తొడిమ
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తొడిమ అనగా కాండంనకు ఆకునకు, కాండంనకు పుష్పంనకు, కాండంనకు కాయకు మధ్య ఉండే కాండం వంటి భాగాన్ని తొడిమ అంటారు. తొడిమను ఇంగ్లీషులో Petiole అంటారు.
తొడిమ బొప్పాయి, గంగరావి మొదలగు కొన్నిటిలో పొడుగుగా ఉండును. పొన్న, రేగు మొదలగు కొన్నిటిలో పొట్టిగా నుండును. నేల ఉసిరి ఆకులకును వాయింట యొక్క చిట్టి ఆకులకును తొడిమ లేనే లేదు. తొడిమనంటుకొని దానికిరు ప్రక్కల కణుపు వద్ద చిన్న రేకలవంటివి కొన్నిటిలో ఉండును. ఉదాహరణకు: గులాబి. వానికి కణుపుపుచ్ఛములని పేరు. ఇవి ఆకులు మిక్కిలి చిన్నవిగా ఉన్నప్పుడు కణుపుసందులందు మొలచెడు మొగ్గలకు ఎండ తగులనీయకుండ కాపాడుచుండును. రేగు చెట్టులోనివి ముండ్లుగా మారియున్నవి. తొగరు చెట్టులో రెండాకులకును మధ్యగా నున్నవి.