే విషయం వారి పాలన కాలంలో గుంటుపల్లి క్షేత్రాలకు-తూర్పున బర్మాప్రాంతాలకు యాత్రికులు సుముద్రయానం చేసేవారని వైనమున్నది.ఆరేవు బంగాళాఖాతంలో కలిసిపోయినందునదని పరిశోధకుల అభిప్రాయం.అది నేటి కళింగ పట్నం. మహాకవి కాళిదాసు సమకాలికుడు, మహాపండితుడు అయిన దిస్నాగాచార్యుడు కొంతకాలం అజంతా క్షేత్రంలో ఉండి చరమకాలాన వేంగీ రాజధానికి ఉత్తరంగా ఉన్న క్షేత్రంలో సిద్ధిపొందిన వైనమున్నది. క్రీ.శ.7వ శతాబ్దపు చైనా యాత్రికుడు యువాన చాంగ్ ఈ ఆచార్యుడినే పుసచెన్నా అని అన్నాడు.తర్వాత వేంగి నేలిన విష్ణుకుండినులు ఒకరిద్దరు బౌద్ధాన్ని పోషించారు.కాని వారి నాట ప్రారంభమైన జీర్ణావస్థ వేంగీచాళుక్యుల నాటికి పూర్తిగా శిథిలమై, వేంగీ నిర్మానుష్యమై పోయింది. గుంటుపల్లిలోనే కాదు వేంగిలో కూడా ఎక్కడా తాంత్రిక బౌద్ధం కనబడినట్లు కనబడదు.కావున ఇక్కడ క్షేత్రం యొక్క పూర్వనామం వేంగిళ (వింగిల) అయిఉండునా అన్నది ఇప్పటికీ చర్చనీయాంశమే?

పెద్ద బౌద్ధ విహారము / ఆరామము

ఇది ఇసుకరాతి కొండ అంచులో తొలచిన గుహల సముదాయము. బౌద్ధ భిక్షువులకు నివాస స్థానము. గుహలు ఒకదానికొకటి గుండ్రని కిటికీలతో కలుపబడి ఉన్నాయి. గుహలలోకి ఊరే నీరు, వర్షపు నీరు కాలువల ద్వారా పగులులలోనికి ప్రవహిస్తుంది.

మొక్కుబడి స్తూపములు

కొండపైని వివిధ ఆకృతులలో, ముఖ్యంగా గుండ్రంగా సుమారు అరవై మొక్కుబడి స్తూపాలున్నాయి. ఇవి రాళ్ళతో లేదా ఇటుకలతో కట్టబడిన పీఠములపై నిర్మింపబడినవి. వీటిమధ్య మొక్కుబడి చైత్య గృహాలు కూడా ఉన్నాయి.

రాతి స్తూపములు

క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన ఈ స్తూపం పైభాగం అంతా రాతి ఫలకాలతో కప్పబడి ఉంది. క్రీ.పూ.19వ శతాబ్దం కాలంలో దీనిలో కొంత భాగం త్రవ్వకాలు జరిపారు. అంతకు మునుపే నిధులు వెదికేవారి బారినపడి ఇది నాశనమై ఉంది. దీని గుమ్మటం ఎత్తు 2.62 మీ., వ్యాసం 4.88 మీ.

శిథిల మంటపం

ఇది నాలుగు విరిగిన స్తంభాలతో ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న కట్టడం. పూర్వం బౌద్ధ భిక్షువుల సమావేశ మందిరం. ఇక్కడ లభించిన శిలా స్తంభ శాసనంలో క్రీ.పూ. 1 నుండి క్రీ.శ.5వ శతాబ్దం వరకు లభించిన దానముల గురించి వివరణ ఉంది. ఈ కట్టడం అసలు పొడవు 56 అడుగులు, వెడల్పు 34 అడుగులు.

చైత్య గృహము

ఇది గజపృష్టాకారంలో 17.6 మీటర్లు పొడవు, 4.42 మీటర్లు వెడల్పు కలిగి ఉంది. దీని గోడ 1.32 మీటర్లు ఎత్తువరకు లభించింది. దీని ప్రవేశ ద్వారములకు ఇరువైపుల దేవ కోష్టములలో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు ఉండవచ్చును. దీని అలంకృత అధిష్టానము నాసిక్, కార్లే గుహలను పోలి ఉంది.

ఇటుకల స్తూప చైత్యము

ఇది కూడా క్రీ.పూ.3-2వ శతాబ్దానికు చెందిన కట్టడం. కొండ తూర్పు చివర ఎత్తైన సమతల ప్రదేశంలో నిర్మింపబడింది. దీనిని చేరుకొనే మెట్ల వరుసను క్రీ.పూ.2-1వ శతాబ్దమునకు చెందిన ఒక ఉపాసిక కట్టించెనని తెలియవస్తున్నది. ఈ చైత్య గృహము 11మీ. వ్యాసం కలిగి ఉంది. స్తూపం చుట్టూ 1.8 మీటర్ల వెడల్పు గల ప్రదక్షిణాపధం ఉంది.

ఇటీవల లభ్యమైనవి

ఇటీవల 04-12-2007న ఈ గుహాసముదాయంలో క్రీస్తుశకారంభమునకు చెందినదిగా బావిస్తున్న ఒక బ్రహ్మలిపితో ఉన్న శాసనం లభ్యమయినది. ఈశాసనం ద్వారా పలు చారిత్రక సంఘటనలు వెలుగు చూసాయి.నాడు తెలుగులో నూతనంగా రూపొందుతున్న తెలుగు నుడి కారాలు,గుణింతాల రూపాలను ఈ చలువరాతి ఫలకం ఆవిష్కరించింది. ప్రసిద్ధ బౌద్దాచార్యుడైన మిడిలకుడు అనే బౌద్ద సన్యాసి ఈ ఫలకాన్ని గుంటుపల్లి గుహలలో నివసించే బౌద్ద బిక్షులకు దానం చేసినట్లు ఈ శిలా ఫలకంలో ప్రాకృత భాషలో ఉంది. కేంద్ర పురావస్తుశాఖ ఆంధ్ర రాష్ట్ర విభాగం ఈ శిలా శాసనాన్ని వెలికి తీసింది. గుంటుపల్లి West Godavari జిల్లా, కామవరపుకోట మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కామవరపుకోట నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1206 ఇళ్లతో, 4113 జనాభాతో 502 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2086, ఆడవారి సంఖ్య 2027. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1232 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 35. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588189[6].పిన్ కోడ్: 534449.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, అనియత విద్యా కేంద్రం కామవరపుకోటలోను, ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు జంగారెడ్డిగూడెంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఏలూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

గుంటుపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

గుంటుపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 43 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 10 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 1 హెక్టార్లు
 • బంజరు భూమి: 103 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 343 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 93 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 354 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

గుంటుపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • బావులు/బోరు బావులు: 123 హెక్టార్లు
 • చెరువులు: 52 హెక్టార్లు
 • వాటర్‌షెడ్ కింద: 178 హెక్టార్లు

కొండపైని మొక్కుబడి స్తూపాల చిత్రం[మార్చు]

కొండపైని మొక్కుబడి స్తూపాలు, చిత్రం వెనుక భాగంలో ప్రధాన స్తూపం. కుడిప్రక్క చెట్టు క్రింద పురావస్తు త్రవ్వకాల కార్మికులు భోజనాలు చేస్తున్నారు. ముందుభాగంలో పిలల్లు క్రికెట్ ఆడుతున్నారు. (త్రవ్వకాలలో తీసిన పొడవాటి రాళ్ళు వికెట్‌లుగా ఉపయోగపడతాయి)
కొండపైని మొక్కుబడి స్తూపాలు, చిత్రం వెనుక భాగంలో ప్రధాన స్తూపం. కుడిప్రక్క చెట్టు క్రింద పురావస్తు త్రవ్వకాల కార్మికులు భోజనాలు చేస్తున్నారు. ముందుభాగంలో పిలల్లు క్రికెట్ ఆడుతున్నారు.
(త్రవ్వకాలలో తీసిన పొడవాటి రాళ్ళు వికెట్‌లుగా ఉపయోగపడతాయి)


చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

గణాంకాలు[మార్చు]

Population (2011) • Total 4,113

మూలాలు, బయటి లింకులు[మార్చు]

 1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; censusindia.gov.in అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 2. "పశ్చిమ గోదావరి జిల్లా జనాభా వివరాలు". Archived from the original on 2005-05-10. Retrieved 2007-12-05.
 3. 3.0 3.1 డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు రచన బౌద్ధము-ఆంధ్రము
 4. Studies in Jaina art and iconography and allied subjects in honour of Dr. U ... By R. T. Vyas, Umakant Premanand Shah పేజీ.31 [1]
 5. http://asi.nic.in/asi_monu_alphalist_andhra.asp Archived 2014-06-25 at the Wayback Machine The complete list from West Godavari District is
  132. Mounds containing Buddhist remains - Arugolanu
  133. Mounds locally known as Bhimalingadibba - Denduluru
  134. Buddhist monuments - 1) Rock-cut temple 2) Large Monastery 3) Small Monastery 4) Brick Chaitya 5) Ruined Mandapa 6) Stone built Stupa and Large group of stupas. - Guntupalle
  135. The caves and structural stupa of Archaeological interest on Dharmalingesvarasvami hill- Jilakarragudem (Hamlet of Guntupalle)
  136. The mounds of Pedavegi : Dibba No.1 Dibba No.2, Dibba No. 3, Dibba No. 4, Dibba No. 5. - Pedavegi
  137. Ancient Mounds - Pedavegi
 6. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".