టేకు
టేకు | |
---|---|
![]() |
|
టేకు ఆకులు మరియు పండ్లు. | |
శాస్త్రీయ వర్గీకరణ | |
రాజ్యం: | ప్లాంటే |
విభాగం: | మాగ్నోలియోఫైటా |
తరగతి: | మాగ్నోలియోప్సిడా |
క్రమం: | Lamiales |
కుటుంబం: | వెర్బినేసి |
జాతి: | టెక్టోనా |
జాతులు | |
టెక్టోనా గ్రాండిస్ |
టేకు చెట్టు శ్రేష్టమైన కలపకు ప్రసిద్ధి. దీన్ని కలపలలో రారాజు (King of Timbers) గా పరిగణిస్తారు. భారతదేశంలోని టేకు వెర్బినేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం 'టెక్టోనా గ్రాండిస్'. టెక్టోనా అంటే వడ్రంగి ఇష్టపడేది అని అర్ధం. మనదేశ జనాభాలో 30 శాతం మంది టేకు కలపను ఉపయోగిస్తున్నారని ఒక అటవీశాఖ సర్వేలో తేలింది. కానీ మంచి కలప తయారుకావడానికి కనీసం 15-20 సంవత్సరాలు పడుతుంది.
టేకు కలప[మార్చు]
టేకు కలప దృఢంగా ఉండి, చెదలను తట్టుకొని, ఎక్కువకాలం మన్నుతుంది. ముదురు గోధుమ రంగు చారలు కలిగి దీనితో చేసిన వస్తువులు చాలా అందంగా ఉంటాయి. అందువలన ఈ కలపని గృహోపకరణాల తయారీలో వాడడానికి ఎక్కువమంది ఇష్టపడతారు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు.
సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో టేకుచూడండి. |